Sensex sees biggest weekly gain in 2016, Nifty ends above 7200

Sensex sees biggest weekly gain in 2016

sensex, nifty, indian share market, indian stock exchange, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve chairperson

For the week, the Sensex and Nifty rallied 3 percent each, the biggest weekly upside in current calendar year

అధిక లాభాలను అర్జించిన వారం..7200 మార్కు దాటిన నిఫ్టీ

Posted: 02/19/2016 05:09 PM IST
Sensex sees biggest weekly gain in 2016

భారత స్టాక్ మార్కెట్లో ఇవాళ్టితో ముగిసిన వారాంతం ప్రస్తుత ఏడాదిలోనే అధిక లాభాలను అందించిన వారంగా నమోదైయ్యింది. దేశీయ సూచీలు ఇవాళ కూడా లాభాలతో కొనసాగి వరుస మూడోవ రోజ లాభాల పర్వం కొనసాగింది. సెషన్ ఆరంభంలో 100 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగి తీవ్ర ఒడిదుడుకులకు గురైనప్పటికీ, మార్కెట్లు ముగిసేసరికి లాభాలను నమోదు చేసి సెంటిమెంట్ ను నిలుపుకుంది. మధ్యాహ్నం తరువాత ఎఫ్ఐఐలు, దేశవాళీ ఫండ్ సంస్థల నుంచి వచ్చిన కొనుగోళ్లు లాభాలను అందించాయి దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 60 పాయింట్ల లాభంతో 23,709.15 పాయింట్ల వద్దకు, అటు నిఫ్టీ 19 పాయింట్లు పెరిగి 7,210.75 పాయింట్ల వద్దకు చేరాయి.

ఇవాళ మొత్తం 2,642 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,299 కంపెనీలు లాభాల్లోను, 1,211 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.12 శాతం నష్టపోగా, స్మాల్ క్యాప్ 0.16 శాతం లాభపడింది. ఎన్ఎస్ఈ-50లో 26 కంపెనీలు లాభాల్లో నడిచాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్బీఐ, హీరో మోటో కార్ప్, బోష్ లిమిటెడ్, ఏషియన్ పెయింట్స్ తదితర కంపెనీల షేర్లు లాభపడగా, బీపీసీఎల్, మారుతి సుజుకి, బీహెచ్ఈఎల్, వీఈడీఎల్, కోల్ ఇండియా తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles