Nifty ends below 8250, Sensex weak; Maruti, Wipro up 1-2%

Sensex slips by 109 points for second straight day

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, Federal Reserve, fiscal consolidation, GDP growth, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

Buoyed up by Q2 earnings, Maruti ended with 2 percent gains. The country's largest car maker's profit shot up 42 percent year-on-year to Rs 1,225.6 crore, driven by strong revenue and operational growth. Profit growth was limited due to lower other income and sharp rise in tax cost.

నష్టాల్లో మార్కెట్లు.. మరోమారు 8250 మార్కుకు దిగువన సెన్సెక్స్

Posted: 10/27/2015 07:39 PM IST
Sensex slips by 109 points for second straight day

విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాలతో వరుసగా ఈ వారంలో రెండో రోజు స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. అగ్రరాజ్యం అమెరికా కేంద్రీయ బ్యాంక్ ఫెడరల్ రిజర్వు త్వరలో వడ్డీ రేట్లను సమీక్షించనుందన్న వార్తల నేపత్యంలో మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో దేశీయ సూచీలు నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ మరోమారు 8250 మార్కుకు దిగవన ట్రేడింగ్ ముగించింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కారణంగా నిన్న నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్లను ఇవాళ ఫెడరల్ రిజర్వు ద్రవ్యపరిమితి విధాన సమీక్ష సమావేశం వార్తలు దెబ్బతిశాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభంతోనే మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 109 పాయింట్లు నష్టాన్ని మూటగట్టుకుని 27 వేల 253 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ కూడా 28 పాయింట్లు నష్టంతో 8,232 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది.

ఈ తరుణంలో ఇవాల మొత్తంగా 1264 షేర్లు లాభాలను ఆర్జించగా, 1446 షేర్లు నష్టాలను చవిచూశాయి. కాగా 142 సంస్థల షేర్లు తటస్థంగా వున్నాయి. ఈ క్రమంలో బిఎస్సీ బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిష్టీ క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్, ఐటీ, మెటల్స్, అయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, టెక్నాలజీ సూచీలు నష్టాలలో చవిచూడగా, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, అయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ భారీగా నష్టాలను ఎదుర్కోన్నాయి. ఎఫ్ఎంజీసీ,, మద్య తరహా, చిన్న తరహా పరిశ్రమల సంస్థల సూచీలు లాభాలను అర్జించాయి. ఈ నేపథ్యంలో మారుతి సుజుకీ, అల్ట్రా టెక్ సిమెంట్, సన్ ఫార్మా, బిపిసిఎల్, ఏషియన్ పెయింట్స్ తదితర సంస్థలు లాభాలను ఆర్జించగా, లుపిన్, ఓఎన్ జీసీ, గెయిల్, హెచ్ డీ ఎఫ్ సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర సంస్థల షేర్లు అధిక నష్టాలను చవిచూశాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Gold and silver  indian rupee  RBI  

Other Articles