Sensex snaps 6-day rally, down 190 pts; Midcap falls 1%

Market logs first drop in seven days bse sensex cracks 190 points

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, Federal Reserve, fiscal consolidation, GDP growth, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

Logging its first drop in seven days, the benchmark BSE Sensex today retreated from 1-1/2 months high after falling over 190 points to end below the 27,000- level, dragged down by profit-taking, tracking weak trend in other Asian markets.

6 రోజుల లాభాలకు బ్రేకులు.. 190 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్

Posted: 10/08/2015 06:21 PM IST
Market logs first drop in seven days bse sensex cracks 190 points

విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాలకు తోడు ఆసియా మార్కెట్ల నుంచి బలహీన పవనాలు తోడవ్వడంతో.. భారతీయ స్టాక్ మార్కెట్లకు గత అరు రోజు లాభాలుగా వచ్చిన లాభాలకు బ్రేకులు పడ్డాయి. ఇవాళ మార్కెట్లు ప్రారంభం నుంచి నష్టాలను చవిచూశాయి. ఆరు రోజులుగా లాభాల్లో సాగుతున్న క్రమంలో ఏడవ రోజు మదుపర్ల సెంటిమెంట్ వీక్ గా వుండటం కూడా మార్కెట్ల నష్టాలకు కారణంగా అనలిష్టులు చెబుతున్నారు. ఉదయం పది గంటల సమయంలోనే సెన్సెక్ 100 పాయింట్లు నష్టాన్ని మూటగట్టుకోగా, నిఫ్టీ కూడా 8150 పాయింట్ల వద్ద ట్రేడింగ్ సాగించింది. మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 190 పాయింట్లు నష్టపోయి నెలన్నర కనిష్టస్థాయికి చేరాయి. సెన్సెక్స్ 26,846 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించగా, అటు నిఫ్టీ కూడా 48 పాయింట్లు నష్టపోయి 8,129 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది.

ఈ క్రమంలో కన్జూమర్ డ్యూరబుల్స్, మెటల్స్ రంగాలకు చెందిన సూచీలు మినహా అన్ని సూచీలు నష్టాలలను చవిచూశాయి. బ్యాంకింగ్, బ్యాకింగ్ నిఫ్టీ, హెల్త్ కేర్, మిడ్ క్యాప్, రంగాలకు చెందిన సూచీలు భారీగా నష్టపోగా, ఆటో, అయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ సూచీలు ఎఫ్ఎంజీసీ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల సూచీలు కూడా నష్టాల బాటలోనే పయనించాయి. ఈ నేపథ్యంలో వేదంతా, అల్ట్రాటెక్ సిమెంట్, అదాని పోర్ట్స్, టాటా స్టీల్, హెచ్ సీ ఎల్ టెక్  తదితర సంస్థలు లాభాలను ఆర్జించగా, రిలయన్స్, గెయిల్, ఐటీసీ, ఐసిఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ సహా తదితర సంస్థల షేర్లు అధిక నష్టాలను చవిచూశాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Gold and silver  indian rupee  RBI  

Other Articles