Sensex cracks 541 pts, Nifty holds 7800; metals, banks dive

Sensex sinks 550 points volkswagen crash hits global sentiments

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, Federal Reserve, fiscal consolidation, GDP growth, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

Analysts expect Indian equities to be rangebound in short-to-medium term. According to them, uncertainty over the timing of Fed rate hike and China's economic outlook may have dampened sentiment globally.

మరోమారు కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Posted: 09/22/2015 07:35 PM IST
Sensex sinks 550 points volkswagen crash hits global sentiments

దేశీయ స్టాక్ మార్కెట్లు మరోమారు కుప్పకూలాయి. మునుప్పెన్నడూ లేనట్లుగా ప్రతీ నెల ఒకటి రెండు పర్యాయాలు కుప్పకూలుతూ,, మళ్లీ పైకి లేస్తున్న స్టాయ్ మార్కెట్లు ఇవాళ మరోమారు భారీ నష్టాలను చవిచూశాయి. రెండుగులు వెనక్కు. ఒక్క అడుగు ముందుకు అన్నట్లు కోనసాగుతుంది మార్కట్ల పరిస్థితి. విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన వ్యతిరేక పవనాలకు తోడు మదుపరుల సెంటిమెంట్లకు విఘాతం కలిగే సంకేతాలు రావడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ఐరోపా మార్కెట్ల నుంచి వ్యచ్చిన ప్రతికూల పవనాలతో బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిష్టీ, లోహం, ఆటో రంగానికి సంబంధించిన సూచీలు కుప్పకూలాయి.

ఐరోపా మార్కెట్ల నుంచి చివరి పలు గంటల సమయంలో వీచిన ప్రతికూల పవనాలు మార్కెట్ల పతానికి కారణం కాగా, అందుకు అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీ రేట్ల పెంపు, చైనా మార్కెట్ల అర్థిక సంక్షోభం మదుపరులు సెంటిమెంట్లను దెబ్బతీశాయి. దేశీయ మార్కెట్లు ఇవాళ ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం  ప్రారంభంలో వంద పాయింట్లకు పైగా లాభపడిన మార్కెట్లు ట్రేడర్లు లాభాల స్వీకరణతో ముందుకు సాగాయి.  ఉదయం పది గంటలకు 71 పాయింట్ల లాభంతో 26, 264 వద్ద ట్రేటింగ్ సాగించిన సెన్సెక్స్ సాయింత్రానికి లాభాలు హరించుకుపోగా, భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అటు నిఫ్టీ కూడా నష్టాలలను మూటగట్టుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి 541 పాయింట్లు కోల్పోయిన సెస్సెక్స్ 25 వేల 651 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ను ముగించగా, నిఫ్ట ీకూడా 165 పాయింట్లను కోల్పోయి 7 వేల 812 పాయింట్ల వద్ద ముగిసింది. దీంతో సెస్సెక్స్, నిఫ్టీ రెండూ 2.7 శాతం మేర నష్టాలను చవిచూశాయి.

ఈ క్రమంలో ఆటో, బ్యాకింగ్, బ్యాకిండ్ నిఫ్టీ, మెటల్స్ అటో, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకోగా, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంజీసీ, కన్జూమర్ గూడ్స్ , హెల్త్ కేర్, ఐటీ, అయిల్ అండ్ గ్యాస్, టెక్నాలజీ తదితర సూచీలు స్వల్ప నష్టాలను చవిచూశాయి. ఈ నేపథ్యంలో విఫ్రో, ఇన్పోసిస్, మహింధ్రా అండ్ మహింద్రా, సన్ ఫార్మ తదితర సంస్థలు లాభాలను ఆర్జించగా, హిండాల్కో, వేదంతా, కోల్ ఇ:డియా, టాటా మోటార్స్, ఎన్టీపీసీ సహా తదితర సంస్థల షేర్లు అధిక నష్టాలను చవిచూశాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Gold and silver  indian rupee  RBI  

Other Articles