Taxman to Use Email for Issuing Notices

Emails for issuing income tax notices

Tax notices by e-mail, e-mail, Tax notices, Tax, Income Tax Department, Income tax notice, Income tax email, ITR, Income tax return, Income tax filing

In welcome news for taxpayers, the Income Tax Department has decided to launch a new system of issuing email notices to which an assessee can respond electronically, obviating the need for a physical interface with the taxman which often led to complaints about harassment.

ఈ-మెయిల్ ద్వారా పన్ను నోటీసులు

Posted: 09/21/2015 04:38 PM IST
Emails for issuing income tax notices

పన్ను చెల్లింపులు మరింత సులభతరం కానున్నాయి. పన్ను చెల్లింపు విషయంలో వసూలుదారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అనవసరంగా ఒత్తిడి తెస్తున్నారని పలుసార్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకి (సీబీడీటీ) ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలో ఆ సమస్యను పరిష్కరించేందుకుగాను ఈ-మెయిల్ సర్వీసులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. నోటీసులు పంపించడం తిరిగి వాటికి బదులు ఇచ్చే అవకాశం ఉండేలా ఈ-మెయిల్ సిస్టాన్ని తయారు చేయాలని ఇప్పటికే ఐటీ శాఖకు సీబీడీటీ ఆదేశించింది.

గత కొంతకాలంగా పన్నులు చెల్లించేందుకు తేలికైన మార్గాలను అన్వేషిస్తున్నాం..ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వారికి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఆలోచిస్తున్నాం..అందుకే పన్ను చెల్లింపుదారులకు ఈ-మెయిల్ పంపించేలా, దానికి తిరిగి సమాధానం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం అని సీబీడీటీ చైర్మన్ అనితా కపూర్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. పన్ను వసూలు చేసేటప్పులు తలెత్తే ఇబ్బందులు, పన్ను చెల్లింపుదారుల అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మార్పుకు శ్రీకారం చుట్టినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం పన్ను చెల్లింపుదారుడికి పేపర్ డాక్యుమెంట్లను పోస్ట్ ద్వారా పంపిస్తున్నారు. కొత్త విధానం అందుబాటులోకి వస్తే క్షణాల్లో నోటీసులు, ఇతర వాటిని పంపేందుకు వీలుపడనున్నది. అసెసింగ్ ఆఫీసర్‌కు పన్ను చెల్లింపుదారుడికి మధ్య ఎవరికి సంబంధం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకరావడం జరిగిందని, ఇతర వివరాలు తెలుసుకోవాలంటే కూడా ఈ-మెయిల్ పంపవచ్చునని ఆమె ఈ సందర్భంగా సూచించారు. పన్ను చెల్లింపునకు చెందిన అన్ని డాక్యుమెంట్లను స్కాన్ చేసి ఈమెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles