RBI to Issue Rs. 500 and 1000 Bank Notes With Enhanced Features

Rbi to issue new currency with enhanced features

RBI, Notes, additional features, numerals, Banks, Business news

The Reserve Bank of India (RBI) will issue Rs. 500 and Rs. 1,000 bank notes with additional features to aid the visually impaired in identification. RBI had recently put into circulation Rs. 500 bank notes with numerals in ascending size in number panels but without bleed lines and enlarged identification mark.

500, 1000 నోట్లపై ఆర్‌బీఐ కొత్త ఫీచర్స్ ఇవే

Posted: 09/23/2015 04:48 PM IST
Rbi to issue new currency with enhanced features

భారత్‌లో దొంగనోట్లను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన శక్తి మేరకు కొత్త ప్రయత్నాలను చేస్తూనే ఉంది. తాజాగా మంగళవారం రూ. 500, రూ. 1000 నోట్లకు సంబంధించి కొత్త ఫీచర్స్‌ను త్వరలో విడుదల చేయనుంది. దృష్టిలోపం ఉన్నవారు కూడా సులువుగా గుర్తించేలా భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) కొత్త ఫీచర్స్‌తో రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టనుంది. ముఖ్యంగా మూడు ఫీచర్స్‌ను కలుపుకొని ఆర్‌బీఐ ఈ నోట్లను విడదల చేయనుంది. ఈ కొత్త నోట్లకు సీరియల్ నెంబర్ పరిమాణం పెద్దదిగా ఉంటుంది.

మొదటి మూడు అక్షరాలతో కూడిన అంకెలను మాత్రం ఇప్పుడున్న సైజులోనే ఉంచుతారు. మగిలిన అంకెల పరిమాణం కాస్తంత పెద్దదిగా ఉంటుంది. 500, 1000 నోట్లపై బ్లీడ్ లైన్ ఉండదు. గుర్తింపు చిహ్నాలను మరింత పెద్దవిగా ముద్రించనున్నారు. దృష్టిలోపం ఉన్నవారు సులువుగా గుర్తించేందుకు ఈ నోట్లపై మార్పులు చేస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న నోట్లపై నెంబర్ ప్యానెల్స్ వద్ద ఇన్‌సట్ లెటర్ లేదు. చేతి స్పర్శతోనే ఇవి మంచినోట్లని కనుగొనేలా ఈ సరికొత్త కరెన్సీ ఉంటుందని ఆర్‌బీఐ ప్రకటించింది. నిర్ణీత కాలావధితో ఈ కొత్త నోట్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఇటీవలే నెంబరింగ్‌లో అంకెల పరిమాణం పెంచి, నోటుపై బ్లీడ్‌ లైన్‌ లేకుండా, పెంచిన గుర్తింపు చిహ్నాలతో రూ.500 నోట్లను ఆర్‌బీఐ చలామణీలోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RBI  Notes  additional features  numerals  Banks  Business news  

Other Articles