Gold Monetisation and Sovereign Gold Bonds

Govt nod for gold bonds new monetization scheme

interest on households gold, interest on temples gold, gold monetisation scheme, deposit gold earn interest, union government scheme for gold bonds, new monetization scheme

The gold monetisation scheme allows households, as well as temples to deposit their gold and earn interest on it.

ఇంట్లోని పసిడి.. ధరావతు చేస్తే.. తెచ్చును వడ్డీ..

Posted: 09/11/2015 07:50 PM IST
Govt nod for gold bonds new monetization scheme

కేంద్ర ప్రభుత్వం తాజాగా అమోదించిన నూతన బంగారం డిఫాజిట్ పతకంతో ఇంట్లో అలుమారాల్లో, బ్యాంకు లాకర్లలో వున్న పసిడి ఇకపై వడ్డీని కూడా
తీసుకురానుంది. విలువైన లోహంగా పసిడి డిమాండ్‌ను తగ్గించడానికి, ఇళ్లలో, సంస్థల్లో బీరువాలకే పరిమితమవుతున్న పసిడిని వ్యవస్థలోకి తీసుకురావడం దీని
లక్ష్యం. దీంతో పాటు అలా ప్రభుత్వం వద్ద ధారావత్తు చేసిన పసిడికి ఆర్జన సామర్థ్యం సమకూర్చడం, తద్వారా దేశ ఆర్థిక పటిష్టత పర్చేందుకు కేంద్రం ఈ నిర్ణయం
తీసుకుంది. ఈ పథకం గురించి మరిన్న వివరాలు..

* ప్రజలు తమ వద్ద అదనంగా ఉన్న పసిడిని బ్యాంకుల్లో స్వల్ప (1-3 సంవత్సరాలు), మధ్య (5-7 సంవత్సరాలు), దీర్ఘకాలిక కాలాలకు (12-15 సంవత్సరాలు) డిపాజిట్ చేసుకోవచ్చు.

* బంగారం రూపంలో వడ్డీని గుణించి, మెచ్యూరిటీ తరువాత నగదు రూపంలో అసలు, వడ్డీలను చెల్లిస్తారు. అంతర్జాతీయంగా కొన్ని దేశాల్లో పసిడి డిపాజిట్ విలువపై 0.75 శాతం నుంచి 2శాతం వరకూ వడ్డీ ఉంది.

* స్వల్పకాలిక డిపాజిట్లపై వడ్డీరేటు ఆయా బ్యాంకులు నిర్ణయిస్తాయి. మధ్యకాలిక, దీర్ఘకాలిక డిపాజిట్లపై వడ్డీరేటు (బ్యాంకుల సేవలను ఫీజులు సహా) ఆర్‌బీఐతో సంప్రదించి కాలానుగుణంగా ప్రభుత్వం ప్రకటిస్తుంది.

*దేశంలో అదనపు పసిడి దాదాపు 20,000 టన్నులు ఉంటుందని అంచనా. తాజా పథకం వల్ల దాదాపు రూ.5,40,000 కోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తాయని అంచనా.

*స్థిర డిపాజిట్ల తరహాలోనే ఈ మూడు కాలాల పసిడి డిపాజిట్లకు లాక్-ఇన్-పీరియడ్ బ్రేకింగ్‌కు వీలుంటుంది. అయితే ముందస్తు ఉపసంహరణల విషయంలో (కొంతభాగం ఉపసంహరణ సహా) కొంత జరిమానా అమలవుతుంది.

*వ్యక్తులు లేదా వ్యవస్థలు కనీసం 30 గ్రాములు డిపాజిట్ చేయాలి. డిపాజిట్‌కు సంబంధించి లభించే వడ్డీని ఆదాయపు పన్ను, కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది.

* ఇదేమీ బ్లాక్ మనీ వంటి అంశాలకు దారితీసే ప్రొడక్ట్ కాదు. సాధారణ పన్ను నిబంధనలు అన్నీ ఈ డిపాజిట్ స్కీమ్‌కూ వర్తిస్తాయి.

* ధరలు పెరిగితే ఈ డిపాజిట్ వల్ల డిపాజిట్‌దారుకు ప్రయోజనం చేకూరుతుంది. అలాగే డిపాజిట్ చేసిన పసిడి విలువకు సంబంధించి వడ్డీ కూడా పొందవచ్చు.

* డిపాజిట్ కాల వ్యవధి పూర్తయిన తరువాత, డిపాజిట్‌దారు అప్పటి పసిడి వాస్తవ విలువను పొందవచ్చు. స్వల్పకాలిక డిపాజిట్ అయితే ఫిజికల్ గోల్డ్‌ను పొందే వీలుంది. రెండు సందర్భాల్లో వడ్డీ లభిస్తుంది.

* డిపాజిట్ చేసిన పసిడి విలువ తగ్గితే... తగ్గిన విలువే లభిస్తుంది. అయితే వడ్డీ ఇక్కడ కస్టమర్‌కు కలిసి వచ్చే అంశం.

* డిపాజిట్‌గా వచ్చిన పసిడిని వేలానికి, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పసిడి నిల్వల భర్తీలకు వినియోగిస్తారు. అశోక్ చక్రతో కూడిన ఇండియన్ గోల్డ్ కాయిన్ తయారీలో సైతం దీనిని వినియోగిస్తారు.

* దిగుమతులు తగ్గించడం, దేశీయంగా సరఫరాల మెరుగు లక్ష్యంగా ఆభరణ వర్తకులకు కూడా ఈ పసిడిని అమ్మే వెసులబాటును బ్యాంకులకు కల్పిస్తారు. నో-యువర్-కస్టమర్ నిబంధనలను బ్యాంకుల తప్పనిసరిగా పాటించాలి.

* పసిడి డిపాజిట్ పథకం అమలు తేదీ తత్సబంధ అంశాలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ వెలువడుతుంది.

* డిపాజిట్ స్కీమ్ అమల్లో బ్యాంకులకు ప్రోత్సాహకాలు ఉంటాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gold monetisation scheme  households  temples  interest  

Other Articles