Sensex back in red despite late recovery, ends 97 points down

Sensex closes 97 points down nifty ends below 7800

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, Federal Reserve, fiscal consolidation, GDP growth, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

Sentiment got a boost at the fag-end after the government today said the Winter Session could be advanced immediately after the Bihar polls to pass the GST bill, which it proposes to roll out from April, 2016.

రెండు రోజుల వరస లాభాలకు బ్రేకులు..నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Posted: 09/10/2015 06:52 PM IST
Sensex closes 97 points down nifty ends below 7800

విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాలకు తోడు దేశీయ సూచీలలో నెలకొన్న స్థబతతో వరుసగా రెండు రోజుల పాటు లాభాలను ఆర్జించిన భారతీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలలో ముగిసాయి. ముఖ్యంగా చైనా నుంచి వచ్చిన ప్రతికూల పవనాలతో ఉదయం మార్కెట్ ప్రారంభం అయినప్పటి నుంచే నష్టాలను చవిచూశాయి. ఇక ఇటు దేశీయ మదుపరుల సెంటిమెంట్ కూడా ప్రతికూలంగా మారండంతో స్టాక్ మార్కెట్లు ఉదయం పది గంటలకు భారీ నష్టాలలోకి జారుకున్నాయి. అయితే సాయంత్రం కేంద్ర ప్రభుత్వం వెలువరించిన తాజా ప్రకటన నేపథ్యంలో పుంజుకున్నప్పటికీ స్టాక్ మార్కెట్లను మాత్రం నష్టాలు వదలలేదు.

చైనా అర్థిక సంక్షోభం నేపథ్యంలో మరోమారు ద్రవ్యోల్భణానికి దారితీస్తుందన్న సంకేతాల ప్రభావం కూడా భారతీయ స్టాక్ మార్కెట్లపై పడింది. దీంతో పాటు త్వరలో కీ మాక్రో డాటాను ఐఐపి విడుదల చేయనుందన్న వార్తలు, అటు వినియోగదారు ధర ద్రవ్యోల్బణాన్ని కూడా కేంద్రం వెలువరించనుందన్న సంకేతాలు మదుపరుల సెంటిమెంట్లను దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో మార్కట్లను పుంజుకునేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్న వస్తు, సేవా పన్నుల బిల్లును బీహార్ ఎన్నికల అనంతరం రానున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో అమోదించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించిన తరువాత కాస్త పుంజుకున్న మార్కట్లను మాత్రం నష్టాలు వద్దల్లేదు.

ఉదయం 25 వేల 523 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెస్సెక్స్ ఒక ధశలో సుమారుగా 300 పాయంట్లను కోల్పయింది. ఆ తరువాత 25 వేల 733 పాయంట్లను తాకి 97 పాయంట్ల నష్టంతో తిరిగి 25 622 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 31 పాయింట్ల నష్టంతో 7788 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాళ సుమారు 1122 సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, 1482 సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి. ఈ క్రమంలో ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంజీసీ, మధ్య తరహా పరిశ్రమలు సూచీలు లాభాలను ఆర్జించగా, టెక్నాలజీ, కన్జూమర్ గూడ్స్, లోహాం, ఐటీ, నిఫ్టీ బ్యాంకింగ్, , హెల్త్ కేర్ ఆయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, సంబంధిచిన సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో టాటాపవర్, టాటామోటార్స్, బిసిసిఎల్, బిహెచ్ఇఎల్, జీ ఎంటర్టైన్మెంట్ తదితర సంస్థల షేర్లు అధిక లాభాలను ఆర్జించగా, ఎన్ ఎం డి సి, హెచ్ సి ఎల్ టెక్నాలజీ, హిండాల్కో, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, హెచ్ డి ఎఫ్ సి సహా తదితర సంస్థల షేర్లు అధిక నష్టాలను చవిచూశాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Gold and silver  indian rupee  RBI  

Other Articles