Apple confirms iphone 6 launch in india

IPhone6, E-Commerce, Apple, ebay, amazon, launch, e commerce

Apple confirms iPhone 6 launch in India, sale through e commerce

ఈ నెలలో అందుబాటులోకి ఐ ఫోన్ 6, 6ఎస్

Posted: 10/06/2014 12:38 PM IST
Apple confirms iphone 6 launch in india

ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలకు తెర తీసిన ఆపిల్ ఐ ఫోన్ 6, 6ఎస్ మరో రెండు వారాల్లో భారత్ లో విడుదల కానుంది. ఈ-కామర్స్ ద్వారా ఇండియాలో త్వరలో ప్రవేశపెట్టే ఐఫోన్ 6, 6ఎస్ ధర సుమారు 56 వేల రూపాయలు ఉండవచ్చని తెలుస్తోంది. ఈ నెల 17 నుంచి భారత్ లో అమ్మకాలు ప్రారంభించనున్నట్లు ఆపిల్ కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ కామర్స్ లో ఈబే సంస్థ ఐఫోన్ 6 ధర 55954 రూపాయలుగా నిర్ణయించింది.

షాప్ క్లూ.కామ్ అనే మరో సంస్థ 16 జీబీ కెపాసిటి ఐఫోన్6 ధర 60 వేల రూపాయలుగా, షిప్పింగ్ చార్జీలు 148 రూపాయలుగా నిర్ణయించింది. అక్టోబర్ 17 కల్లా 'ఐఫోన్ 6'ను అందిస్తామని షాప్ క్లూ.కామ్ భరోసానిస్తోంది. సెప్టెంబర్ 9న ఐ ఫోన్ 6, 6 ఎస్ ను మార్కెట్ లోకి విడుదల చేసిన ఆపిల్ కంపెనీ... భారత్ లో అక్టోబర్ చివర్లో అమ్మకాల్ని కొనసాగిస్తామని ముందుగానే వెల్లడించింది. అయితే.. భారత్ లో అమ్మకాలపై దృష్టి పెట్టిన ఈ సంస్థ కాస్త ముందుగానే విక్రయాలు జరిపేందుకు సన్నధం అవుతోంది. కాగా ఐ ఫోన్ 6, 6 ఎస్ లకు ఎంత ధరకు విక్రయించేది మాత్రం కంపెనీ వర్గాలు చెప్పడం లేదు. ధర విషయం అమ్మకం దార్లకే వదిలేస్తున్నట్టు సమాచారం. అమెజాన్, ఇతర కంపెనీలు కూడా ఐఫోన్6 అమ్మకాల్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPhone6  E-Commerce  Apple  ebay  amazon  launch  e commerce  

Other Articles