Sony xperia z3 and z3 compact launched in india

waterproof phones, Xperia Z3, Xperia Z3 Compact, xperia z3 features, xperia z3 india, Xperia Z3 launch

sony xperia z3 and z3 compact launched in india for rs 51990 and rs 44990 respectively

సోనీ ఎక్స్పీరియా నుండి రెండు కొత్త స్మార్ట్ఫ ఫోన్లు

Posted: 09/26/2014 12:40 PM IST
Sony xperia z3 and z3 compact launched in india

మోబైల్ ఫోన్ల ప్రపంచంలో నిత్య నూతనంగా వుండాలనుకుంటున్న యువతకు సోనీ ఎక్స్‌పీరియా సంస్థ రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌ మోడళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐ ఫోన్ సంస్థ ఇటీవలే రెండు మోడళ్లను మార్కట్లోకి విడుదల చేయడం, వాటికి అమోఘమైన స్పందన రావడంతో.. ప్రస్తుతం అన్ని మోబైల్ సంస్థలు నూతన మోడళ్లను విడుదల చేసే పనిలో పడ్డాయి. ఈ తరుణంలోనే సోనీ ఎక్స్‌పీరియా సంస్థ రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌ మోడళ్లను మార్కెట్ లోకి విడుదల చేసింది.

కంపెనీ  ప్రీమియం హ్యాండ్‌సెట్ మార్కెట్లో మరింత వాటా సాధించడం లక్ష్యంగా ఈ రెండు కొత్త ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్లను అందిస్తున్నామని సోనీ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) సచిన్ రాయ్ చెప్పారు. 5.2 అంగుళాల స్క్రీన్ సైజు ఉన్న ఎక్స్‌పీరియా జడ్3 ధర రూ.51,990 అని, 4.6 అంగుళాల స్క్రీన్ సైజు ఉన్న ఎక్స్‌పీరియా జడ్3 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.44,900 గా నిర్ణయించినట్లు చెప్పారు.

ఈ రెండు ఫోన్లలలో స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 2.5 గిగాహెర్ట్స్ క్వాడ్-కోర్ సీపీయూ, 3 జీబీ ర్యామ్, 4జీ ఎల్‌టీఈ, 20.7 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 25 ఎంఎం వైడ్‌యాంగిల్ లెన్స్, 2600 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. నీళ్లలో, దుమ్ములో పడినా ఈ ఫోన్‌లు పాడుకావని. గేమింగ్ ప్రియుల కోసం పీఎస్4(ప్లేస్టేషన్) రిమోట్ ప్లే ఫీచర్‌ను అందిస్తున్నామని తెలిపారు.

 పీఎస్4పై గేమ్స్ అడుకోవడానికి ఈ ఫోన్లను రిమోట్ స్క్రీన్‌లుగా ఉపయోగించుకోవచ్చని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ అవుట్‌లెట్ల సంఖ్యను 10వేలకు విస్తరించనున్నామని, వీటిల్లో 250 ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌పీరియా స్టోర్స్ ఉంటాయని పేర్కొన్నారు. .

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles