Mukesh ambani again tops as india s richest tycoon

Mukesh Ambani, Reliance Industries chairman, Forbes magazine, top 100 richest tycoons, Lakshmi Mittal, Sun Pharmaceutical Industries, Dilip Shanghvi

Three more bronze medals for India from rowing, shooting

భారత అపర కుబేరుడు ముఖేష్ అంబానీయే..

Posted: 09/25/2014 04:52 PM IST
Mukesh ambani again tops as india s richest tycoon

భారత అపర కుబేరుడిగా మరోమారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ నిలిచారు. భారత్లో అత్యధిక సంపన్నుల జాబితాలో ఆయన తన అగ్రస్థానాన్ని తిరిగి నిలుపుకున్నారు.  23.6 బిలియన్ డాలర్ల ఆస్తిలు ఆయనను ఈ స్థానాన్ని కైవసం చేసుకునేలా చేశాయని పోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ముఖేశ్ ఆస్తి గత ఏడాది కంటే 2.6 బిలియన్లు పెరిగిందని తెలిపింది. దీంతో ఆయన వరుసగా ఎనిమిదో ఏడాది కూడా భారత్లో అత్యధిక సంపన్నుల జాబితాలో తొలి స్థానాన్ని కొనసాగించారని పేర్కొంది.  భారత్లో 100 అత్యధిక సంపన్నుల తాజా జాబితాను వాషింగ్టన్లో విడుదల చేసింది. ఈ జాబితాలో మొదటి వంద మంది భారతీయులేని బిలయనీర్లేనని తెలిపింది. కేంద్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో స్టాక్ మార్కెట్ కొత్త పుంతలు తొక్కిందని అభిప్రాయపడింది.

అలాగే రెండవ స్థానాన్నిఔషధ కంపెనీ సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సింఘ్వీ అక్రమించారని చెప్పింది. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న ఎన్నారై వ్యాపారీ, ఉక్కు వ్యాపార దిగ్గజం లక్ష్మీ మిట్టల్ను ఐదో స్థానానికి నెట్టిన దిలీప్ రెండవ స్థానాన్ని అందుకున్నారని పేర్కొంది.  ఆ తర్వాత ఎనిమిది స్థానాలు వరుసగా 16.4 బిలియన్ డాలర్లతో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ, 15.9 బిలియన్ డాలర్లతో టాటా గ్రూప్ అధినేత పల్లొంజి మిస్త్రీ, 15.8 బిలియన్లతో లక్ష్మీ నివాస్ మిట్టల్, 13.3 బిలియన్లతో హిందూజా బ్రదర్స్, రూ. 12.5 బిలియన్లతో శివ నాడర్, 11.6 బిలియన్లతో గోద్రెజ్ ఫ్యామిలీ, 9.2 బిలియన్లతో కుమార్ బిర్లా, రూ.7.8 బిలియన్లతో సునీల్ మిట్టల్ ఉన్నారని పోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో వెల్లడించింది.    

 జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles