Nda govt to release the budget for economic year 2014 15

NDA govt to release the budget for economic year 2014-15,

NDA govt to release the budget for economic year 2014-15

హల్వాతో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికమంత్రి

Posted: 07/02/2014 01:41 PM IST
Nda govt to release the budget for economic year 2014 15

(Image source from: NDA govt to release the budget for economic year 2014-15)

ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం కాగా... అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఎన్డీయే ప్రభుత్వం ‘‘కేంద్ర అధికారాన్ని’’ చేజిక్కించుకుంది. దీంతో వీరు ప్రజలకు న్యాయం చేసే దిశగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను, పనులను న్యాయబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే... 2014-15 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టాల్సిన కేంద్ర బడ్జెట్ ముద్రణ పనులను కూడా మంత్రి అరుణ్ జైట్లీ ఘనంగా నిర్వహించారు. ఈ బడ్జెట్ ప్రింటింగ్ ఆరంభాన్ని సరికొత్త ఒరవడితో హల్వా ఉత్సవాన్ని నిర్వహించారు.

మంగళవారం ఇక్కడి నార్త్ బ్లాక్ లో ఈ బడ్జెట్ ప్రింటింగ్ ఆరంభానికి సూచనగా నిర్వహించిన ఈ హల్వా ఉత్సవంలో అందులో పాలుపంచుకునే అధికార్లు, ఇతర సిబ్బందులు కూడా పాల్గొన్నారు. దీంతో ఈ అధికార్లందరికీ బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఈ హల్వా ఉత్సవంలో అరుణ్ జైట్లీతోపాటు ఆర్థిక సహాయమంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక కార్యదర్శి అరవింద్ మాయారామ్, సంయుక్త కార్యదర్శి (బడ్జెట్) రజత్ భార్గవ, ఆర్థిక శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికార్లు కూడా పాల్గొన్నారు.

ఇందులో భాగంగానే అరుణ్ జైట్లీ మాట్లాడుతూ... ‘‘భారతదేశంలో వున్న అధిక ద్రవ్యలోటు ఒక సవాలుగా మారింది. పైగా బడ్జెట్ సమర్పణకు కేవలం కొన్నిరోజులు మాత్రమే మిగిలున్నాయి. ఇటువంటి సమయంలో దేశానికి క్రమశిక్షణ చాలా అవసరం. ఆర్థిక విషయాల్లో వివేకమైన మార్గాలను అనుసరించాల్సి వుంది’’ అని ఆయన చెప్పారు. అనవసరమైన ప్రజాకర్షక విధానాలను మొగ్గు చూపిస్తే మన ఖజానాకే నష్టం కాబట్టి వివేకంతో ఆర్థిక విషయాల్లో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆయన వెల్లడించారు.

‘‘దేశ ఆర్థికవృద్ధి 5 శాతం లోపే వుంటే.. ద్రవ్యలోటుతోపాటు ద్రవ్యోల్బణం కూడా అధికంగా పెరిగిపోతుందని... అటువంటి సమయాల్లో ప్రజలకు నచ్చే విధానాల కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. అంటే... దీర్ఘకాలంలో హాని జరిగే దారిలోకి మనం ప్రయాణించినట్లవుతుందని’’ ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఈయన ప్రసంగాన్ని బట్టి చూస్తుంటే.. వినియోగదార్లు మెరుగైన సేవలను కోరుకునే పక్షంలో దానికి బదులుగా మరింత ఎక్కువగా చల్లించాల్సి వస్తుందన్న ధోరణిలో మంత్రిగారు హెచ్చరిస్తున్నట్టు కనిపిస్తోందని కొంతమంది అధికార్లు తెలుపుతున్నారు. జూలై 10వ తేదీన ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ ఎన్టీయే ప్రభుత్వానికి మొదటిది కావడం విశేషం! ఏదేమైనా... ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా బడ్జెట్ నిర్ణయిస్తారని ఆశిద్దాం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles