Zebra technologies corporation to acquire motorola

Zebra Technologies Corporation, Motorola’s Enterprise business, Motorola Solutions, Greg Brown, Anders Gustafsson, Zebra Technologies Corporation,Motorola’s Enterprise business,Motorola Solutions,Greg Brown,Anders Gustafsson

Zebra will acquire Motorola Enterprise business for $3.45 billion in an all-cash transaction.

జీబ్రా చేతికి మోటరోలా కంపెనీ

Posted: 04/16/2014 12:29 PM IST
Zebra technologies corporation to acquire motorola

టెలికం దిగ్గజం మోటరోలాకు చెందిన ఎంటర్‌ప్రైజ్ బిజినెస్ విభాగాన్ని వైర్‌లెస్ ఉత్పత్తుల సంస్థ జీబ్రా టెక్నాలజీస్ కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌లో భాగంగా 345 కోట్ల డాలర్లను(సుమారు రూ. 21,000 కోట్లు) పూర్తి నగదు రూపేణా జీబ్రా చెల్లించనుంది. మోటరోలా సొల్యూషన్స్(ఎంటర్‌ప్రైజ్ విభాగం) కొనుగోలు ద్వారా మొబిలిటీ, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి విభాగాలలో మరింత పురోగతిని సాధించగలమని జీబ్రా టెక్నాలజీస్ సీఈవో ఆండర్స్ గుస్తాఫ్సన్ పేర్కొన్నారు.

2013లో 100 కోట్ల డాలర్ల ఆదాయాన్ని పొందిన జీబ్రా బార్‌కోడ్స్, స్టార్ట్ ట్యాగ్స్ వంటి విభాగాలలో టెక్నాలజీ సొల్యూషన్లను అందిస్తోంది. ఈ డీల్‌కు రెండు కంపెనీల డెరైక్టర్ల బోర్డుల నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు జీబ్రా తెలిపింది. కొనుగోలుకి అవసరమైన నిధులను అంతర్గత వనరులు, రుణాల ద్వారా సమకూర్చుకోనున్నట్లు వెల్లడించింది. డీల్ నేపథ్యంలో మోటరోలా సొల్యూషన్స్‌కు చెందిన సుమారు 4,500 మంది ఉద్యోగులు జీబ్రాకు బదిలీకానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles