నిత్య జీవితంలో ఇంటర్నెట్ తప్పని సరి భాగం అయిపోయింది. ఇంటర్నెట్ ఇప్పుడు ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెలో దర్శనం ఇస్తొంది. కానీ కొన్ని సందర్భాల్లో సముద్ర మార్గంలోనో, అడవిలోనో ప్రయాణిస్తుంటే అత్యవసరంగా ఇంటర్నెట్ అవసరం పడితే అధునాత టెక్నాలజీ వై-ఫై ద్వారా మన మొబైల్ లేక ల్యాప్ టాప్ ద్వారా కొంత ఛార్జీ చెల్లించి అవసర నిమిత్తం వాడుకుంటాం.
కానీ చెట్టూ, పుట్టా, సముద్రం అని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ప్రపంచ వ్యాప్తంగా ఫ్రీ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే... ఏంటి ఇంటర్నెట్ ఫ్రీగా అది ప్రపంచ వ్యాప్తంగా... ఏంటి జోకులేస్తున్నానని అనుకుంటున్నారా ? నేనే చెప్పేది నిజం. అమెరికాకు చెందిన ‘మీడియా డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఎండీఐఎఫ్)’ స్వచ్ఛంద సంస్థ ఆలోచన కార్యరూపం దాల్చితే ఇదంతా వాస్తవం కానుంది.
అంతరిక్షంలోకి కొన్ని వందల చిన్న కత్రిమ ఉపగ్రహాలను పంపి, వాటిని భూమిపై ఏర్పాటు చేసే గ్రౌండ్ స్టేషన్లకు అనుసంధానించే ‘ఔటర్‌నెట్’కు ఈ సంస్థ రూపకల్పన చేసింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం నిధులనూ సేకరిస్తోంది. వచ్చే ఏడాది కొన్ని చిన్న కత్రిమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనుంది కూడా. ఈ ప్రాజెక్టుకు కొన్ని వేల కోట్ల రూపాయలు వ్యయమవుతాయని అంచనా. ఇది అందుబాటులోకి రావాలంటే మరికొన్నేళ్ళు ఆగాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more