Facebook to buy mobile messaging app whatsapp

Facebook buying WhatsApp, Facebook, WhatsApp,Whatsapp,messaging servicem.

Facebook will buy mobile messaging startup WhatsApp for $19 billion in cash and stock, as the world largest social network looks for ways to boost its popularity

ఫేస్ బుక్ చేతికి వాట్స్ యాప్

Posted: 02/20/2014 01:22 PM IST
Facebook to buy mobile messaging app whatsapp

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లలో ఎక్కువ మంది ఉపయోగించే యాప్స్ లో వాట్స్ యాప్ ఎంతో ప్రాచుర్యం పొందింది. అనతి  కాలంలోనే అత్యధిక మందికి చేరువైన వాట్స్ యాప్ ను ఇప్పుడు భారీ ధర చెల్లించి ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ అయిన ఫేస్ బుక్ దక్కించుకుంది. ఇంత వరకు ఇంటర్నెట్ చరిత్రలో లేనంతగా దాదాపు లక్షా పద్దెనిమిది వేల కోట్లతో ఫేస్బుక్ కొనేస్తోంది.

ఈ విషయాన్ని ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్బెర్గ్ ప్రకటించాడు. ఈ మొత్తంలో కొంత భాగాన్ని ఫేస్బుక్ స్టాక్ గాను, మరికొంత మొత్తాన్ని నగదుగాను చెల్లిస్తున్నట్లు తెలిపాడు. ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకునే ఈ యాప్ అన్ని యాప్ లలో కంటే ఎక్కువ ప్రాచుర్యం పొందడమే కాకుండా, ఎక్కువ మంది వాడుతుండటమే ఇంత రేటు రావడానికి కారణం అని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.

ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే... వాట్స్ యాప్ ను ప్రారంభించిన కొత్తలో ఫేస్ బుక్ ను, గూగుల్ ని అడిగితే వాళ్లు నిరాకరించారు. ఈ విషయం పై జుకెర్ బెర్గ్ మాట్లాడుతూ... దీని సాయంతో ప్రపంచం నలుమూలల ఉన్నవాళ్లు ఈ యాప్ను ప్రతిరోజూ ఉపయోగించుకోడానికి వీలుంటుందని వివరించాడు. తమ భాగస్వామ్యం వల్ల బేసిక్ ఇంటర్నెట్ సేవలు ప్రతి ఒక్కరికీ మరింత అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles