Car prices to accelerate in new year

car price hike,carmakers,hyundai,january,maruti,towhateffect.

Two leading carmakers, including leader Maruti Suzuki with a 41% market share, announced a 1-3% price hike effective January on Thursday.

Car prices to accelerate in New Year.png

Posted: 12/07/2012 06:10 PM IST
Car prices to accelerate in new year

Car_pricesకొత్త సంవత్సరంలో కార్లు కొనాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్. రానున్న కొత్త సంవత్సరంలో కార్ల ధరలు పెరగనున్నాయి. జనవరిలో కార్ల ధరలను రూ.20,000 వరకూ పెంచాలని మారుతీ సుజుకీ ఇప్పటికే నిర్ణయించింది. 1-2% ధరలను పెంచనున్నామని టయోటా పేర్కొం ది. జనరల్ మోటార్స్ 3% వరకూ ధరలను పెంచుతోంది. హోండా కార్స్ ఇండియా, ఫోక్స్‌వ్యాగన్ కూడా ఈ దిశగా ఆలోచిస్తున్నాయి. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నాయని, డాలర్‌తో రూపాయి మారకం తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతుండటంతో మార్జిన్లపై తీవ్ర ప్రభావం పడుతోందని, అందుకే ధరలు పెంచాల్సి వస్తోందని కంపెనీలంటున్నాయి.మోడళ్లను బట్టి కార్ల ధరలను రూ.20,000 వరకూ పెంచుతున్నామని మారుతీ సుజుకి ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(మార్కెటింగ్ అండ్ సేల్స్) మయాంక్ పరీక్ చెప్పారు.

మారుతీ సుజుకి కంపెనీ ఎం800 నుంచి కైజాషి మోడళ్లను రూ.2.09 లక్షల నుంచి రూ.17.52 లక్షల రేంజ్‌లో విక్రయిస్తోంది. ఇక వచ్చే నెల 1 నుంచే అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నామని టయోటా కంపెనీ తెలిపింది. ఈ కంపెనీ ఇటియోస్ లివా నుంచి ల్యాండ్ క్రూయిజర్ వరకూ మోడళ్లను రూ.4.44 లక్షల నుంచి రూ.99.27 లక్షల రేంజ్‌లో కార్లను విక్రయిస్తోంది. కరెన్సీ ఒడిదుడుకుల కారణంగా ధరలు పెంచక తప్పడం లేదని ఫోక్స్‌వ్యాగన్ తెలిపింది. జనవరి నుంచే తాము కూడా మోడళ్లను బట్టి ధరలను 1-3 శాతం వరకూ పెంచనున్నామని జనరల్ మోటార్స్ పేర్కొంది. రూ.3.32 లక్షల స్పార్క్ కారు నుంచి రూ.24.59 లక్షల స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ క్యాప్టివా వరకూ వివిధ మోడళ్లను కంపెనీ విక్రయిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bharti infratel ipo opens for subscription
Free roaming likely from march 2013  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles