Fitch lowers outlook on sbi other banks

Fitch lowers outlook on SBI, other banks,Fitch Ratings , Foreign Currency , State Bank of India , indian financial institutions , hindustan times, news, Fitch, ICICI Bank, Punjab National Bank, Fitch

Fitch lowers outlook on SBI, other banks

SBI.gif

Posted: 06/21/2012 11:00 AM IST
Fitch lowers outlook on sbi other banks

Fitch lowers outlook on SBI, other banks

ఎస్‌బిఐ, ఐసిఐసిఐ బ్యాంక్, పిఎన్‌బి, యాక్సిస్ బ్యాంక్ సహా మొత్తం 11 ఆర్థిక సంస్థలకు క్రెడిట్ రేటింగ్ ముప్పు ముంచుకొస్తోంది. ఈసంస్థల రేటింగ్ అవుట్‌లుక్‌ను నిలకడ స్థాయి నుంచి ప్రతికూల స్థాయికి తగ్గించినట్లు ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ ప్రకటించింది. దేశీయ సంస్థలు, దేశీయ సావరిన్ డెట్‌లో భారీ స్థాయిలో ఉన్న ఎక్స్‌పోజర్‌ను ఈ అవుట్‌లుక్ సమీక్ష సూచిస్తుందని ఫిచ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఫిచ్ రేటింగ్ అవుట్‌లుక్ తగ్గించిన సంస్థల జాబితాలో ఆరు ప్రభుత్వరంగ బ్యాంకులు, రెండు ప్రైవేట్ రంగంలో ని బ్యాంకులు ఉన్నాయి.  వీటిల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ బరోడా (న్యూజిలాండ్) లిమిటెడ్, కెనరా బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, ప్రభుత్వ నిర్వహణలోని ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కూడా అవుట్‌లుక్ డౌన్‌గ్రేడ్ పొందాయి. వీటితోపాటు ఐడిఎఫ్‌సి లిమిటెడ్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అవుట్‌లుక్ సైతం ప్రతికూల స్థాయికి చేరినట్లు ప్రకటన తెలిపింది. అయితే ఈ బ్యాంకులు తగిన డిపాజిట్ బేస్‌తో పాటు దేశీయ ఫ్రాంచైసీలు, మూలధనం కలిగివున్నాయని ఫిచ్ పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Reliance industries to sell textile business including only vimal segment
All eyes on rbi governor duvvuri subbarao as rate cut expectations rise  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles