All eyes on rbi governor duvvuri subbarao as rate cut expectations rise

All eyes on RBI Governor Duvvuri Subbarao as rate cut expectations rise,RBI Governor,RBI,Duvvuri Subbarao,anti-inflationary

All eyes on RBI Governor Duvvuri Subbarao as rate cut expectations rise

RBI.gif

Posted: 06/19/2012 12:34 PM IST
All eyes on rbi governor duvvuri subbarao as rate cut expectations rise

All eyes on RBI Governor Duvvuri Subbarao as rate cut expectations rise

 భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) సోమవారం జరిపే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న అంచనాల మధ్య అందరి చూ పు బ్యాంక్ గవర్నర్ దువ్వూరి సుబ్బారెడ్డిపై నిమగ్నమైంది. రెండేళ్ల కఠిన విధాన చర్యలను ఒకింత సడలిస్తూ ఆర్‌బిఐ గవర్నర్ ఆర్థిక, పారిశ్రామిక రంగాలకు ఊరట గలిగిస్తారని సర్వత్రా భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఆర్‌బిఐ ఆమోదయోగ్య స్థాయికి కట్టడి కాకున్నా మందగించిన వృద్ధిరేటు పుంజుకునేందుకు ఆర్‌బిఐ తనవంతు బాధ్యతగా రేట్ల సడలింపు జరుపుతుందని విశే్లషకులు గట్టిగా నమ్ముతున్నారు.

ఆర్థిక రంగం చేయూతకు ప్రభుత్వం ద్రవ్యవిధానం సర్దుబాటు చేసుకున్నట్లే ఆర్‌బిఐ సైతం పరపతి విధాన సర్దుబాటు చేస్తుందన్న విశ్వాసం తనకు ఉన్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ గత శనివారం వ్యాఖ్యానించడం తెలిసిందే. ఆర్‌బిఐ గవర్నర్ సోమవారం ద్రవ్య పరపతి సమీక్ష వెల్లడించనున్నారు. ఆయన కీలక రెపో రేట్లను కనీసం పావుశాతం, అలాగే నగదు నిల్వల నిష్టపత్తి (సిఆర్‌ఆర్) ఒక శాతం వరకు తగ్గిస్తారని నిపుణులు భావిస్తున్నారు. ఈఏడాదిలో ఇప్పటివరకు ఆర్‌బిఐ గవర్నర్ సిఆర్‌ఆర్ 125 బేసిసి పాయింట్లు, రెపోరేటు 50 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గించిన విష యం తెలిసిందే. గడచిన 20 నెలల కాలంలో రెపోరేట్లు ఒక్కసారి మాఅతమే తగ్గించారు. కాగా, ప్రధాన ద్రవ్యోల్బణం 7.55 శాతానికి చేరుకున్న దృష్ట్యా రేపటి విధాన సమీక్షలో వడ్డీరేట్లు భారీగా తగ్గించే అవకాశాలు లేవని భావిస్తున్నారు. కానీ ఐఐపి వృద్ధి అథోగతిలో ఉన్నందున పరిశ్రమలకు, మరోపక్క ఎగుమతుల రంగానికి బాసటగా నిలువడం తప్పదని అంటున్నారు.ఇదిలావుంటే, సోమవారం నాటి పరపతి సమీక్షలో స్వల్పవ్యవధి రెపోరేట్లు కనీసం 50 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించాలని పారిశ్రామిక చాం బర్లు ఆర్‌బిఐకి విజ్ఞప్తి చేశాయి. అలాగే సిఆర్‌ఆర్ తగ్గించడం ద్వారా వ్యవస్థలోకి మరింత లిక్విడిటీ సౌ కర్యం పెంపోందించాలని చాంబర్లు కోరుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fitch lowers outlook on sbi other banks
Indias forex reserves rise to 28738 billion  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles