The Special Story Of Hogenakkal Falls Which Is Called As Indian Niagara Falls | Bangalore Tourist Spots | Best Destinations

Hogenakkal water falls special story indian niagara falls tourist spots

hogenakkal falls, hogenakkal water falls, hogenakkal falls special story, india niagara falls, indian falls special story, water falls india, india best tourist destinations, india best locations, best destinations in india

Hogenakkal Water Falls Special Story Indian Niagara Falls Tourist Spots : The Special Story Of Hogenakkal Falls Which Is Called As Indian Niagara Falls.

‘భారతీయ నయాగారా జలపాతం’.. పర్యాటకులకు సౌందర్య విహారం

Posted: 09/08/2015 05:46 PM IST
Hogenakkal water falls special story indian niagara falls tourist spots

దేశంలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాల్లో ‘హొగెనక్కల్ జలపాతం’ ఒకటి. ఇది తమిళనాడు రాష్ట్రంలో ధర్మపురి జిల్లాలో ఉన్నది. ఈ జలపాతం కావేరీ నది మీద ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది. ఆకాశం నుంచి దూకుతున్నట్లుగా కనిపించే ఈ జలపాతాన్ని ‘భారతీయ నయాగరా జలపాతం’ అని పిలుస్తారు. ఇక్కడున్న కార్బొనటైట్ రాళ్ళు దక్షిణాసియాలోనూ, ప్రపంచంలోనే పురాతనమైనవిగా భావిస్తారు. చూపరులకు కళ్ళు చేదిరనట్లనిపించే ఈ జలపాతం ఆధునిక ప్రపంచానికి సుదూరంగా ఉండే హోగెనక్కల్‌ సహజత్వానికి చేరువగా ఉంటుంది.

ఈ వాటర్ ఫాల్స్ లో లెక్కపెట్టలేనన్ని జలపాతాలు ఉన్నాయి. 250 మీటర్ల ఎత్తు నుండి భూమి మీదకు దూకుతుంటాయి. వర్షపు నీరు కొండ వాలులో ప్రయాణించి హోగెనక్కల్ దగ్గర నదిలో కలుస్తుంది. ఈ వాటర్ ఫాల్స్ నీరు కావేరి డ్యాం బ్యాక్ వాటర్స్. అంతెత్తు నుండి కిందకు దూకే క్రమంలో నీటి తుంపరలు 20 మీటర్ల ఎత్తు లేస్తాయి. ఈ తుంపరలన్నీ కలిసి పొగ కప్పేసినట్టు ఉంటుంది. హోగెనక్కల్ అంటే అర్థం కూడా ఇదే. మంచు తుంపరల నుండి వచ్చే శబ్ధం అని. ఈ హోగేనక్కల్ జలపాతం కేవలం అందంగా కనిపించడం మాత్రమే కాదు.. ఆరోగ్యపరంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. అదెలా అంటే.. ఈ నీటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు పోతాయంటారు. ఈ జలపాతం నీరు చూడటానికి వెరైటీగా వున్నప్పటికీ.. ఆరోగ్యపరంగా మేలు చేస్తాయట.

ఈ జలపాతంలో తెప్ప విహారం ఎంతో పేరుగాంచింది. తెప్ప అంటే, వెదురు బద్దలతో తయారు చేయబడిన ఒక చిన్న బోటుగా అంచులు కొంత వరకు మూయబడి వుంటుంది. నీరు లోనికి రాకుండా, జంతువుల చర్మం లేదా ప్లాస్టిక్‌ షీట్‌ వంటివి కింద వేస్తారు. తెప్పను నదులలో చేపలు పట్టేందుకు కూడా వాడతారు. ఎంతో ఆనందకరమైన ఈ తెప్ప విహారం తమిళనాడులోని హోగెనక్కల్‌ లో బాగా కనపడుతుంది. పురాతనమైన ఈ బోట్లు జలపాతాల నీటిలో వేగంగా ప్రయాణిస్తాయి. ఈ ప్రయాణం కొద్దిపాటి భయం కలిగించి నప్పటికీ, సాహస వంతులకు ఆనందాన్ని ఇస్తుంది. ఈ విహారం ప్రతిఒక్కరికీ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. ఆనందకరమైన ఈ తెప్ప సాహస క్రీడ వర్షాకాలంలో మరింత ఆనందాన్ని ఇస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hogenakkal falls  Indian Niagara Water Falls  India Best Destinations  

Other Articles