The Historical Story Govardhanagiri Where Sri Krishna Lift A Hill With His Finger | Telugu Mythological Stories

Govardhanagiri historical story sri krishna mythological history

Govardhanagiri special story, Govardhanagiri hill, sri krishna mythological stories, sri krishna updates, sri krishna history, sri krishna lift hill, sri krishna mythological histories, Govardhanagiri place history

Govardhanagiri Historical Story Sri Krishna Mythological History : The Historical Story Govardhanagiri Where Sri Krishna Lift A Hill With His Finger.

శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన ప్రదేశం

Posted: 09/10/2015 06:08 PM IST
Govardhanagiri historical story sri krishna mythological history

ద్వాపరయుగంలో.. గోవర్ధనగిరి ప్రాంతంలో వర్షాలు భీభత్సంగా కురుస్తుండగా ఆ ప్రాంతాన్ని రక్షించేందుకు శ్రీకృష్ణుడు కొండను ఎత్తి వరుసగా ఏడురోజులపాటు పట్టుకున్నట్లుగా పురాణగాధలు వినే వుంటాం. ఆ ప్రాంతం గురించే ఇక్కడ చర్చించుకోబోతున్నాం. మథురకు సమీపంలో ఉన్న గోవర్ధనగిరి హిందువులకు ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ గోవర్ధనగిరికి కృష్ణుడి దైవలీలలో భాగంగా స్వర్గం నుండి భూమి మీదకు వచ్చిందని నమ్ముతారు. అంతేకాదు.. ఈ ప్రదేశంతో కృష్ణుడుకి సంబంధం ఉందని నమ్ముతారు. ఈ గోవర్ధనగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే.. కోరుకున్న కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించే ఈ గోవర్ధనగిరి ప్రస్తుతం ప్రధాన యాత్రా ప్రదేశాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. ఇక్కడ ఉన్న దేవుని భారీ విగ్రహం చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలకు ఆధ్యాత్మికతను పెంచుతుంది. అలాగే.. ఈ ప్రాంతంలో చెప్పుకోదగిన విశేషాలు ఎన్నో వున్నాయి. అవేమిటో తెలుసుకుందాం..

* గోవర్ధనగిరి కొండ : ఈ గోవర్ధనగిరి కొండకు సంబంధించి ఓ పురాణగాధ ఆచరణలో వుంది. నందగోకులంలోని యాదవులకు గోసంరక్షణం ప్రధాన వృత్తి. ఆ గోవులకు అవసరమైన గ్రాసంనకు ప్రధాన ఆధారం గోవర్ధనగిరి. యాదవులు మేఘాలకు ప్రభువైన ఇంద్రుడు తాము గోవుల్ని మేపే గోవర్ధనగిరి మీద వర్షాలు కురిపించి పంటలు పండించటానికి ప్రతి సంవత్సరం ఇంద్రయాగం చేస్తుంటారు. కాని ఒకనాడు కృష్ణుడు ఈ యాగ నిర్వాహణను అడ్డుకొన్నాడు. ఈ విషయం గమనించిన ఇంద్రుడు ఆగ్రహంతో ఊగిపోయి.. యాదవులను విక్షించాలని పూనుకుంటాడు. ధారపాతమైన వర్షాన్ని గోకులంపైన ఎడతెరిపి లేకుండా కురిపిస్తాడు. దీంతో యాదవులందరు శ్రీకృష్ణుని శరణాగతి కోరటంతో.. ఆయన గోవర్ధనగిరిని తన చిటికిన వ్రేలిపై ధరించి సర్వప్రజలకు, గోవులకు రక్షణ కల్పిస్తాడు. ఈ విధంగా 7 రోజులవరకు రక్షణ కల్పిస్తాడు.

హర దేవజీ ఆలయం, పవిత్రమైన కుసుమ్ సరోవర్, మన్సి గంగా ట్యాంక్, రాధా కుండ్ లతోపాటు ఇంకా ఎన్నో ఆకర్షణీయమైన ప్రదేశాలు వున్నాయి. ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి దేశవిదేశాల నుంచి భక్తుల లక్షల సంఖ్యలో తరలివస్తారు. ఒకప్పుడు సాధారణ నిర్మానుష్యంగా వుండే ప్రదేశం.. నేడు దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా పరిగణించడుతోందందటే.. అది శ్రీకృష్ణుని మహిమేనని అక్కడి స్థానికులు నమ్ముతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Govardhanagiri  Sri Krishna Mythological Stories  

Other Articles