Information about simla

Shimla Tourist Information, Shimla genral Information, information about Simla

Shimla Tourist Information, Shimla genral Information, information about Simla

information about Simla.png

Posted: 12/31/2012 02:49 PM IST
Information about simla

information_about_Simla

ఎటుచూసినా తెలుపు తివాచీ పరిచినట్లుండే దట్టమైన మంచు. ఆ మంచును కుప్పలుతెప్పలుగా పోసినట్లుండే పర్వతాలపై సూర్యకిరణాలు పడి బంగారు వర్ణంలో మెరిపోయే చూడచక్కని దృశ్యాలు, పచ్చని పచ్చికబయళ్ళు, ఆపిల్‌ తోటల అందాలు, లోయలు, పైన్‌... ఓక్‌ చెట్ల సోయగాలు ఇవన్నీ సిమ్లాను భూతల స్వర్గంగా తీర్చిదిద్దారుు. ప్రతిఏటా ఫిబ్రవరి నెలలో జరిగే వింటర్‌స్పోర్ట్‌‌స సిమ్లాకు ప్రత్యేక ఆకర్షణ.సిమ్లా మంచుకొండల్లో అడ్వెంచర్‌ టూర్‌ ఓ మరుపురాని అనుభూతి.

మంచుపై స్కీయింగ్‌ చేస్తూ దూసుకు పోవడంలో ఉన్న ఆనందం మాటల్లో చెప్పరానిది. సిమ్లా నుంచి కుఫ్రి వెళ్లేదారి అంతా ఒకవైపు ఆకాశా న్నంటే పర్వతాలు, మరోవైపు లోతైన లోయలు. ఈ పర్వత శ్రేణు లన్నీ మంచుదుప్పటి కప్పుకున్న ట్లుగా ఉంటే, లోయలన్నీ రంగు రంగుల సీతాకోక చిలుకల్లా ఉంటాయి. వింటర్‌ స్పోర్ట్‌‌సకు కేంద్రమైన సిమ్లాలో ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో వింటర్‌ స్పోర్ట్‌‌స వేడుకలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి. సిమ్లా పట్టణం మొత్తం కొండల్లోనే అమరి వుంది. అర్ధచంద్రా కారపు పర్వత సానువుల పై భాగంలో ఉండే ఈ పట్టణంలో ఎటుచూసినా ఫైన్‌, దేవదారు చెట్లు ఒకదాన్ని మించి మరొకటి ఆకాశాన్నం టుతున్నాయా! అన్నట్టుగా ఉంటాయి. అయితే శీతాకాలంలో మాత్రం ఈ చెట్లను మంచుదుప్పటి కప్పుకొని శ్వేతవర్ణంలో కనువిందు చేస్తాయి. ఇక్కడి ఇళ్లన్నీ దూరంనుంచి చూస్తే ఒకదానిపై ఒకటి పేర్చినట్లుగా ఉంటాయి.

మాల్‌ రోడ్‌... లక్కడ్‌ బజార్‌...

సిమ్లా వెళ్లిన పర్యాటకులు మొట్టమొదటగా దర్శించేది మాల్‌ రోడ్‌నే. మాల్‌ సెంటర్‌ ఇక్కడ ఓ ప్రత్యేక ఆకర్షణ. ఈ మాల్‌ రోడ్‌లో విహరించడానికి పర్యా టకులు ఎక్కువగా ఇష్టపడతారు. గుర్రమెక్కి మాల్‌ అంతా చుట్టి, కావాల్సిన వన్నీ కొనుక్కోవచ్చు. సిమ్లా, దాని చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఆపిల్‌ తోటలు ఎక్కువగా ఉంటాయి. పర్యాటకులు ఈ పండ్లను కోసుకుంటున్నా స్థానికులు అభ్యంతరం చెప్పరు. అయితే కేవలం పండ్లను మాత్రమే కోసుకోవాలి. అలా కాకుండా పచ్చికాయలను ముట్టుకుంటే మాత్రం ఊరుకోరు. సిమ్లాలో ముఖ్యంగా దర్శించాల్సిన వాటిలో హిమాలయ పర్వతాలు ముఖ్యమైనవి. అత్యద్భుతంగా కనిపించే స్కాండల్‌ పాయింట్‌, చర్చి, లైబ్రరీ, లక్కడ్‌ బజార్‌.. తదితరాలు ఇక్కడ ముఖ్యమైన ప్రదేశాలు.లక్కడ్‌ బజార్‌లో కొయ్యలతో చేసిన హస్త కళల వస్తువులు విరివి గా దొరుకుతాయి. స్కాండల్‌ పాయింట్‌ నుంచి జనరల్‌ పోస్ట్‌ ఆఫీస్‌ వైపు కాస్త దూరం నడిస్తే కాలాబరి ఆలయం వస్తుం ది. ఇందులో ఉన్న దేవత శ్యామలా దేవి. ఈ దేవత నుంచే సిమ్లాకు ఆ పేరు వచ్చి నట్లు స్థానికులు చెబుతుంటారు.

సిమ్లాలోనే ఉన్న జాకూ ఆలయం ఉన్న శిఖరం కూడా ప్రత్యేకంగా చూసి తీరా ల్సిందే. ఇక్కడి నుంచి చూస్తే సిమ్లా అం తా కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. ఇక్కడే హనుమాన్‌ ఆలయం కూడా ఉంది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే కాస్త ఓపికతో నడిచి వెళ్లాల్సి ఉం టుంది. నడవలేనివారి కోసం గుర్రాలు, ట్యాక్సీలు కూడా అందు బాటులో ఉంటాయి.

Simla_botigశిల్పకళల నెలవు... స్టేట్‌ మ్యూజియం...

ఇక ఇక్కడి స్టేట్‌ మ్యూజియంలో హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన పురాతన, చారిత్రక ప్రాధాన్యం ఉన్న శిల్పాలు, పెయింటింగ్స్‌ ఉన్నాయి. భారతీయ సంస్కృతిని కళ్లకు కట్టినట్లు చూపించే ఈ మ్యూజియంలో ఆసక్తి కలవారికి సమయం ఎలా గడిచిపోతుం దో కూడా తెలియదట. అలాగే ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ కూడా చూడదగ్గ ప్రాంతమే. అక్కడినుంచి 15 నిమిషాలు నడిస్తే ప్రాస్పె క్ట్‌ హిల్‌కు చేరుకోవచ్చు. ఇక్కడ కామనదేవి ఆలయాన్ని దర్శించ వచ్చు. దాని నుంచి ఏడు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే సమ్మర్‌ హిల్‌ చూడవచ్చు. అక్కడ ఉండే జార్జియన్‌ హౌస్‌లోనే మహా త్మాగాంధీ విడిది చేశారట. హిమాచల్‌ ప్రదేశ్‌ యూనివర్సిటీ కూడా ఇక్కడే ఉంది.సిమ్లా నుంచి బయలుదేరినప్పటినుంచి ప్రతి ఐదు లేక ఆరు కిలోమీటర్లకు ఒక టూరిస్ట్‌ ప్లేస్‌ దర్శనమి స్తుంది. అలాంటి వాటిలో తత్తపాని, హాట్‌ వాటర్‌ స్ప్రింగ్‌ (వేడినీటి గుండం) తప్పకుండా దర్శించాలి. సిమ్లాకు చేరుకోవాలంటే.. ఢిల్లీ నుం చి చండీగఢ్‌, కల్కాల మీదుగా చేరాలి. కల్కా నుంచి సిమ్లా వెళ్లే టాయ్‌ ట్రైన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు కనెక్టింగ్‌ ట్రైన్‌లో వెళ్లవచ్చు.

నిజానికి సిమ్లా ప్రయాణంలో ఆనందం కల్కా నుంచే మొదలవు తుంది. అక్కడి నుంచి నారోగేజ్‌ రూట్‌లో టాయ్‌ ట్రైన్‌లో ప్రయా ణించటం పర్యాటకులకు మరపురాని అనుభూతులను మిగు ల్చుతుంది. ఎటుచూసినా హిమాలయ పర్వతశ్రేణులు, లోయ లు, ఫైన్‌, ఓక్‌ చెట్లతో ఆ దేవుడు ఈ భూ ప్రపంచంపైనే స్వర్గాన్ని సృష్టించాడా అని పించక మానదు.సిమ్లా, కల్కాల మధ్య 103 సొరంగాలు, 87 బ్రిడ్జిలు ఉన్నాయి. టాయ్‌ ట్రైన్‌లో వెళ్లే టప్పుడు వీటన్నిం టినీ చూ స్తూ, అంతులేని ఉద్వేగాన్ని పొందవచ్చు. గ్రేటెస్ట్‌ నారో గేజ్‌ ఇంజనీరింగ్‌ అచీవ్‌మెం ట్‌ ఇన్‌ ఇండియాగా గిన్నిస్‌ బుక్‌లో ఈ మార్గం రికార్డయ్యింది. ఈ మార్గంలో లెక్కలేనన్ని చిన్నా పెద్ద నదులు కనిపిస్తాయి. వీటిలోని చాలా నదుల్లో ఎండాకాలంలో నీళ్లుండవు. కొండపక్కగా కాసేపు, సొరంగంలో మరి కాసేపు, కిందకు చూస్తే నది, ఇలా సహజత్వానికి సాంకేతికత మేళవించిన సిమ్లా సోయగాలు యాత్రికుల మనస్సుల్లో ఎల్లప్పటికీ నిలిచిపోతాయి.

సమ్మర్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా...

వింటర్‌ స్పోర్ట్‌‌స సంరంభం తరువాత ఫిబ్రవరి చివరి మాసం నుండి వేసవి విడిదికి వచ్చే పర్యాటకుల సందడి పెరుగుతుంది. భారతదేశంలోని ప్రముఖ పర్యాటక స్థలాలలో ఒకటిగా, వేసవి విడిదిగా పేరుగాంచింది సిమ్లా. 1819లో బ్రిటీష్‌ వారిచే కనుగొనబడిన సిమ్లా, ఆ తరువాత 1864వ సంవత్సరంలో సమ్మర్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా ప్రకటించబడింది. బ్రిటీష్‌వారి కాలంలో సిమ్లాను వేసవి విడిదిగా ఉపయోగించు కునేవారు. దేశ విభజన సమయంలో కాశ్మీర్‌కు సంబంధించిన చర్చలు ఇక్కడి వైశ్రాయ్‌ భవ నంలోనే జరగటం విశేషంగా చెప్పవచ్చు. అందుకనే సిమ్లాను సందర్శించే పర్యాటకులు తప్పకుండా వైశ్రాయ్‌ భవనాన్ని కూడా దర్శిస్తుంటారు. ప్రస్తుతం ఈ భవనంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌ స్టడీస్‌ను ఏర్పాటు చేశారు.

వేడినీటిలో జలకాలాట..!

హాట్‌వాటర్‌ స్ప్రింగ్‌ (వేడినీటి గుండం) సిమ్లా విహారంలో ప్రత్యేక అంశం. ఈ వేడినీటి గుండం లో స్నానం చేయడం ఎంతో ఉల్లాసాన్నిస్తుంది. ఈ నీటి గుండంలో తప్ప దాని చుట్టుపక్కల పరిసరాలన్నీ రక్తం గడ్డకట్టించేంతగా చల్లగా ఉంటాయి. కానీ, ఈ వేడినీటి గుండంలోని నీరు మాత్రం మరుగుతూ ఉంటాయి. ఈ నీటిలో సల్ఫర్‌ ఉన్న కారణంగా రసాయనిక చర్య జరిగి అలా జరుగుతూ ఉంటుందట. అందుకే ఇక్కడ స్నానం చేస్తే చర్మవ్యాధులు నయమ వుతాయని నమ్ముతుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  History of prayag
Tourism in russia  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles