Tourism in russia

tourism in Russia.png

Posted: 12/26/2012 10:56 AM IST
Tourism in russia

tourism_in_Russia

ప్రపంచంలో పెద్ద దేశం ఇది. ప్రాచీన నాగరకత విలసిల్లిన ఈ నేల... రెండు ఖండాల్లో దేశమై విస్తరించింది. అంతరిక్ష పరిశోధనలకు కరదీపిక... మూడవ ప్రపంచదేశాలకు ఆలంబన... పారిశ్రామికీకరణకు బీజం వేసిన నేల...రష్యా దేశం విశేషాలు

మీకోసం...అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆలంబనగా నిలిచిన దేశం రష్యా. అమెరికా ఆధిపత్యానికి తలవంచాల్సిన తప్పనిసరి పరిస్థితులను జీర్ణించుకోలేని డెవలపింగ్ కంట్రీస్ రష్యా అండతో వెన్నును నిటారుగా లేపాయి. ఆ జాబితాలోదే ఇండియా కూడ. రష్యా సహకారంతో అంతరిక్ష పరిశోధనల దిశగా అడుగులేసింది భారత్. మనదేశంలో ఒక తరానికి ఉన్నత విద్య అంటే రష్యానే గుర్తొచ్చేది. ఒకప్పడు రష్యాను రష్యా అంటే ఒప్పుకునే వాళ్లు కాదు టీచర్లు. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని చెప్పించేవాళ్లు.

tourism_in_Russia1రెండు ఖండాల జీవనశైలి !

రష్యా ఆసియా, యూరప్ ఖండాల్లో విస్తరించి ఉంది. దేశంలో యూరప్ ఖండంలో ఒక జీవనశైలి, ఆసియా ఖండంలో ఒక జీవనశైలి కనిపిస్తాయి. రాజధాని నగరం మాస్కోలో కూడా ఈ విభిన్నత స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఐరోపా దేశమా, ఆసియా దేశమా అని మేధోమధనం చేసిన మేధావులు మధ్యేమార్గంగా యురేషియా అనే కొత్త వర్గీకరణకు తెరతీశారు. ఈ దేశంలో ముప్పై ఏళ్ల కిందటి సామాజికఆర్థిక వ్యవస్థకూ ఇప్పటికీ తేడా ఉంది. అప్పట్లోనే రష్యా శాస్త్రసాంకేతిక రంగాల్లో ముందడుగులో ఉండేది. క్యాపిటలిస్ట్ దేశాలతో పోలిస్తే సామాజికంగా వెనుకబాటు తనం కనిపించేది అంటుంటారు. కానీ అప్పట్లోనూ ప్రజల జీవనస్థాయి ఉన్నతంగా ఉండేది. ఎవరూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేదు. అత్యంత ఆధునిక సేవలు కూడా చవగ్గా దొరికేవి. చేతిలో డబ్బు ఉండేది, కొనాలంటే వస్తువులూ దొరికేవి. అయితే ప్రతి ఒక్కరూ అవసరం ఉన్నా లేకపోయినా కొని ఇంట్లో పడేసుకోవడం, ఆ తర్వాత డస్ట్‌బిన్‌లో పడేయడం వంటి బాధ్యతరాహిత్యం ఎక్కువైంది.

అన్నీ చౌకధరల దుకాణాలే !

మన దగ్గర ప్రభుత్వం నిర్వహించే చౌకధరల దుకాణం ఊరికొకటి ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ చౌకధర దుకాణమే. పది రూబుళ్లు పర్సులో వేసుకుంటే ట్యాక్సీలో తిరిగి షాపింగ్ చేసినా కూడా డబ్బు మిగిలేది. బేరం లేదు, కోడిగుడ్డు మీద కూడా ప్రైస్ లేబిల్ అతికిస్తారు. కంట్రోల్డ్ ప్రైస్ ఎకానమీని మెయింటెయిన్ చేశారు. ఇక్కడ కూరగాయలు పండే వాతావరణం కొద్ది నెలలే ఉంటుంది. చేపలు, మాంసం తింటారు.

మంచు పూల వాన !

మంచు పూలరెక్కల్లా నిశ్శబ్దంగా రాలి పడుతుంటుంది. తమాషా ఏమిటంటే... ఈ మంచులో ఎంత సేపున్నా తడిసినా ముద్దయిపోం. వాతావరణం మంచు కరగడానికి వీల్లేనంత చల్లగా ఉంటుంది. మాస్కో నది ఏడాదిలో నాలుగు నెలలు గడ్డకట్టి కాంక్రీట్‌లా మారిపోతుంది. ఈ ఐస్ మీద పిల్లలు ఫుట్‌బాల్ ఆడతారు. ఏప్రిల్‌లో మంచు కరిగి నీరవుతుంది. మనం రాత్రి ఇంటి ముందు కారు పార్క్ చేస్తే ఉదయానికి మంచునిండిపోతుంది. ఆ స్థితిలో ఉన్న కారును శుభ్రం చేయకుండా మెట్రో రైల్లో వెళ్లే వాళ్లు ఎక్కువ.

మాస్కో నదిలో విహారం !

మాస్కో నదిలో విహరించడానికి రివర్ ట్రామ్‌లుంటాయి. ఈ ట్రామ్ కీవ్‌స్కయా మెట్రో స్టేషన్, గోర్కీ పార్క్, పీటర్ ద గ్రేట్ మాన్యుమెంట్, క్రైస్ట్ ద సేవియర్ కెథడ్రాల్, ద క్రెమ్లిన్ కోటెల్‌నిచెస్కయా ఎంబార్క్‌మెంట్, జమోస్క్‌వోరెచ్యె, పార్క్ కల్చరీ, క్రిమ్‌స్కీ బ్రిడ్జి, థియేటర్ ఎస్ట్రాడా, ఉస్టిన్ బ్రిడ్జ్, నోవాస్పాస్ బ్రిడ్జిలను కలుపుతుంది. రష్యా దేశం కళలు, సృజనాత్మక రంగాన్ని మధ్యయుగంలోనే వ్యవస్థీకృతం చేసిన దేశం. 18వ శతాబ్దంలోనే ఇక్కడి ‘అకాడమీ ఆఫ్ ఆర్ట్స్’ అంతర్జాతీయ ప్రసిద్ధి చెందిన కళాకారులను తయారు చేసింది. రష్యన్ మ్యూజికల్ సొసైటీ స్థానిక జానపద కళల్లో కొత్త ఆవిష్కరణలు తెరతీసింది. రష్యన్ బాలే ప్రపంచంలో ప్రసిద్ధి పొందిన నాట్యరూపకం. లియో టాల్‌స్టాయ్ వంటి రచయితల పుట్టినిల్లు రష్యా. రష్యన్ సాహిత్యానికి ప్రపంచ ఖ్యాతి ఉంది. వేల ఏళ్ల సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం, ఇక్కడి వాళ్లలో కళాభిరుచి కూడా ఎక్కువే. దీనికి నిదర్శనంగానే ఉంటాయి ఇక్కడి నిర్మాణాలు. రష్యా కట్టడాలలో బైజాంటైన్ ఆర్కిటెక్చర్ ప్రభావం ఉంటుంది. సెయింట్ బాసిలికా కెథడ్రాల్ (ఆనియన్ డోమ్) 15వ శతాబ్దంలో నిర్మించినది. చర్చిలు, మసీదుల వంటి చారిత్రక కట్టడాలు సృజనాత్మకతకు ప్రతిబింబాలు.

tourism_in_Russia2గార్డ్ ఆఫ్ ఆనర్ !

స్టాలిన్ ప్రభుత్వం లెనిన్ పార్థివ దేహాన్ని రెడ్‌స్క్వేర్‌లో క్రెమ్లిన్ భవనం దగ్గర సమాధిమందిరంలో భద్రపరిచింది. కమ్యూనిస్టు పాలనలో రోజూ సైనిక కవాతు జరిగేది. డ్యూటీ ముగిసిన దళం, డ్యూటీలోకి వస్తున్న దళం కవాతు చేస్తూ మారే దృశ్యాన్ని చూడడానికి పౌరులు మంచుని లెక్కచేయకుండా బారులు తీరేవారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Information about simla
Historic place of orugallu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles