History of prayag

Allahabad history, Prayag history, Allahabad history

Allahabad or Prayag is a historian's paradise. History lies embedded everywhere, in its fields, forests and settlements.

History of Prayag.png

Posted: 01/19/2013 11:54 AM IST
History of prayag

Prayagప్రయాగ...త్యాగానికి ప్రతీక. పురాణేతిహాసాలలో మార్మోగిన ప్రాంతం. అమృతబిందువు రాలిన చోటు. పుణ్యనదుల సంగమస్థలం. వేలాది సంవత్సరాల యాగఫలాన్నిచ్చే పవిత్రనగరం. కుంభమేళా జరిగే నాలుగు క్షేత్రాలలో ఇది ఒకటి.144 సంవత్సరాల తరువాత ఇక్కడ ఇప్పుడుమహాకుంభమేళా జరుగుతోంది. రోజులు మారుతున్నకొద్దీ నగరమూ మారింది. పేరూ మారింది. ప్రస్తుతం మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగకు ఇప్పటిపేరు అలహాబాద్‌. ఆధునిక భారతంలో మెజారిటీ ప్రధానులను అందించింన నగరం. పారిశ్రామిక ప్రగతికి దర్పణం. దేశంలోని అన్ని ప్రాంతాలలనుంచి ఇక్కడికి చేరుకునే మార్గాలు, సౌకర్యాలు ఉన్నాయి. మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగ ప్రస్థానం.

భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు... ప్రతీ రాష్ట్రంలోనూ పుణ్యకేత్రాలు అలరారుతున్నాయి... పండుగలు, పర్వదినాలు, ఉత్సవాలు జరుపుకుంటూ ప్రజలు తమ భక్తిప్రపత్తులను చాటుకుంటుంటారు. ఇలాంటి వాటిల్లో అతి పెద్దప్రు ణ్యక్షేత్రం ప్రయాగ.... నేటి అలహాబాద్‌.. ఇదే మహాకుంభమేళాకు నెలవు. పరమ పవిత్రమైన గంగ, సింధు, యమున నదులు కలిసే చోటు ఇక్కడే ఉంది. ఈ కుంభమేళా సమయంలో భక్తులు లక్షలాదిగా అలహాబాద్‌కు తరలివస్తారు. అందాలకు, ఆనందానికి ఇక్కడ కొదవ లేదు. కనీసం వారం రోజులుంటేగాని పట్టణంలోని అన్ని ప్రాంతాలను వీక్షించలేము. విహరించే పక్షులు...పడవ లపై నదీ ప్రయాణం... ఉల్లాసాన్ని పంచే అక్బర్‌ కోట, ఆధ్యాత్మితను ప్రతిబింబించేఆలయాలు చూస్తే కాని తనివి తీరదు. అసలు ప్రయాగకు ఆ పేరు ఎలా వచ్చింది... అది అలహాబాద్‌గా ఎందుకు మారింది... ఆధ్యాత్మికంగా, పారిశ్రామిక, రాజీకీయ, క్రీడారంగాల్లో ఈ నగర అభివృద్ధి ఏ విధంగా ఉంది అన్న పూర్వాపరాలను తెలుసుకుందాం.

నగర ప్రాసశ్త్యం...

‘‘ప్రకృష్టం సర్వ యౌగభ్య: ప్రయాగమితి కథ్యతే’’ రామయణ, భారత, పురాణాది గ్రంథాలు ‘ప్ర’-ప్రకృష్ట అనగా విశేషంగా + యాగ అనగా యాగాలు వెరసి యజ్ఞాలు జరిగిన క్షేతం అని అర్థం... మాఘమాసంలో లెక్కకే అందనన్ని తీర్థాల మహత్తు ప్రయాగ పొందుతుంది. మత్స్యపురాణంలో మార్కండేయ ముని యుధిష్టురిడికి దీని మాహాత్మ్యం తెలియజేస్తూ, స్వయంగా బ్రహ్మదేవుడు సైతం నిరంతరం ఈ తీర్థ స్మరణ చేస్తూ ఉంటారని చెబుతాడు. సమస్త దేవతాగణం, అన్ని తీర్థాలు దీనిలో నివాసముంటాయని మత్స్యపురాణాం చెబుతోంది.

చారిత్రక విశేషాలు...

ఆధ్యాత్మికతతో పాటు ప్రయాగ నగరం చారిత్రక విశేషాలను కూడా కలిగి ఉండడం విశేషం. మొగల్‌ చక్రవర్తి అక్బర్‌ నిర్మించిన కోట, భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రు నివాస గృహం ‘ఆనంద్‌ భవన్‌’కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. రామాయణ కాలం నాటి భరద్వాజ మహామునికి చెందిన ఆశ్రమంగా చెప్పే చోటనే అలహాబాద్‌ విశ్వవిద్యాలయం నెలకొల్పబడింది.దీంతో సంవత్సరం పొడవునా ఈ నగరాన్ని పర్యాటకులు సందర్శిస్తూనే ఉంటారు.

చూడదగ్గ ప్రదేశాలు...

శివుని జటాజూటం నుంచి వెలువడ్డ గంగమ్మ ఓ ప్రక్క స్వచ్ఛంగా.. తెల్లగా ... చలాకీగా సాగుతూ ఉంటుంది ... కిష్టయ్యను సేవించడంతో నల్లబడ్డదా అన్నట్టు నల్లని యమున గంగను జేర సంకోచంగా వస్తున్నట్టు రెండవ ప్రక్కనుంచి మెలమెల్లగా వస్తుంది. తెల్లటి శివయ్యా.. నల్లటి కిష్టయ్య.. తెల్లటి గంగమ్మ .. నల్లటి యమునమ్మ.. ఆ దశ్యం నయన మనోహరంగా ఉంటుంది. అంతర్వాహిని సరస్వతి కాళ్లకు చల్లగా తగులుతుంది... ఆ త్రివేణి సంగమం భరతభూమికి క్షేత్రమాహత్మ్యం కల్పిస్తున్నది.. కనపడే రెండు నదులు, కనపడనిది ఒకటి... ఆ నదుల త్రివేణీ సంగమం కళ్లను మైమరపిస్తుంది. ఇక్కడ కురులు సంగమంలో వదిలితే నీటిపై తేలకుండా క్రిందకు పోవడం అక్కడ విశేషం... శంకరమఠం.. తర్వాత లలితాదేవి ఆలయం ఉంది. ఇది శక్తిపీఠాల్లో ఒకటి. శక్తిపీఠాల్లో చెయ్యి పడిన ప్రదేశం.. ఒక నూతిలో పడినదట.. గర్భగుడిలో నూయి.. దానికి పూజాదికములు నిర్వహిస్తారు. మహిరావణుని చంపి రామలక్ష్మణుల తన భుజాలపై తెచ్చిన హనుమ సుందర రూపం.. పడుకున్న భంగిమలో ఉంటుంది, అలహాబాద్‌ మ్యూజియం, యమున సస్పెషన్‌ బ్రిడ్జీ, నాగవాసుకీ ఆలయం ఇలా ఎన్నో చూడదగ్గ ప్రదేశాల సమాహారమే ప్రయాగ..

Allahabadఆదాయ వనరులు...

అలహాబాద్‌ నగరానికి ఆదాయ వనరులను ఎక్కువగా సమకూర్చేవి పర్యాటకం, ఫిషింగ్‌, వ్యవసాయం. ఇక్కడ 58 భారీ పరిశ్రమలు, 3000 చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. ఎక్కువ శాతం ప్రజలు ఈ పరిశ్రమలపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. గాజు, వైర్‌లను తయారు చేసే పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. నగర అభివృద్ధి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.ఎక్కడ ఉంది...ఎలా వెళ్లాలి...
శైవ పుణ్యక్షేత్రమైన వారణానికి 135 కిలోమీటర్ల దూరంలోనే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రయాగ ఉంది. మన దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రైల్వే సదుపాయాలు ఉన్నాయి. వారణాసి నుంచి వెళ్లాలనుకునే వారి కోసం బస్సు సౌకర్యం కూడా ఉంది. అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి కెక్కిన కాశి నుంచి నాలుగు గంటలు ప్రయాణం చేస్తే అలహాబాద్‌ చేరుకోవచ్చు. అలహాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి నదీ సంగమం చాలా దగ్గర్లోనే ఉంటుంది. అయితే కుంభమేళా సమయంలో భక్తుల సంఖ్య పోటెత్తుంది. దీంతో భోజన, వసతి సౌకర్యాలకు మాత్రం ఎక్కువగానే ఖర్చవుతుంది.ప్రధానులను అందించిన నగరం

రాజకీయంగా అలహాబాద్‌కు ఎనలేని ప్రాధాన్యం ఉంది. దేశ ప్రధానులను ఎక్కువమందిని అందించిన నగరంగా దీనికి ప్రత్యేకత ఉంది. 13మంది ప్రధానుల్లో ఏడుగురు ఇక్కడివారే. అలహాబాద్‌లో పుట్టడమో, అలహాబాద్‌ యూనివర్శిటీలో విద్యాభ్యాసం చేయడమో లేదా ఇక్కడినుంచి ఎన్నికవడంద్వారా ప్రధానులైనవారిలో జవహర్‌లాల్‌నెహ్రూ, లాల్‌బహదూర్‌శాస్ర్తి, ఇందిరాగాంధీ, గుల్జారీలాల్‌నందా, రాజీవ్‌గాంధీ, చంద్రశేఖర్‌, విపిసింగ్‌ ఉన్నారు. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రు జన్మస్థలం. ఆనంద్‌, స్వరాజ్‌ నిలయాలు ఆయన నివాస గృహాలు. 1917లో ఇందీరాగాంధీ ఇక్కడే జన్మించారు. ఆమె బాల్యం కూడా ఇక్కడే గడిచింది. వి.పి.సింగ్‌ కూడా ఇక్కడే పుట్టారు. చంద్రశేఖర్‌ ఇక్కడి యూనివర్సిటీలో చదువుకున్నారు. జనవరి 1940 ఆనంద్‌భవన్‌లో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశానికి జాతి పిత మహాత్మాగాంధీ, సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌, విజయలక్ష్మీ పండిట్‌ లాంటి మహానుభావులు హాజరై అలహాబాద్‌ను సందర్శించారు.

Allahabad_cityచరిత్రలో అలహాబాద్‌...

1526లో అలహాబాద్‌ను మొగల్‌ చక్రవర్తులు పరిపాలించేవారు. మొగల్‌ చక్రవర్తుల్లో ముఖ్యుడైన అక్బర్‌ చక్రవర్తి ఇక్కడ శుత్రుదుర్భేధ్యమైన కోటను నిర్మించాడు. ఓ పక్క నది ప్రవహిస్తూ తీరంలో నిలబడి కోట చూస్తే నాటి చరిత్ర కళ్లముందు కదలాడుతుంది. అక్బర్‌ చక్రవర్తి కాలంలో ఈ నగరాన్ని ‘అల్లహ్‌నాస్‌’ అని మార్చాడని క్రమేపీ అది అలహాబాద్‌గా మారిందని అబు ఫజల్‌ రాశాడు. 1765లో బ్రిటీష్‌ వారు ఈ కోటలో సైనిక దళాన్ని ఏర్పాటు చేశారు. 1857 తరువాత భారత స్వాతంత్య్ర ఉద్యమంలో అలహాబాద్‌ కీలక పాత్ర పోషించింది. ఎందరో ప్రజలు జైలు పాలయ్యారు. ప్రధాన సమావేశాలకు ఆనంద్‌ భవన్‌, స్వరాజ్‌ భవన్‌లు వేదికగా మారింది. 1931లో ఆప్ప్రైడ్‌ పార్కు వద్ద బ్రిటీష్‌ దళాలు చుట్టుముట్టడంతో భారత స్వాతంత్య్ర విప్లవ నాయకుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ తనను తాను కాల్చుకుని మరణించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  England tourism and information
Information about simla  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles