Historic place of orugallu

Kakatiyas of Warangal, Historic place of Orugallu,

Kakatiyas of Warangal are one of the major dynasties that ruled over Andhra and shaped its history and civilization.

Historic place of Orugallu.png

Posted: 12/18/2012 12:53 PM IST
Historic place of orugallu

kakatiya_kalathoranamచారిత్రక ప్రాశస్థ్యంగల అనేక శిల్పకళా సంపదకు ఆలవాలమైన వరంగల్‌ (ఓరుగల్లు) ప్రాంతం... శిల్పకళా ఖండాలు, పురావస్తు కట్టడాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలను తన ఒడిలో నిక్షిప్తం చేసుకున్నది. ఏ రాయిని కదిలించినా సరాగాలు పలికే ప్రత్యేక శిల్ప సందప కాకతీయుల సొంతం. రామప్ప దేవాలయంలో ఇప్పటికీ కొన్ని శిల్పాలను తాకితేచాలు సప్తస్వరాలు వినిపిస్తాయి. కాకతీయ రాజుల కాలంలో శిల్పకళా పోషణకు పెట్టింది పేరుగా ఉండేది. పోరాటాల పురిటిగడ్డగా పేరొందిన ఓరుగల్లు కాకతీయుల కాలం నాటి అపూర్వమైన వారసత్వ సంపద, సుసంపన్నమైన సాంస్కృతిక వైభవంతో పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది. రామప్ప దేవాలయానికి 800 ఏళ్ళు, రాణి రుద్రమదేవి సింహానాన్ని అధిష్టించి 750 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంలో కాకతీయ వైభవం గురించి తెలుసుకుందాం.

చారిత్రక నేపథ్యం, కాకతీయుల సామ్రాజ్య వైభవానికి పేరొందిన నగరం, అధ్భుతమైన శిల్పకళా ఖండాలు, పురావస్తు కట్టడాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, సుందరమైన పర్యాటక స్థలాలు వెరసి వరంగల్లు జిల్లా.  హైదరాబాద్‌ తర్వాత తెలంగాణాలో రెండవ అతి పెద్ద నగరంగా వరంగల్‌ పేరొందింది. ఈ జిల్లా అనేక విశిష్టతల కు నిలయం. రెండు శతాబ్దాల పాటు మహోజ్వలంగా వెలుగొందిన కాకతీయాంధ్ర సామ్రాజ్య రాజధాని నగరంగా చారిత్రక ఔన్నత్యానికి ఓరుగల్లు గీటురాయి. 

కాకతీయుల కాలం నాటి సామాజిక జీవితం...

కాకతీయుల కాలం ఒక స్వర్ణ యుగం. ఆ నాటి సామాజిక, ఆర్థి క, సాంస్కృతిక జీవన స్థితిగతులు వారి ప్రా చీన కట్టడాలు, శిల్పక ళా ఖండాలలో ఈ నాటికీ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఒక ప్రక్క కత్తులు కదనరంగంలో కదం త్రొక్కితే మరో ప్రక్క కవుల రచనలు సాహితీ రంగంలో స్వేచ్ఛా విహారం చేశాయి. ఇంకో ప్రక్క కళాకారులు, శిల్పులు తమ ప్రతిభా పాటవాలతో అచ్చెరువొందే చిత్ర విచిత్రాలెన్నో సృష్టించారు. సమతా, మమతలతో కూడిన సమైక్య జీవన సౌందర్యం ఇక్కడ పరిఢవిల్లింది. అంగళ్ళలో రతనాలను రాశులుగా పోసి అమ్మిన ఆ కాలంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సహజీవనం సాగించారు.

Orugallu_kotaఓరుగల్లు చారిత్రక ప్రాశస్త్యం...

తెలుగు తేజానికి, జాతి చైత న్యానికి ప్రతీకగా విలసిల్లిన వరంగల్లు జిల్లా సుమారు వెయ్యేళ్ళ సుదీర్ఘ చరిత్రను తన లో నిక్షిప్తం చేసుకుంది.  మొదటి బేతరాజు, పశ్చిమ చాళుక్యులు, సామంతుడుగా క్రీ.శ. 1000 నుండి 1030 వరకు, అనంతరం ఆయన కుమారుడు పోలరాజు 1108 నుండి 1116 వరకు, క్రీ. శ. 1158 నుండి 1195 వరకు రుద్రదేవుడు, క్రీ.శ. 1195 నుండి 1198 వరకు ఆయన సోదరుడు మహదేవుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. అనంతరం రాజ్యానికి వచ్చిన రాణి రుద్రమదేవి ఆమె దత్త పుత్రుడు ప్రతాపరుద్రుడు ఓరుగల్లును శిల్పకళా, సాహి త్య, సాంస్కృతిక రంగాలలో పరిపుష్టం చేశారు.

కాకతీయ శిల్ప కళాతోరణం...

కాకతీయ శిల్పం ఒక అద్భుత సృష్టికి సాక్షాత్కారం. ఇంత టి విశిష్టమైన కళాఖండాలు భారత దేశంలో మరెక్కడా కాన రావు. ఈ శిల్ప సంపదలో, నిర్మాణ వైఖరిలో ఏకత్వం ప్రముఖ గా కనిపిస్తుంది. ఇక్కడి శిల్పాలలో వేటిని చూసినా ఇది కాకతీయులదే అని సులభంగా చెప్పగలిగే ప్రత్యేకత వీటిలో ప్రదర్శితమవుతుంది. అందుకే 11-13 శతాబ్దాల మధ్య కాలంలో ఒక ఉద్యమంగా వికసించిన ఈ కళ కాక తీయ శిల్పంగా గుర్తింపు పొంది వరంగల్లు జిల్లా అనేక సుప్రసిద్ధమైన పర్యాటక ప్రాంతాలకు నిలయంగా మారింది. ఇక్కడి కట్టడాలు, సుందర ప్రదేశాలు, చూపరులను ఇ ట్టే కట్టిపడేస్తాయి. ప్రాచీన కళాఖండాలు అబ్బురపరుస్తాయి.

1000_piller_templeశిల్పకళతో అలరారుతున్న వేయి స్తంభాల దేవాలయం...

కాకతీయుల కాలంలో నిర్మించిన వేయి స్థంభాల దేవా లయం, నేటికి శిల్పకళా సంపదతో శోభిల్లుతోంది. ఈ దేవాలయాన్ని నిర్మించి తొమ్మిది శతాబ్దాలయినా నేటికీ సజీ వకళతో ముచ్చెట గొలుపుతూ అలరిస్తోంది. క్రీ. శ. 1158 నుండి 1195 వరకు కాకతీయ సింహాసనాన్ని అధిష్టించిన రుద్రదేవుడు దీన్ని నిర్మించాడు. స్వతంత్ర రాజ్యస్థాపనకు చిహ్నంగా తనతో రుద్రేశ్వరుడిని, వాసుదేవుడిని, సూర్యదే వుడిని హన్మకొండలో ప్రతిష్టించి ఈ త్రికూటాలయాన్ని వేయి స్థంభాల మండపంతో సుందరంగా నిర్మించాడు. రుద్రేశ్వర స్వామి (వేయి స్థంభాల) దేవాల యం నిత్యా పూజాదులతో శోభిల్లుతోంది. నిత్య అర్చనలు, అభిషేకాలు ఏడాది కాలంలో సంప్రదాయ పర్వదినాలైన కార్తీక పౌర్ణమి, మహాశివరాత్రి, శనిత్రయోదశి, వినాయక నవరాత్రి ఉత్సవాలు, శ్రీదేవీ శరణ్ణవరాత్రి ఉత్సవాలు ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు.

భద్రకాళీ దేవస్థానం...

వరంగల్‌ పట్టణం నడిబొడ్డున ఉన్న భద్రకాళీ చెరువు కట్ట ను ఆనుకొని శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల దేవాలయం ఉంది. భద్రకాళీ తటాకం నగర ప్రజల దాహార్తిని తీరుస్తోంది. శ్రీ భద్రకాళీ మాత భక్తుల పాలిట ఇలవేల్పుగా కోరిన వారికి కొంగు బంగారమై కోటి వరాలిచ్చే వరప్రదాయినీగా భాసి ల్లుతొంది. ఈ చారిత్రక ఆలయాన్ని దర్శించడానికి నిత్యం వందలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి వస్తారు. ఎత్తయిన కొండపై నిలిచిన అమ్మవారు, సుందరమైన ప్రకృ తి రమణీయత, ఎత్తయిన కొండలు మరో వైపు తటాకంతో కలిసి ఉండి ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతుంది.

Ramappa_templeసరాగాలు పలుకుతున్న రామప్ప శిల్పాలు...

సరిగమ లాలన చేసే స్థంభం, గణేష్‌ ప్రతిమలు మహాశిల్పి రామప్ప కళా సృష్టికి నిదర్శనం నేటి రామప్ప దేవాలయం. కాకతీయుల కాలంలో సుమారు 800 సంవత్సరాల కిత్రం జిల్లాలోని వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయాన్ని నిర్మించి శిల్ప సంపదకు చక్కటి అర్థాన్ని ఇచ్చారు. అద్భుత శిల్ప సంపదకు నిలయంగా, నిత్యం సందర్శకులకు అమితానందోత్సవాలను ఇస్తున్న రామప్ప దేవాలయం అజరామరం... అపూర్వం.రామప్ప దేవాలయంలో ప్రతీ శిల్పం నయన మనోహం.

మేడారం సమ్మక్క - సారలమ్మ దేవాలయం...

జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో పత్రీ రెండేళ్ల కోసారి మాఘశుద్ద పౌర్ణమికి రెండు రోజుల ముం దు జరిగే గిరిజన జాతర శ్రీ మేడారం సమ్మక్క - సారల మ్మ జాతర. వరంగల్‌ జిల్లాలోని గిరిజన ప్రాతాల్లో జరిగే ఈ జాతరలో సమ్మక్క - సారమ్మలు కాకతీయ రాజులకు కప్పం కట్టనందుకు జరిగిన పోరాటంలో అసువులు బాసా రని, అందుకే అక్కడ సమ్మక్క - సారలమ్మ జాతరను జరు పుకుంటారని ప్రతీతి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజ న జాతరగా మేడారం పేరుగాంచింది. మేడారం గ్రామంలో కాకతీయుల కాలంలో 700 ఏళ్ల కిత్రం జరిగిన పోరాటా లకు స్మారకార్థంగా గిరిజన వనదేవతలైన సమ్మక్క - సార లమ్మ ు స్మరించుకుంటూ ఈ జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కోరిన కోర్కెలు తీర్చే తల్పులుగా ఈ అమ్మవార్లకు పేరుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tourism in russia
Seychelles tourism and informatin  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles