Hanging gardens of babylon

Hanging Gardens of Babylon one of the ancient Seven Wonders of the World. Cleveleys, Fleetwood, Blackpool, Babylon, Pyramids, Temple, Zeus, seven wonders, Mythology, Mysteries, Greek, collossus of Rhodes, Artemis, Pharos Lighthouse

Hanging Gardens of Babylon one of the ancient Seven Wonders of the World. Cleveleys, Fleetwood, Blackpool, Babylon, Pyramids, Temple, Zeus, seven wonders, Mythology, Mysteries, Greek, collossus of Rhodes, Artemis, Pharos Lighthouse

Hanging Gardens of Babylon.GIF

Posted: 02/17/2012 01:25 PM IST
Hanging gardens of babylon

Hanging_Gardens_of_Babylon

Hanging-Gardens-of-Babylonహ్యాగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్... ప్రాచీనమైన ప్రపంచ అద్భుతాల్లో ఒకటి. ప్రాచీనంగా ప్రపంచంలోని ఏడు అద్బుతాల్లో ఒకటిగా చెప్పుకున్న వేళ్ళాడే తోటలు అద్బుతం మాత్రమే కాదు ఆశ్చర్యం.... అసలు అలాంటివి ఉండేవా అనే సందేహం కూడా. అది నిజంగా ఎవరైనా నాటిన తోటనా లేక కవుల కల్పనా అన్న మీమాంసకు దారి తీసిన అద్భుతం ఇదొక్కంటంటే అతిశయోక్తి కాదు. బాబిలోనియాలో ఉండేవి అన్న ఈ తోటల గురించి స్పష్టమైన చారిత్రక ఆధారాలు సరిగ్గా దొరకకపోవడం కూడా ఈ సందేహానికి ఒక కారణం.

వేలాడే తోటలకు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారం ఏంటంటే.... క్రీ..పూ. 600 సంవత్సరంలో అప్పటి బాబిలోనియా రాజు రెండవ నెబుచద్ నెజార్ ఈ ఉద్యానవన్నాన్ని నిర్మించాడు. తన భార్యకు పుట్టింటి మీద బెంగ వదిలించడానికి చేసిన ఏర్పాటు ఇది. ఆమె పర్షియాకు చెందిన యువతి. నెబుచద్ నెజార్ ను వివాహమాడి బాబిలోనియా వచ్చింది. కానీ పర్షియా మీద బెంగతో బాబిలోనియాలో సంతోషంగా ఉండలేక పోయింది. ఎడారి ప్రదేశంలో నివసించడానికి అయిష్టత వ్యక్తం చేయడంతో బాబిలోనియాలో పచ్చదనాన్ని అవతరింప చేసే ప్రయత్నం చేశాడు నెబుచద్ నెజార్. దాని ఫలితమే హ్యాగింగ్ గార్డెన్. దీని నిర్మాణం కంటే ముందు చాలా సమయం డిజైనింగ్ కే పట్టిందట. ఆస్థానంలో ని మేధావులు 75 అడుగుల ఎత్తున అంతస్తుల వారీగా మొక్కలను పెంచడానికి, వాటిని నీరు పట్టడానికి మెషనరీ వాటర్ లైన్ డిజైన్ చేశారు. సైనిక అధికార యంత్రాంగం అంతా సమిష్టిగా శ్రమించి ఈ అద్బుతాన్ని ఆవిష్కరింప చేశారు. తీగ జాతి మొక్కలను పై అంతస్తుల్లో నాటడంతో అవి కిందకు వేళ్లాడుతూ ఉండేవి. వాటి మొదలు ఎక్కడో కని పెట్టడం సాధ్యం కానంత నైపుణ్యంగా రూపొందించారు. ఈ గార్డెన్స్ రాణిని ఇంప్రెస్ చేశాయి. అయితే ఇప్పుడు ఆ తోటలు గానీ, వాటి ఆనవాళ్ళు కానీ ఎందుకు కనిపించడం లేదంటే... క్రీ.పూ. రెండవ శతాబ్దంలో ఈ ప్రదేశం అనేక సార్లు భూ కంపాల భారిన పడింది. ఈ భూ కంపాల్లో హ్యాగింగ్ గార్డెన్స్ ధ్వంసమయ్యాయి.

హ్యాగింగ్ గార్డెన్స్ గురించి ప్రస్థావన బెరోస్సస్ రచనల్లో కనిపిస్తుంది. ఇతడు క్రీ.పూ. నాలుగవ శతాబ్దానికి చెందిన మతాధిపతి. ఇతడిHanging-Gardens-of-Babylon1 రచనలు యథాతథంగా లభించలేదు. కానీ తర్వాత రచయితలు తమ రచనల్లో ఈ గార్డెన్స్ గురించి బెరోస్సన్ ప్రస్తావించన అంశాలను సంధర్భాను సారం ఉదహరిస్తూ వచ్చారు. క్రీ.పూ. 60-30 మధ్య కాలంలో  4వ శతాబ్దపు రచనల ఆధారంగా ఊహా చిత్రాలలు రూపొందాయి. కానీ ఈ రచనలు గార్డెన్ ఉన్న ప్రదేశాన్ని సూచించలేక పోయాయి. కొంత మంది ట్రైగ్రిస్ నదీ తీరాన ఉండేదని నమ్ముతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bhavani islandvijayawada
End of the world december21 2012  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles