Dirt and dust in rooms at PAC guest house raises questions ధుమ్ముధూళితో నిండిన గది.. ఇదేనా స్వచ్ఛా యూపీ యోగీ.?

Swachh bharat 8th anniversary dirt and dust in rooms at pac guest house

priyanaka cleans guest house, priyanka gandhi cleans detained room, priyanaka gandhi PAC guest house, priyanaka gandhi room cleaning video, priyanaka gandhi brooming video, viral video, priyanaka gandhi viral video, Lakhimpur kheri protest, Lakhimpur Kheri, Farmer Protest, farmer dead, Priyanka Gandhi, Congress, farmer protest updates, accident, farmer death, Ajay Mishras son, Uttar Pradesh, Crime

A video of Congress General Secretary Priyanka Gandhi Vadra sweeping a room with a broom has gone viral on social media. Which raised many questions on Yogi Adityanath sarkar's Swatchh Bharath mission, for which UP sarkar has allocated Rs 1400 crores.

ధుమ్ముధూళితో నిండిన గది.. ఇదేనా స్వచ్ఛా యూపీ యోగీ.?

Posted: 10/04/2021 09:03 PM IST
Swachh bharat 8th anniversary dirt and dust in rooms at pac guest house

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి దేశంలో నూతన అధ్యాయం లిఖించేందుకు శ్రీకారం చుట్టిన స్వచ్ఛా భారత్ మిషన్ ను సరిగ్గా అక్టోబర్ 2, జాతిపిత మహాత్మ గాందీ జయంతిని పురస్కరించుకుని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రాలు కూడా స్వచ్చా భారత్ అభియాన్ మిషన్ లో భాగంగా బడ్జెట్ లో నిధులను కేటాయిస్తూన్నాయి. రాష్ట్రాలతో పాటు రాష్ట్ర ప్రముఖులు కూడా ఈ మిషన్ లో భాగంగా గ్రామాలను దత్తత తీసుకుని వాటిలో పరిశుభ్రతతో పాటు అన్ని మౌలిక వసతుల కల్పన ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

కాగా, మోడీ సర్కార్ తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తర్ ప్రదేశ్ లోని ల‌ఖింపూర్ ఖేరీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కేంద్రమంత్రి అజయ్ మిశ్ర తనయుడు ఆశీష్ వాహనాన్ని ఘెరావ్ చేసిన రైతులు తమకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. దీంతో రైతులను నెట్టుకుంటూ కేంద్రమంత్రి తనయుడి వాహనంతో పాటు మూడు వాహనాలు వెళ్లాయి ఈ ఘటనల్లో నలుగురు రైతులు మరణించారు. దీని తరువాత జరిగిన అల్లర్లలో మరో ఐదుగురు మరణించారు. మరణించిన రైతులు కుటంబాలను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అమెను సీతాపూర్ లోని పిఏసీ గెస్ట్ హౌజ్ కు తరలించారు. అయితే అమె వెళ్లే సరికి ఆ గదిలో పూర్తిగా దుమ్ము, ధూలితో నిండి వుంది. ఎక్కడైనా కుర్చునేందుకు కూడా ఒక్క సోఫా కానీ, కుర్చీ కానీ లేదు. అయితే దీనిని పీఏసీ గెస్ట్ హౌజ్ గా పిలుస్తున్నారు అక్కడివారు. కానీ గెస్టులు ఇక్కడికి వచ్చి ఏక్కడ కూర్చుంటారన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. అమెను ఇక్కడకు తరలించాలని ముందుగానే పూనుకున్న అధికారులు గదిలోంచి ఫర్నీచర్ తొలగించారా.? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన అగ్రనేతలకు ఇచ్చే కనీస మర్యాద ఇదేనా.? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

హిందూ సంస్కృతి. సంప్రదాయం గురించి విరివిగా మాట్లాడి.. బీజేపి నేతలు అతిధి దేవో భవ అనే సూక్తి మర్చిపోయి.. ఒక అగ్రనేతపై ఇలా వ్యవహిరిస్తారా.? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇవాళ కాకపోతే రేపు వాళ్లు అధికారంలోకి వస్తే.. అప్పుడు వారు ఇలాగే వ్యవహరిస్తే.. మీరేం చేస్తారన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని పక్కడనెబడితే అక్టోబర్ రెండున నిర్వహించే స్వచ్ఛా భారత్ అభియాన్ లో భాగంగా శుభ్రంగా వుండాల్సిన రాష్ట్రంలోని అతిధి గృహాలే దుమ్ము, థూళితో నిండిపోవడంపై కూడా విమర్శలు వినబడుతున్నాయి. రాష్ట్రంలో ఏకంగా రూ.1400 కోట్ల రూపాయలను స్వచ్ఛా భారత్ కేటాయించినా.. గెస్ట్ హౌజ్ ల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందా.? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్వచ్ఛాభారత్ నిధులను వినియోగించి రాష్ట్రంలో పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ల వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles