చినబాబు ఎమ్మెల్సీగానే.. అందులో కూడా దమ్ములేదా? | Behind the scene Nara Lokesh MLC seat.

Nara lokesh to become mlc soon

Telugu Desam Party MLC, Nara Lokesh MLC, Nara Lokesh AP Cabinet, AP MLC Notification, MLC Nara Lokesh, Nara Lokesh Chandrababu Naidu, MLC Lokesh, East Godavari MLC Nara Lokesh, MLC Elections

Telugu Desam Party general secretary Nara Lokesh said he would not prefer getting into the cabinet through backdoor methods (by becoming an MLC) but through right royal method of by getting elected as an MLA. After Naidu announced that he would induct his son into the cabinet, he has to choose the MLC route.

నారా లోకేష్ ఆల్ మోస్ట్ ఎమ్మెల్సీ గానే...

Posted: 02/22/2017 09:41 AM IST
Nara lokesh to become mlc soon

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మరో నెల రోజుల్లోనే చట్టసభలో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాను ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే చట్ట సభలోకి(ఎమ్మెల్యేగా) అడుగుపెడతానని బ్యాక్ డోర్ లు తనకు ఇష్టం ఉండవని(ఎమ్మెల్సీగా) ఇది వరకే లోకేష్ బహిరంగంగా ప్రకటించాడు. అయినప్పటికీ జాప్యం చేయకుండా ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానం ద్వారానే తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక భర్తీకి ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేయడంతో అధిష్ఠానం ఆ దిశగా పావులు కదుపుతోంది.

లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబునాయుడు ఇప్పటికే నిర్ణయించారు. అయితే మంత్రి కావాలంటే రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలో ఏదో ఒక దానిలో సభ్యుడై ఉండాలి. ప్రస్తుతం శాసనసభలో ఖాళీ లేకపోవడంతో ఎమ్మెల్సీగా చేసి అటునుంచి మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే ఇందుకోసం తెలుగుదేశం అధినేత ఫ్రంట్ డోర్, బ్యాక్ డోర్... రెండు మార్గాలు ఉన్నాయి. ఫ్రంట్ డోర్ విషయానికొస్తే... లోకల్ బాడీల కోటా లేదా గ్రాడ్యుయేట్స్ కోటా ద్వారా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనటం. లోకేష్ కు చరిష్మా ఉందని ప్రజల్లోకి సంకేతాలు పంపేలా ఈ రాజమార్గం పనికొస్తుందని బాబు భావిస్తున్నాడు.

మరోకటి బ్యాక్ డోర్.. గవర్నర్ కోటాలో నామినేట్ చేయటం, లేదా ఎమ్మెల్యే కోటాలో ఎంపిక చేయటం. ఇది ఏ రిస్క్ లేని చాలా సులువైన పద్ధతి. దీనికే లోకేష్ మక్కువ చూపుతున్నప్పటికీ చంద్రబాబు మాత్రం ఓటింగ్ ఎన్నికలకే వెళ్లమని సూచించాడంట. స్థానిక సంస్థల మీద ఆధారపడటం అవమానంగా భావిస్తున్న చినబాబు ఎమ్మెల్యే కోటా ద్వారానే మండలిలో అడుగుపెట్టాలని భావిస్తున్నప్పటికీ తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ కోటాలో ప్రత్యక్ష ఎన్నికల బరిలో దింపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికైన ప్రతిభాభారతి, సి.రామచంద్రయ్య, చెంగల్రాయుడు, సుధాకర్‌బాబు, సతీశ్‌రెడ్డి, పీజే చంద్రశేఖర్, మహ్మద్ జానీలు వచ్చే నెలలో రిటైర్ కాబోతున్నారు. వారి స్థానాల్లో కొత్తగా ఏడుగురిని ఎన్నుకోవాల్సి ఉంది. మార్చి 20 నాటికి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తికావాల్సి ఉండడంతో నెల రోజుల్లోనే లోకేశ్ చట్టసభలో అడుగుపెట్టే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  Nara Lokesh  MLC Elections  

Other Articles