ఎన్టీఆర్ ప్రేరణతో కేసీఆర్ ఏం చేయబోతున్నాడంటే... KCR inspired it from NTR.

Kcr two years plan before elections

Telangana CM KCR, Prajala Vaddaku Palana Telangana, KCR Grama Sabhalu, KCR Master Plan, KCR Village Tour, KCR Telangana Tour, KCR Challenges, KCR NTR Inspiration, KCR 2019 Elections, KCR Road Shows

Telangana CM KCR Master Plan before General elections. Plan to Village Meetings Grama Sabhalu and Road Shows.

కేసీఆర్ ఈ రెండేళ్లు ఇక అదే పనా?

Posted: 02/18/2017 01:30 PM IST
Kcr two years plan before elections

అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా అరకోర సభలు మినహా తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రజలతో మమేకం అయిన దాఖలాలు పెద్దగా లేవు. ఉద్యమ సమయంలో ప్రజా క్షేత్రంలో యాక్టివ్ గా కనిపించిన ఆయన తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష , ప్రభుత్వ ఏర్పాటు కనీసం భారీ మీటింగ్ లతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం కూడా చేయలేదు. పథకాలు ప్రారంభించే సమయంలో చిన్న చిన్న సభలు జరిపినప్పటికీ అవి ప్రజా బలాన్ని నిరూపించే విధంగా లేవు. దీంతో ఇప్పటికే సగం పాలన ముగియటంతో ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టబోతున్నాడని సమాచారం.

ఇందుకోసం త్వరలో గ్రామ సభల పేరుతో ప్రజల వద్దకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని కొనసాగుతున్న పాలనతోపాటు, మంత్రులు తమ నియోజకవర్గాల్లో సరిగ్గా పని చేయటం లేదంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు భోగట్టా. గతంలో తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ప్రజల వద్దకు పాలన కార్యక్రమం లాంటిదే ఒక దానిని ఫ్లాన్ చేస్తున్నాడంట.

ఎన్టీఆర్ లాగే తాను ప్రజల మనిషినంటూ తెలియజేప్పే విధంగా రోడ్ షోలు ఫ్లాన్ చేస్తున్నాడు. అంతేకాదు ప్రజలకు అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారనే భరోసా కల్పించేందుకు కూడా ప్రయత్నాలు అల్రెడీ మొదలుపెట్టేశాడు కూడా. ఆధునిక వసతులతో కూడిన ఓ బస్సును అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇంత కాలం క్యాంప్ ఆఫీస్ కు పరిమితం కావటంతో ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత బాగానే పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో దానిని తగ్గించటంతోపాటు ప్రతిపక్షాలకు ఆస్కారం ఇవ్వకుండా ఈ రెండేళ్లు అదే పనిలో ఉండబోతున్నాడని తెలుస్తోంది.

మరోవైపు అదే సమయంలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయాలంటూ ఇప్పటికే కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేయటం ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది. ఇక నగర బాధ్యతలను, ఇక్కడ ిపాలనను తనయుడు కేటీఆర్, మిగతా మంత్రుల చేతిలో పెట్టబోతున్నాడని లీకులు అందుతున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  CM KCR  Prajala vaddaku Palana  

Other Articles