అమ్మ ప్లేస్ లో ఆమె నీడ? నటరాజన్ ఎవరు?... | Subramanian Swamy warns Sasikala will take over party reins.

Subramanian swamy alleges sasikala try to split aiadmk

Jayalalithaa's death, BJP MP Subramanian Swamy, Subramanian Swamy Sasikala, Jayalalithaa Aide Sasikala, Sasikala Aide, Sasikala Husband, Sasikala Husband Natarajan, Natarajan re entry, Natarajan AIADMK, Natarajan Jayalalithaa

After Jayalalithaa's death BJP MP Subramanian Swamy alleges Sasikala try to split AIADMK.

శశికళ పావులు కదుపుతోందా?

Posted: 12/07/2016 09:07 AM IST
Subramanian swamy alleges sasikala try to split aiadmk

అమ్మ అంత్యక్రియలు పూర్తయి 24 గంటలు గడవక ముందే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. జయలలిత మృతి తర్వాత పార్టీ భవితవ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కామెంట్లు చేశాడు. పార్టీలో ఆధిపత్యపోరు మొదలయ్యే తరుణం ఎంతో దూరంలో లేదని పేర్కొన్నాడు. పార్టీ పగ్గాలను జయలలిత నెచ్చెలి శశికళ తీసుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని అన్నారు.

‘అమ్మ’కు ఎంతో ఆప్తుడైన పన్నీర్ సెల్వం ఎంతోకాలం ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం లేదని, ముఖ్యమంత్రి పదవిని శశికళ చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభమవుతాయన్నారు. పార్టీలో విభేదాలు రచ్చకెక్కే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మరోవైపు అన్నాడీఎంకే నూతన అధ్యక్షురాలిగా ఆమె ఎన్నికకాబోతుందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. 

ఇక అన్నాడీఎంకేకు చాలా ఏళ్లుగా దూరంగా ఉన్న జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళ భర్త నటరాజన్ మళ్లీ పార్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చే సంకేతాలతో ఆమె డామినేషన్ మొదలు కాబోతుందని అర్థమౌతోంది. సోమవారం జయలలిత పార్థివదేహం ఉంచిన రాజాజీ హాల్‌కు చేరుకుని అంజలి ఘటించడం ఇందుకు బలం చేకూరుస్తోందని చెబుతున్నారు.

నటరాజన్ వర్సెస్ జయ...

జయలలితకు శశికళ ఆప్తురాలిగా మారక ఐఆర్ఎస్ అధికారి అయిన ఆమె భర్త నటరాజన్ ప్రభుత్వంలో, పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకునేవారు. అయితే ఆయన వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న జయ అతడిని దూరంగా పెట్టారు. ఒకానొక సమయంలో శశికళను కూడా ఇంటి నుంచి పంపించి వేశారు.

అయితే కుటుంబ సభ్యులతో ఆమె సంబంధాలు వదులుకున్నాక తిరిగి శశికళను ఇంట్లోకి రానిచ్చారు. ఇన్నాళ్లూ జయకు దూరంగా ఉన్న నటరాజన్ సోమవారం పోయెస్ గార్డెన్‌కు వచ్చారు. మంగళవారం రాజాజీహాల్‌కు వచ్చి జయకు నివాళి అర్పించారు. అంత్యక్రియలకూ హాజరయ్యారు. దీంతో పార్టీలోకి ఆయన పున:ప్రవేశం జరిగినట్టేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జయ మృతి తర్వాత ముఖ్యమంత్రి ఎంపికలో కీలకంగా వ్యవహరించిన శశికళ.. ఇప్పుడు భర్తతో కలిసి చక్రం తిప్పే అవకాశాలు ఉన్నాయన్నది స్పష్టమౌతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Subramanian Swamy  Sasikala Natarajan  AIADMK split  

Other Articles