నియంత్రణ రేఖ వెంబడి మొహరించి ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సునిశిత దాడులకు పాల్పడిన నేపథ్యంలో అందుకు అనుమతి మంజూరు చేసిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీని నెట్ జనులు అకాశానికి ఎత్తుతున్నారు. కేవలం మన దేశం మాత్రమే కాకుండా యావత్ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆయనపై అభినందనలు వెల్లివిరుస్తున్నాయి. ఇది యావత్ భారతం అభినందించాల్సిన పరిణామమే. ప్రధాని నరేంద్రమోడీని కీర్తించడం, అభినందించడంలో ఎలాంటి తప్పులేదు.. పైగా అలా చేయని పక్షంలోనే భారతీయుడిగా ఎదో తప్పు చేసిన భావన ఉత్పన్నం కావాల్సిందే.
అయితే నెట్ జనులు కూడా సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. దేశంలోని ప్రతీ ఒక్క రాజకీయ నేత తమ మధ్య విమర్శలను, విభేధాలను పక్కనబెట్టి మరీ భారత ఆర్మీ చేసిన సాహసాన్ని శ్లాఘిస్తున్నారు. అందుకు అనుమతించిన ప్రధానిని కూడా అభినందిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపి పార్టీకి మూలవిరాటుగా వున్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ తో పోల్చుతూ చర్యలు తీసుకోవడంలోనే పలువురు పార్టీ నేతలు విభేదిస్తున్నారు.
2001లో పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో అప్పటి ప్రధాని వాజ్ పాయ్ ఇలాంటి చర్యలను తీసుకోలేదని, దూకుడుగా వ్యవహరించలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. ప్రసత్త ప్రధాని నరేంద్రమోడీ దూకుడుగా వ్యవహరించారని ఉడీ ఉగ్రదాడికి మోదీ పాకిస్థాన్కు తగిన గుణపాఠం చెప్పారు. దేశ సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయడానికి సైన్యానికి అనుమతిచ్చారు. భారత సైన్యం 40 మంది ఉగ్రవాదులను హతమార్చి, మరికొందరిని బందీలుగా పట్టుకుంది. తద్వారా ఉగ్రవాదాన్ని ఇక ఏమాత్రం ఉపేక్షించబోమని, దీటైన సమాధానం చెబుతామంటూ మోదీ ప్రభుత్వం పాక్కు వార్నింగ్ ఇచ్చిందని శ్లాఘించారు.
ఉడీ ఉగ్రదాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టి పాకిస్థాన్ను ఏకాకిని చేయడంలో సఫలమయ్యారు. ఇక దక్షిణాసియా దేశాలు భారత్కు అండగా నిలిచి.. పాక్లో జరగాల్సిన సార్క్ సదస్సును బహిష్కరించాయి. ప్రపంచ దేశాల నుంచి పాక్కు ఆర్థికంగా, సైనికపరంగా సాయం అందకుండా చేసి, బలహీనపరచడానికి మోదీ ప్రభుత్వం వ్యూహరచన చేసింది. ఇక అదే సమయంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో గాక పేదరికాన్ని నిర్మూలించడంలో, అభివృద్ధి సాధించడంలో పోటీ పడాల్సిందిగా పాక్కు మోడీ సూచించడాన్ని కూడా నెట్ జనులు అభినందించారు.
దశాబ్దమున్నర కాలం క్రితం 2001లో పార్లమెంటుపై దాడి. భారత విమానాన్ని హైజాక్ చేసిన అనంతరం తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్న అప్పటి భారత ప్రభుత్వం అత్యంత సమన్వయంతో వ్యవహరించి సమస్యలను పరిష్కరించారు. అయితే దూకుడుగా వ్యవహరించే అవకాశం మాత్రం అప్పటి ఏబీ వాజ్ ఫాయ్ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే అప్పుడు కేంద్రంలో వున్న సంకీర్ణ ప్రభుత్వం. 182 పార్లమెంటు స్థానాలు మాత్రమే వున్న బీజేపి తన మిత్ర పక్షాలతో కలసి ఎన్డీయే అధర్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా పూర్తిగా 270 మంది ఎంపీల అత్తెసరు బలం మాత్రమే వుండుది.
ఒక వైపు తాము ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని భాగస్వామ్య పార్టీలు కూడా హెచ్చరికలు చేస్తున్న క్రమంలో అయన ప్రభుత్వాన్ని ఐదేళ్ల పాటు నడిపారు. అంతకుముందు ఒక్క ఓటుతో పడిపోయిన అనుభవం మదిలో మెదలుతుండగా, సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపటం ఎంత కష్టమో వాజ్ పాయ్ సహా సంకీర్ణ ప్రభుత్వాలను నడిపిన వారికే అవగతం అవుతుంది. అయినా పాకిస్థాన్ పై కార్గిల్ యుద్దానికి వెళ్లింది కూడా వాజ్ పాయ్ ప్రధానిగా వున్న హాయంలోనేనని తెలిసిందే.
పాకిస్తాన్ పై కార్గిల్ పోరుకు వెళ్లినా ఆయన ఎన్నడూ భారత ఆర్మీ చాతి గురించి చెప్పలేదు. అది 56 కాదని ఇప్పుడు 100కు పెరిగిందని చెప్పనేలేదు. కానీ ఇప్పుడు భారత అర్మీ చాతి గురించి చర్చ జరగడం అవసరమా..? అలా అని ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న చర్యలను తప్పుబట్టడం లేదు.. కానీ ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా సాగిస్తున్న ప్రచారాన్ని కూడా తప్పుబట్టడం లేదు. అయితే మోదాతో అప్పటి ప్రధాని అటల్ జీని పోల్చడం.. అందునా అయన చేయలేని పని ఈయన చేశారని చెప్పడం కించపర్చినట్టే కదా..? ఆయన హయాంలో ఏం చేయగలరో అంతకన్నా అధికంగానే ఆయన చెశారు. ఇక మోడీ అభిమానులకు మరో మాట.. స్వయంగా మోడీయే తనకు వాజ్ పాయ్ గురువర్యులని చెబుతుండగా, అభిమానులు అతిగా స్పందించడం మంచిది కాదనే మా భావన.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more