గద్వాల జిల్లా కోసం ఎమ్మెల్యేగిరికి రాజీనామా..? dk-aruna to resign as mla demanding gadwal district

Dk aruna to resign as mla demanding gadwal district

congress, mahaboobnagar, gadwal, CM KCR, DK Aruna, Resignation, TRS, political benifit, political differences, dk aruna to resign as mla, dk aruna to quit as mla, mahaboobnagar news

Former minister and Congress party senior MLA DK Aruna may resign for her assembly seat demanding to make Gadwal as a district.

గద్వాల జిల్లా కోసం ఎమ్మెల్యేగిరికి రాజీనామా..?

Posted: 10/01/2016 11:19 AM IST
Dk aruna to resign as mla demanding gadwal district

రాజకీయ లబ్దికి ఏమాత్రం అస్కారం లేకుండా ప్రజాహితంగా చేయాల్సిన పనులు కూడా తమ స్వప్రయోజనాలు, రాజకీయ దుర్భేథ్యంతో సాగిస్తున్న క్రమంలో రాజకీయ నేతలు తమ పదపులను కూడా పణంగా పెట్టి మరీ ప్రభుత్వాలకు ఎదురు తిరిగేందుకు సిద్దమవుతున్నారు. మరికోందరు తమ పదవులను త్యాజించి మరీ తమ నియోజకవర్గ ప్రజల అభిమతం, అభిలాషలను నేరవేర్చేందుకు కూడా సిద్దపడుతున్నారు. ఏకబిగిన కురిసిన వర్షాల కారణంగా చల్లారిందని భావించిన జిల్లాల పునర్ వ్యవస్థీకరణ, నూతన జిల్లాలు, మండలాల ఏర్పాటు కాస్తా మళ్లీ రాజుకుంటుంది.

దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడంతో అనేక ప్రాంతాల నుంచి జిల్లాల ఏర్పాటు విషయంలో అందోళనలు వెల్లివిరిసాయి. అయితే అందోళనలను లైట్ గా తీసుకున్న సర్కార్.. వాటిని పెడచెవిన పెడుతూనే జిల్లాల ఏర్పాటుకు కసరత్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలో పలు చోట్ల ప్రజల విజ్ఞప్తులను పరిశీలించిన సర్కార్ వాటిని పరిష్కరించే దిశగా కూడా సమాలోచనలు జరిపింది, అయితే పలు చోట్ల మాత్రం కేవలం రాజకీయ లబ్ది కోసమే వినతులు వెల్లువెతుత్తుతున్న పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినబడతున్నాయి.

ఈ క్రమంలో మహబూబ్ నగర్ జిల్లాలో తమ ప్రాంతం పేరున జిల్లాను ఏర్పాటు చేయాల్సిందిగా అత్యంత అధికంగా ప్రజాగ్రహం పెల్లుబిక్కుతున్న ప్రాంతం గద్వాల.. గద్వాల జిల్లాను ఏర్పాటు చేయకపోవడానికి కారణం అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే డీకే అరుణ కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీకే అరుణ తన శాసనసభ్యత్వానికి రాజీనామ చేయడానికి సిద్దపడుతున్నట్లు సమాచారం. గద్వాల జిల్లాకు తన పదవే అడ్డుగా ప్రభుత్వం భావిస్తే.. దాని వదులుకునేందుకు కూడా తాను సిద్దమన్న సంకేతాలను ఇప్పటికే ఆక్కడి ప్రజలకు ఇచ్చింది.

ఈ క్రమంలో అరుణ.. గద్వాల జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాయనున్నారని సమాచారం. ఇందులో తన పదవిని కూడా తాను వదులుకోవడానికి సిద్దమన్న విషయాన్ని కూడా పేర్కోంటారని తెలుస్తుంది. సీఎం కేసీఆర్ తో పాటు స్పీకర్ ఎస్.మధుసూదనాచారిని కూడా కలసి రాజీనామా లేఖ సమర్పించాలని ఆమె యోచిస్తున్నట్టు తెలిసింది. గద్వాల జిల్లా ఏర్పాటుకు తన పదవే అడ్డని టీఆర్‌ఎస్ భావిస్తున్నందుకు రాజీ నామాకు అరుణ సిద్ధపడుతున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. గద్వాల జిల్లా కోసం ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసేందుకు సిద్ధమని ఆమె ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress  mahaboobnagar  gadwal  CM KCR  DK Aruna  Resignation  TRS  

Other Articles