మేకపాటి అసంతృప్తి పీక్స్ లో.... | Mekapati not happy with Jagan, may quit YSRCP.

Mekapati may quit ysrcp and join bjp

Nellore MP Mekapati quit YSRCP, Nellore MP Mekapati Join BJP, YSRCP Senior Leader Quits Party, YSRCP Senior Leader to BJP, YSRCP to Saffron, Mekapati likely to join BJP, YSRCP senior to BJP, Mekapati rumour, Mekapati thrashes BJP join rumour

Nellore MP Mekapati Rajamohan Reddy not happy with YSRCP may quit and likely to join in BJP.

వైసీపీ నుంచి కీ వికెట్ డౌన్?

Posted: 10/03/2016 05:57 PM IST
Mekapati may quit ysrcp and join bjp

పార్టీలో వలసలు ఆగాయని సంతృప్తి చెందుతున్న అధినేత జగన్ కి మళ్లీ గట్టి ఝలకే తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. వైకాపా సీనియర్ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ త్వరలో పార్టీని వీడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందుకు జగన్ వైఖరేనని ఆయన సహచరుల దగ్గర ప్రస్తావించినట్లు సమాచారం.

నిజానికి 2014 ఎన్నికల సమయంలోనే ఆయన పార్టీ మారతారన్న వార్తలు వచ్చాయి. ఆ సమయంలో వాటిని స్వయంగా మేకపాటే స్వయంగా ఖండించాడు. కానీ, వైకాపాలో ఆయన అసంతృప్తి లెవల్ ఇప్పుడు తారాస్థాయికి చేరటంతో ఖచ్చితంగా ఈసారి మార్పు ఉంటుందనే చెప్పుకుంటున్నారు. ఈ దశలో బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో మేకపాటి సంప్రదింపులు చేసినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.

70 పదుల వయసులో ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి లాంటి సీనియర్ నేతను నిర్లక్ష్యం చేయటమేకాదు, పార్టీ పనులను మరీ స్థానిక నేతలకు అందజేస్తున్నారన్న టాక్ ఒకటి ఉంది. అంతేకాదు  జగన్ అండ్ కో నుంచి సరైన గౌరవం లభించడం లేదని ఆయన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. సుదీర్ఘరాజకీయ ప్రస్థానం ఉన్న మేకపాటి ఒకసారి ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ఎంపీగా గెలిచాడు. రాజశేఖర్ రెడ్డితో మంచి సంబంధాలు ఉండటం మూలంగానే మరణానంతరం జగన్ కి మద్ధతు ఇస్తూ వైకాపాలో చేరిపోయాడు. అయితే మేకపాటి కాషాయం తీర్థం పుచ్చుకుంటారన్న వార్తలను వైకాపాకు చెందిన ఓ ముఖ్యనేత ఖండిస్తున్నాడు.

ఆయనకు వయసు పైబడింది. అందుకే స్థానిక పనులను చూసుకోవాల్సిందిగా యువనేతలకు సూచిస్తున్నాం. అంతేగానీ ఆయన్ని నిర్లక్ష్యం చేయటం లేదు. ఇక అధినేత జగన్ ఆయన్ని పట్టించుకోవటం లేదన్న దాంట్లో వాస్తవం అస్సలు లేదు అని సదరు నేత తెలిపాడు. ఇక పార్టీ మార్పుపై స్వయంగా మేకపాటి స్పందిస్తూ పార్టీలో కలకలం రేపేందుకే బీజేపీ నేతలు ఇలాంటి యత్నాలు చేస్తున్నారంటూ కొట్టిపడేశాడు. అయితే ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నందునా ఈ అంశాన్ని అంత తేలిగ్గా కొట్టిపారేయలేమంటున్నారు విశ్లేషకులు. ఈ విషయంలో బీజేపీ కూడా వ్యూహాత్మక మౌనాన్ని ప్రదర్శించడమే దీనికి నిదర్శనమని వారంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nellore  MP Mekapati  YSRCP  BJP  

Other Articles