మంత్రుల పనితీరుపై కేసీఆర్ డేగ కన్ను | kcr seeks intelligence report on minister's performance

Kcr seeks intelligence report on minister s performance

KCR seeks intelligence report, Telangana CM KCR on minister's performance, KCR special care on minister's performance, Telangana CM KCR Secretariat, Telangana Secretariat Staff corruption, KCR warning ministers

Telangana CM KCR seeks intelligence report on minister's performance.

కేసీఆర్ సీక్రెట్ ఆపరేషన్ నిజమేనా?

Posted: 07/18/2016 03:24 PM IST
Kcr seeks intelligence report on minister s performance

భోళా శంకరుడిలా వరాలు ఇవ్వటమే కాదు, పాలనాపరంగా విమర్శలు వస్తే శివతాండవం కూడా చేస్తాడు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు. వేదికపై ఉండగానే అధికారులకు, నేతలకు వార్నింగ్ లు ఇచ్చిన ఉదంతాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అందుకే మంత్రులు సైతం ఏం మాట్లాడాలన్న, నిర్ణయాలు తీసుకోవాలన్నా ముందు వెనకా చాలానే ఆలోచిస్తుంటారు. ప్రస్తుతం నీతిమంతుల పాలన సజావుగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో వారి పనితీరుపై డేగ కన్ను వేశారన్న వందంతులపై తీవ్ర చర్చ జరుగుతోంది.

కొద్దిరోజులుగా తన మంత్రి వర్గంపై ఆయన కన్నేశారని, ఇంటలిజెన్స్ నిఘా కూడా పెట్టారన్న వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ మధ్య సచివాలయం వైపు అస్సలు వెళ్లటం లేదు. తన క్యాంపు కార్యాలయంలోనే ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో అమాత్యులందరూ నేరుగా క్యాంపు కార్యాలయం దగ్గరికే వెళ్లి ఆయన్ను కలుసుకుంటున్నారంట. మంత్రులు రాకపోవటం మహద్భాగ్యంగా భావించి కొందరు సెక్రటేరియట్ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అదే సమయంలో వారిని నిలువరించుకుండా మంత్రులు కూడా వెనకాల నుంచి ప్రొత్సహిస్తున్నారనే టాక్ ఉంది. ఈ నేఫథ్యంలో వారి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేసీఆర్ సూపర్ స్కెచ్‌ వేశారు. మంత్రులు సచివాలయంలో లేనప్పుడు అక్కడ ఏం జరుగుతోంది, వారి చాంబర్ ల వ్యవహారాలను ఎవరెవరు చూసుకుంటున్నారు. తదితర వివరాలకు సంబంధించి ఇంటిలిజెన్స్‌ నివేదికను తెప్పించుకున్నారంట. ఇందుకోసం కొందరు ఇంటెలిజెన్స్ అధికారులను అక్కడికి పంపించడం, ఆపై వారంతా పని చేయాలంటూ అధికారులను కోరటం, వారు ఆమ్యామ్యా అడగటం... సినిమా స్టైల్లో జరిగిన ఈ తతంగాన్ని ఆయన పూర్తి నివేదికతో కేసీఆర్ కు అందజేయటం జరిగిపోయిందనే తెలుస్తోంది.

ఇలా ఒక్క శాఖలోనే కాదు దాదాపు అన్ని విభాగాల్లోనూ జరిగిందట. ఈ పరిణామాలతో ఒకింత ఆశ్చర్యానికి లోనై కేసీఆర్ త్వరలో మంత్రులందరినీ పిలిచి వారి వారి చాంబర్లో జరిగే వ్యవహారాలపై నివేదికలను ఇచ్చి మరీ క్లాస్ తీసుకుంటాడనే అంటున్నారు. మరి అదే సమయంలో ఆరోపణలు వస్తున్న అధికారులపై తీవ్రస్థాయి చర్యలు ఉండబోవనే సమాచారం.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana CM  KCR  Secretariat  corruption  intelligence report  

Other Articles