Navjot Singh Sidhu resigns from Rajya Sabha amid AAP buzz

Navjot singh sidhu likely to be aap s cm face in punjab

navjot sidhu, bjp mp navjot sidhu, sidhu resigns, sidhu joins aap, monsoon session, rajya sabha, parliament, punjab assembly elections, punjab elections, navjot sidhu joins aap, sidhu leaves bjp, navjot singh sidhu, rajya sabha, bharatiya janata party, aam aadmiparty, aravind kejriwal, aap punjab cm candidate, india news

Senior Bhartiya Janta Party (BJP) leader and nominated Rajya Sabha MP Navjot Singh Sidhu resigned from the Upper House on Monday, likely to be AAP's CM face in Punjab

ఆయనే అప్ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి..

Posted: 07/18/2016 04:10 PM IST
Navjot singh sidhu likely to be aap s cm face in punjab

రెండేళ్ల క్రితం దేశవ్యాప్తంగా వినిపించిన నరేంద్ర మోడీ మానియా, నమో మంత్రానికి అరు మాసాల్లోనే షాక్ ఇచ్చిన అమ్ అద్మీ పార్టీ.. మళ్లీ బీజేపి అధిష్టానానికి దిమ్మతిరిగే విధంగా మైండ్ బ్లాక్ చేసింది. వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ ఎన్నికలలో తాము గెలుస్తామని పూర్తిగా విశ్వాసం వ్యక్తం చేసిన బీజేపికి అప్ కళ్లెం వేసింది. గత అనుభావలను దృష్టిలో పెట్టుకుని.. సరిగ్గా సమయం చూసుకుని సీనియర్ నేతను బీజేపికి దూరం చేసింది అప్. ఇక ఇప్పుడు అయనే తమ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ కూడా ప్రచారానికి తెరతీయనుంది. అయన మరోవరో కాదు బిజెపి సీనియర్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ.

ఇవాళ ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి గుడ్‌బై చెప్పడంతో ఈ వాదనలకు బలం కూడా చేకూరుతుంది. బిజెపిలో ఉన్నంత కాలం శిరోమణి అకాళీదళ్ నేతల నుంచి ఆయన ప్రతికూల వాతావరణాన్నే ఎదుర్కోన్నారు. బీజేపికి అది మిత్రపక్షం కావడంతో వారిపై విమర్శలు చేసే అవకాశం లేకుండా పోయింది. ఒకటి రెండు సందర్భాల్లో ఆయన అగ్రహాన్ని వెల్లగక్కినా.. అధిష్టానం నియంత్రించడంతో ఆయన మిన్నకుండిపోయారు. దీంతో అడుగడుగునా అడ్డుపడే వారి నుంచి దూరంగా జరగాలనుకున్న సిద్దూ.. ఏకంగా తన రాజీనామా అస్త్రాన్ని సంధించారు.

స్వయంగా సిఎం ప్రకాశ్ సింగ్ బాదల్ తనయుడు సిద్ధూను అడ్డుకున్నారన్న వార్తలు కూడా అప్పట్లో గుప్పుమన్నాయి. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగకుండా, ఇక పంజాబ్ లో బిజెపి ఎదగకుండా అకాళీదళ్ అడ్డుకున్నారని, కమలనాథులు శిరోమణి అకాళీదళ్ నేతలను ఏమీ అనలేకపోగా సిద్ధూనే మౌనంగా ఉండమని చెప్పడంతో నొచ్చుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 2017లో రానున్న పంజాబ్ అ    సెంబ్లీ ఎన్నికలలో బీజేపి ఒంటరిగా పోటీ చేయాలని సిద్దూ అధిష్టాననాన్ని డిమాండ్ చేస్తున్నాడు.

అయితే సర్వేలు, సోషల్ మీడియాపై అధికంగా అధారపడిన బీజేపి మాత్రం అందుకు ససేమిరా అన్నటుల్ సమాచారం. దీంతో బీజేపిలో ఎంతకాలం వున్నా ఎదగడం కష్టమని భావించిన సిద్దూ తన రాజ్యసభ సభ్యత్వానికి గుడ్ బై చెప్పారని సమాచారం. దీనికి తోడు గత ఎన్నికలలో ఆయన అమృత్ సర్ పార్లమెంటరీ స్థానంపై జరిగిన రగడ నేపథ్యంలో ఆయన బీజేపితో అంటిముట్టనట్లుగా వ్వవహరిస్తున్నారు. దీంతో ఆయనను దూరం చేసుకోవడం ఇష్టంలేని పార్టీ అధిష్టానం అయనకు రెండు మాసాల క్రితం రాజ్యసభకు పంపింది. అయితే ధీంతో కినుకు వహించిన సిద్దూ సంతృప్తి చెందినట్లు లేదు. అందుకే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్ల ప్రకటించారు.

నూతనంగా తమ రాష్ట్రంలోకి వచ్చిన అమ్ అద్మీ పార్టీకి అన్ని తానై వ్యవహరించేలా, పార్టీ అధికారంలోకి వస్తే పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా అయనేనంటూ అప్ వర్గాలు పేర్కోంటున్నాయి. ఈ మేరకు పార్టీ పురోగాభివృద్దితో పాటు రాష్ట్ర ప్రగతి కూడా కాంక్షిస్తున్న సిద్దూనే అవే భావజాలంతో ముందుకు వెళ్తున్న అప్ నేతలు కలవడంతో ఇందుకు అంగీకారం కుదిరిందని సమాచారం. అప్ నేతలు అశించినట్లు పంజాబ్ లో ఆ పార్టీ అధికారంలోకి వస్తే.. ఇన్నాళ్లు క్రికెటర్ గా, కామెంటేటర్ గా క్రీడారంగంలో రాణించిన సిద్దూ.. ముఖ్యమంత్రిగా రాజకీయ రంగంలో ఎలా రాణిస్తాడన్నది వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles