టీ పీసీసీ రేసులో విజయశాంతి, అజారుద్దీన్ | vijayashanti and Azharuddin names in telangana PCC race

Vijayashanti and azharuddin names in telangana pcc race

vijayashanti and Azharuddin, telangana PCC chief race, Vijaya shanthi T PCC chief, Azharuddin T PCC chief

Vijayashanti and Azharuddin names in telangana PCC chief race.

టీ పీసీసీ చీఫ్ రేసులో...

Posted: 07/15/2016 11:42 AM IST
Vijayashanti and azharuddin names in telangana pcc race

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి జవసత్వాలను అందించేందుకు పార్టీ హైకమాండ్ కొత్త ప్యూహాన్ని రచించబోతుందా? కొత్త వారికే పార్టీ పగ్గాలు అప్పజెప్పబోతున్నారా?  ఇందుకోసం యూపీ తరహాలో గ్లామర్ ఉన్న వారినే వాడుకోబోతుందా? తాజాగా అందుతున్న సంకేతాలు అవుననే అంటున్నాయి.

ప్రస్తుతమున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ పై పలువురు ఇప్పటికే విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వైఖరిని ప్రశ్నిస్తూ, పాల్వాయి గోవర్థన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి నేతలు, ఆరోపణలు చేసి, ఆపై పార్టీ ఫిరాయించారు.దీంతో చీఫ్ పదవి నుంచి ఆయన ఉద్వాసన ఖాయంగా కనిపిస్తోంది.

ఈ విషయంలో పార్టీ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహా మేరకు రాహుల్ గాంధీ ఈ విషయంలో ఓ కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మాజీ క్రికెటర్, ఎంపీ అజారుద్దీన్, గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ లో చేరిన సినీనటి విజయశాంతి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో అందరికీ ఆమోదయోగ్యమైన పేరును త్వరలో ప్రకటించబోతున్నారంట. ప్రజల్లో పేరుతోపాటు, కాస్త రాజకీయ అనుభవం ఉన్న వీరిద్దరిలో ఒకరైతే బాగుంటుందని రాహుల్ అధిష్ఠానంకి సూచించినట్లు సమాచారం.

విజయశాంతి గ్లామర్, ఉద్యమ నేతగా ఆమెకున్న చరిత్ర ప్రజల్లోకి చొచ్చుకువెళ్లి క్యాడర్ ను కాపాడుకునేందుకు ఉపకరిస్తుందని పలువురు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే హైకమాండ్ వద్ద వ్యాఖ్యానించినట్టు
తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో నిర్ణయాత్మక వర్గంగా ఉన్న ముస్లింల ఓట్లను గంపగుత్తగా పట్టాలంటే, ఓ ముస్లిం, అందునా క్రికెటర్ గా ప్రతి ఒక్కరి మనసుల్లో ఉన్న అజారుద్దీన్ అయితే బెస్టని మరికొందరు
నేతలు అభిప్రాయ పడుతున్నట్టు సమాచారం.

వీరిద్దరితోపాటు షబ్బీర్ అలీ, డీకే అరుణ, గీతారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క తదితరులు సైతం పోటీలో ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు కీలక నేతలు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana Congress  PCC chief  vijayashanti  Azharuddin  

Other Articles

Today on Telugu Wishesh