జగన్ మంగళగిరికి మారుతున్నాడు | Jagan all set to move Mangalagiri

Ys jagan all set to move mangalagiri

YS Jagan, YSRCP office in Mangalagiri, Jagan new home in Mangalagiri, Jagan in Capital, Jagan finally in Amaravathi

YS Jagan all set to move Mangalagiri. Residence and also established party office there.

బాబు వెంటపడుతున్నాడు

Posted: 07/16/2016 04:05 PM IST
Ys jagan all set to move mangalagiri

రాజకీయంగా కన్నా వ్యక్తిగత విమర్శలతోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై విరుచుకుపడుతూ ఆపై తానే చిక్కుల్లో పడుతున్నాడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి. అర్థం పర్థం లేని అరోపణలతోనే కాదు, చంద్రబాబు ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా వ్యతిరేకంగా మాట్లాడుతూ దిగజారిపోతున్నాడు.

రాజదాని భూసేకరణను వ్యతిరేకించడం దగ్గరి నుంచి కార్యాలయాల తరలింపుపై దాకా అన్నింటిపై గగ్గోలు పెట్టడం తెలిసిందే. అయితే కీలకమైన ప్రతిపక్షనేతగా ఉండి అమరావతి శంకుస్థాపనకు రాకపోవటంపై ఆయన వ్యవహారశైలిని రాజకీయ నిపుణులు తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. రాజధాని విషయంలో ఆయన అవలంభిస్తున్న తీరు ఇప్పటికీ బాగోలేదనే వాదన కూడా ఉంది. ఇలాంటి జగన్ తీసుకున్న ఓ నిర్ణయం ఆశ్చర్యం కలిగించక మానదు.

ఎట్టకేలకు రాజదానిలో అడుగుపెట్టాలని ఆయన నిర్ణయించుకున్నాడంట. త్వరలో ఆయన మంగళగిరికి మకాం మార్చబోతున్నాడని వైఎస్సార్పీపీ నేతలు ఉప్పందిస్తున్నారు. అధికార పక్షం మొత్తం రాజధాని ప్రాంతంలోనే సెటిల్ అయి పాలన కొనసాగిస్తుండటం, విమర్శించేందుకు వీలు లేకపోతుడటంతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చాడంట. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఇంటి వేట ప్రారంభమయ్యిందని వారంటున్నారు. ఇప్పటికిప్పుడు కొనటం కాకపోయినా కనీసం అద్దె ఇంట్లో అయినా దిగాలని, వీలైనంత త్వరలో అక్కడి నుంచి కార్యకలాపాలు కొనసాగించాలని జగన్ డిసైడ్ అయ్యాడంట.

అంతేకాదు మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయం కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటికిప్పుడు మంగళగిరిలోనే ఉన్నప్పటికీ, ఒకవేళ 2019 లో వైఎస్సార్పీ గనక అధికారంలోకి వస్తే మాత్రం అక్కడి నుంచి జెండా ఎత్తేసి ఓంగోలు నుంచిగానీ లేదా రాయలసీమలోని ఓదైనా ఒక ప్రాంతంలో కార్యాలయం నెలకొల్పుకుని అక్కడి నుంచి విధులు నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

-భాస్కర్
   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS jagan  YSRCP  Chandrababu  Mangalagiri  

Other Articles