ఎవరి గోతులు వాళ్లే... | clashes between T Congress leaders reached peak level

Clashes between t congress leaders reached peak level

T Congress leaders, T Congress clashes, janareddy, Palvai Govardhan Reddy, Palvai vs Jana, జానా వర్సెస్ పాల్వాయి. తెలంగాణ కాంగ్రెస్ కుమ్ములాట, కాంగ్రెస్ కుమ్ములాట, టీ కాంగ్ కుమ్ములాట, కాంగ్ సీనియర్ల కుమ్ములాట, తెలంగాణ కాంగ్రెస్, తాజా వార్తలు, తెలంగాణ వార్తలు, రాజకీయాలు, latest news, telangana news, telugu news

clashes between T Congress leaders reached peak level. party should be damaged with their attitude. targeted jana reddy and palvai Govardhan reddy.

ఎవరి గోతులు వాళ్లే...

Posted: 06/09/2016 05:22 PM IST
Clashes between t congress leaders reached peak level

తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలు హై లెవల్ కి చేరుకున్నాయి. గ్రేటర్ ఎన్నికలకు ముందు దానం లాంటి కీలకనేతను సైడ్ చేయటంపై గరం అయిన సీనియర్లు మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే జూనియర్ నేతలతో వారికి పొసగడం లేదన్న సంకేతాలను అధిష్ఠానం దృష్టికి చేరవేస్తున్నారు. పైగా వరుస ఓటములతో కోలుకోలేకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ వైఫల్యానికి కారణం మీరంటే మీరంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకొంటూ బజారుకెక్కుతున్నారు. ఈ అంతర్గత కుమ్ములాటలతో సొంత పార్టీనే తిట్టి పోస్తూ రచ్చ చేస్తున్నారు.

సర్వే సత్యనారాయణ నుంచి మొదలైన ఈ దూషణల పర్వం దామోదర రాజనర్సింహ, తాజాగా నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యల దాకా కొనసాగింది. దీంతో సీరియస్ అయిన అధిష్ఠానం క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. పార్టీ నాయకత్వం పేలవంగా ఉందని జానారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించడం ద్వారా తీవ్ర దుమారం రేపారు సర్వే సత్యనారాయణ. అయితే ఆపై అధిష్ఠానం వార్నింగ్ తో సైలెంట్ అయిపోయాడు. ఇక మరో నాయకుడు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఒక కార్యక్రమంలో  మీడియా ప్రతినిధులు, మీడియా యాజమాన్యాలను దుర్భాషలాడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మీడియా తమను పట్టించుకోవడం లేదని భావిస్తున్న కాంగ్రెస్ కి ఈ వ్యాఖ్యలు మీడియాను మరింత దూరం చేసిందని కాంగ్రెస్ భావించింది. ఇక మరో నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏకంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిన చాతకానివాడంటూ వ్యాఖ్యానించడంతో పార్టీ ఆయనకు షోకాజు నోటీసు జారీ చేసింది.

ఇక ఇవి చాలవన్నట్లు తాజాగా కాంగ్రెస్‌ ఓటమికి సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి లాంటి నేతలే కారణమని మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ ఆరోపించటంతో ఈ కుమ్ములాటకు మరింత ఊపు వచ్చింది. జానా రెడ్డిని పరుష పదజాలంతో పాల్వాయి తిట్టిపోయడంపై షబ్బీర్ కూడా కాస్త ఘాటుగానే కౌంటర్ వేశాడు. దీనిపై పాల్వాయి స్పందిస్తూ బచ్చాగాళ్లు తనను ఎమన్నా పట్టించుకోనంటూ తెల్చేశాడు. పార్టీలో ఉన్న పనికిమాలిన వాళ్లు, కోవర్టుల వల్లే ప్రతిష్ట అణగారిపోతుందంటూ మళ్లీ జానారెడ్డిని టార్గెట్ చేసే వ్యాఖ్యానించాడు. దీంతో ఇంతకాలం దాగున్న గ్రూప్ రాజకీయాలు ఈ వ్యాఖ్యలతో తారాస్థాయికి చేరేలా ఉన్నాయి. దీనికి తోడు సీనియర్లు ఎవరికి వారే కాబోయే ముఖ్యమంత్రుల మంటూ ప్రకటించుకుంటున్నారని కోమట్ రెడ్డి చెప్పటం ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తుంది. జంపింగ్ విషయం అటుంచితే అసహనంతో ఒకరినొకరు దూషించుకోవడమే ద్వారా వ్యక్తిగత ఇమేజ్ డామేజ్ అవ్వటంతోపాటు, పార్టీని నిండాముంచే పరిస్థితులు దాపురించాయి.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : T Congress leaders  T Congress clashes  janareddy  Palvai Govardhan Reddy  

Other Articles