బాబుగారు మరి దేనికి భయపడతాడో? | chandra babu should be fear for AP development

Chandra babu should be fear for ap development

chandra babu, babu fear for AP development, nava nirmana deeksha, maha sankalpa deeksha, తాజా వార్తలు, ఏపీ రాజకీయాలు, తెలుగు వార్తలు, చంద్రబాబు దీక్షలు, ఏపీ అభివృద్ధి, చంద్రబాబు భయం, ఏపీ వార్తలు, రాజకీయ గుసగుసలు, latest news, telugu news

chandra babu should be fear for AP development. wastage of money and time through deekshas.

బాబుగారు మరి దేనికి భయపడతాడో?

Posted: 06/09/2016 12:23 PM IST
Chandra babu should be fear for ap development

ఆంధ్ర ఆవిర్భావ దినాలను కాస్త రాష్ట్ర సంతాప దినాలుగా మార్చేసి నవ నిర్మాణ దీక్ష అంటూ కలరింగ్ ఇచ్చేశాడు ఏపీ చంద్రుడు. విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రజలతో ప్రమాణం చేయించి సగర్వంగా తలెత్తుకునే రోజు కోసం కృషి చేద్దామంటూ పిలుపునిచ్చాడు. కానీ, ఈ దీక్ష ద్వారా ఎవరికి, ఏం ఒరిగిందన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. అప్పులతో తరిమారని, కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చామని చెప్పుకొస్తున్న ఆయనకి కేంద్రాన్ని నిలదీసే దమ్ము ఏపాటి ఉందో ఈ వారం రోజులోనే అర్థం అయ్యింది. సూటిగా ప్రశ్నించకుండా నేరాన్ని యూపీఏపైకి నెట్టేసే ప్రయత్నం చేయడం అభినందనీయమే అయినప్పటికీ రాబోయే సవాళ్లను ఎదుర్కొవటం మాత్రం చాలా కష్టమే.  

ఇదిలా ఉండగానే కడపలో బుధవారం ఆయన నిర్వహించిన మహా సంకల్ప సభ ఎందుకో ఎవరికీ అంతుబట్టడం లేదు. పైగా చెప్పిందే చెప్పి పదే పదే విసిగించడం తప్ప ఆయన కొత్తగా చేస్తుందేంటో అర్థం కావటం లేదు. అదే అప్పులు, అదే కట్టుబట్టల ప్రకటనలతో నవనిర్మాణ దీక్ష సీడీని రీప్లే చేసినట్లు ఉంది. పైగా ఎక్కడికెళ్లినా ఈ హైదరాబాద్ డబ్బాను వదలరా బాబు... అంటూ సొంత నేతలే చాటుగా జోకులేస్తున్నారు. ఈ మహాసంకల్ప దీక్షను పరిశీలిస్తే గనుక అనంతపురంలో ప్రతిపక్ష నేత నిర్వహించిన రైతు భరోసా యాత్రకు పోటీగా చేసినట్లు ఉంది. జగన్ మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో భారీ బహిరంగ సభ పెట్టడం ద్వారా పంటికి పన్ను అన్న సిద్ధాంత బ్యాలెన్స్ చేసినట్లు ఫీలయిపోతున్నారేమో! కానీ, కావాల్సింది అది కాదు.

పైగా ఉద్వేగభరిత ప్రసంగంలో అదనంగా ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ లను చూసి తానెందుకు భయపడతానంటూ ఆయన ప్రజల్నే ఎదురు ప్రశ్నించారు. నిప్పులాంటి మనిషినని ప్రకటించేసుకున్న బాబు దేనికి భయపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు. కానీ, భయపడాలి... ప్రజలకు భయపడాలి.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేమోనని భయపడాలి. ఆ భయంతోనే నవ్యాంధ్రను దేశంలో నంబర్ వన్ గా చేయాలన్న కసితో పనిచేయాలి. ఎలాంటి సాయం అందించకుండా, సమీప భవిష్యత్తులో కూడా అందిస్తుందన్న నమ్మకంలేని తరుణంలో కేంద్రం దిమ్మ తిరిగేలా అభివృద్ధి చేసి చూపించాలి. అంతేగానీ దీక్షలు, ప్రతిజ్ణల ద్వారా కాలయాపన, అనవసరపు ఖర్చు తప్ప ప్రజల్లో గుప్పెడంతా గుండెల్లో మనోధైర్యం సగం చెంచా కూడా నిండదని గుర్తుంచుకోవాలి.   

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles