నమో మంత్రం ఇక చాలు | BJP should set a side Namo Mantra

Bjp should set a side namo mantra

UP elections rajnath singh, rajnath singh as UP CM, BJP no Namo mantra in UP elections, UP elections, Modi UP elections, యూపీ ఎన్నికల్లో రాజ్ నాథ్, యూపీ ఎన్నికలకు నమో మంత్రం అవసరం లేదు, తాజావార్తలు, యూపీ రాజకీయాలు, తెలుగు వార్తలు, దేశ రాజకీయాలు, latest news, telugu news, political gossips

BJP should set a side Namo Mantra. Rajnath singh may announced as CM candidate for UP elections.

మోదీ మంత్రం ఇక చాలు

Posted: 06/10/2016 12:59 PM IST
Bjp should set a side namo mantra

నమో నామస్మరణతో సార్వత్రిక ఎన్నికల దగ్గరి నుంచి బీజేపీ చేస్తున్న హడావుడి తెలిసిందే. పదేళ్ల యూపీఏ ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతకు గుజరాత్ అభివృద్ధి నమునాను చూపి ఓటు బ్యాంకును కొల్లగొట్టగలిగింది. కేంద్రంలోనే కాదు ఏళ్ల తరబడి కాంగ్రెస్ హస్తాల్లో ఉన్న రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కుంచుకోగలిగింది. అయితే వరుసగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ మోదీ మంత్రాన్నే పఠించింది. కానీ, ఈసారికి ఫలితాలు మాత్రం తేడా కొట్టాయి. దీనికి కారణం ఏంటని విశ్లేషిస్తే...

ఏదైనా కొంత కాలానికి పాత బడాల్సిందే. అలాగే మోదీ మంత్రం కూడా. అభివృద్ధి కోసం చూసే జనాలకు విదేశాల్లో ఉండే ప్రధాని వ్యవహారం అంతగా రుచించలేదు. పైగా ప్రధాని మనకు ఏం చేయట్లేదు అన్న భావనను  ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయా ప్రాంతీయ పార్టీలు సక్సెస్ అయ్యాయి. వెరసి అసెంబ్లీ ఫలితాల్లో ఘోరంగా చతికిలపడ్డాయి.  ఈ నేపథ్యంలో పార్టీ వ్యూహం మార్చాల్సిన అవసరం ఉందన్నది నిర్విర్వాదాంశం.

తాజాగా దేశ రాజకీయాలను శాసించే ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. దీంతో ఇప్పుడు బీజేపీ దృష్టి యూపీపైకి మళ్లింది. కుల రాజకీయాలు తీవ్రప్రభావం చూపే ఇక్కడ ముఖ్యమంత్రి ఎంపిక  ఆశామాషీ వ్యవహారం కాదు. పైగా అఖిలేష్ యాదవ్, మాయావతి లాంటి వాళ్లకున్న ప్రతిష్టను దెబ్బకొట్టడం చిన్న విషయం కాదు. కాంగ్రెస్ కూడా ఇక్కడ గట్టి అభ్యర్థినే నిలబెట్టాలని అనుకుంటోంది. అందుకే కళ్యాణ్ సింగ్, స్మృతీ ఇరానీ, వరుణ్ గాంధీ ఇలా పలువురి పేర్లను పార్టీ పరిశీలిస్తోంది. అయితే ఎన్ని పేర్లు వినిపిస్తున్నా చివరికి రాజ్ నాథ్ సింగ్ నే ఖాయం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. యూపీ సీఎంగా గతంలో ఆయనకు అనుభవం ఉండటం, పైగా వివాదాస్పద రహితుడిగా పేరు ఉండటంతో ఆయన్ను ఎంపిక చేయాలని పార్టీ భావిస్తోంది. ఇదే టైంలో బీజేపీ చేయాల్సిన మరో పని మోదీ పేరును వాడకపోవటం.

రాజ్ నాథ్ లాంటి సీనియర్ నేత బరిలో దిగుతున్న సమయంలో నమో మంత్రాన్ని వాడాల్సిన అవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. దీని వల్ల ప్రజల్లో కాస్త నెగటివ్ మార్కులు పడే అవకాశమే ఎక్కువగా ఉంటుందని వారంటున్నారు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి తనదైన శైలిలో చక్రం తిప్పిన రాజ్ నాథ్... ఏకంగా 11 స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టి వారి విజయానికి వ్యూహాలు పన్నారు. అలాంటి రాజకీయ అనుభవజ్నుడికి మోదీ క్రేజ్ ఏ మాత్రం మేలు చేయదని వారి వాదన. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్ పేరునే ప్రధాన ఆయుధంగా ఎన్నికల బరిలోకి దిగాలని కమలంకి వారు సూచిస్తున్నారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UP elections rajnath singh  rajnath singh as UP CM  BJP  

Other Articles