Mayawati is searching for Amit Shah's cook

Mayawati looking for upper caste man who cooked for amit shah

amit shah cook, amit shah dalit bhojan, amit shah dalit meal, PM modi varanasi, Uttar Pradesh, Amit Shah, Mayawati, Bahujan Samaj Party, BJP, Varanasi

BJP president Amit Shah's recent lunch with Dalits in Varanasi appears to have upset BSP supremo Mayawati no end.

బీజేపి నాటకాన్ని బయటపెట్టిన బీఎస్సీ మాయావతి..!

Posted: 06/03/2016 05:16 PM IST
Mayawati looking for upper caste man who cooked for amit shah

బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అత్యంత ఆర్భాటంగా తెరలేపిన ప్రచారం అప్పడే వివాదాస్పదం అయ్యింది. అసలు విషయం తెలియక అక్కున చేరిన దళితులు కాస్తా ఇప్పుడా పార్టీకీ దూరం అయ్యే అవకాశాలు వున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకీ వచ్చే ఏడాది రానున్న ఎన్నికల కోసం ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసీ పార్లమెంటు నియోజకవర్గం నుంచి చాప కింద నీరులా ప్రచారాన్ని ప్రారంభించి.. వెళ్తూ వెళ్తూ దళితుల ఇళ్లలో బోజనం చేసి దళితుల ఓట్లను కూడగట్టుకుందామనుకున్న అమిత్ సా అశలపై బీఏస్పీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి నీళ్లు చల్లింది.

అమిత్ షా దళితులతో కలిసి భోజనం చేసిన వ్యవహారంలో అసలు విషయాన్ని నిజం నిలకడగా తెలుస్తుందన్నట్లు అమె వెల్లడించి మరో మలుపు తిప్పారు. అమిత్ షా కోసం దళితుల ఇంట్లో ఏర్పాటు జరిగిన మాట వాస్తవమని చెప్పిన అమె,  అక్కడ వంట చేసిన మనిషి మాత్రం దళితుడు కాదని చెప్పారు. అమిత్ షా కోసం వంట చేసింది అగ్రకులస్తుడేనని, తద్వారా బీజేపీ తన దళిత వ్యతిరేకతను మరోసారి రుజువుచేసుకుందని అమె ఆరోపించారు. నిజాలు నిగ్గుతేల్చేందుకు సదరు వంటమనిషి కోసం గాలించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి పార్టీ శ్రేణులను ఆదేశించినట్లు తెలిసింది.

అయితే షాతోపాటు ఆ కార్యక్రమానికి 250 మంది బీజేపీ నేతలు తరలివచ్చారు. వారిలో 50 మంది మాత్రమే భోజనం చేశారని, ఎంపిక చేసిన ప్రదేశం.. వెనుకబడిన తరగతికి చెందిన బింద్ కులస్తుల ప్రాబల్యం ఉన్నదని, అలాంటప్పుడు దళితుల ఇళ్లలో భోజనం చేశామని ప్రచారం చేసుకోవడం ఏమేరకు సబబు? అని వారణాసి జోనల్ బీఎస్సీ నేత డాక్టర్ రామ్ కుమార్ కురేల్ విమర్శించారు. అతి త్వరలోనే వంటమనిషి జాడ తెలుస్తుందని, అప్పుడు అమిత్ షా ఆడిన నాటకం బయటపడుతుందని ఆయన అన్నారు.

ఇదిలా వుండగా ధళితుల ఇంట అమిత్ షా బోజనం చేయాడాన్ని కూడా రాజకీయం చేయడం అంత దుర్మార్గం ఏమీ లేదని బీజేపి నేతలు వాదిస్తున్నారు. అయితే దళితుల ఇంటి బోజనం చేశామని చెప్పుకుని ప్రచారం చేసుకోవడం బీజేపి నేతల దుర్మార్గమని, అంతకన్నా పెద్ద తప్పు ఏంటంటే ధళితుల ఇంట బోజనం మాట అటుంచింతే.. వంట చేసిన మనిషి మాత్రం అగ్రకుల వర్ణానికి చెందిన వ్యక్తన్న విషయాన్ని దాచి పెట్టి ప్రచారం చేయడం కన్న దుర్మార్గమేముంటుందని బీఎస్పీ నేతలు తిప్పికోడుతున్నారు. మరి బీఎస్పీ నేతలకు వంట మనిషి దోరికేనా అన్నది పెద్ద ప్రశ్నగానే మారింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  Amit Shah  Mayawati  Bahujan Samaj Party  BJP  Varanasi  

Other Articles