విజయసాయిరెడ్డి మాములోడు కాదు | reason behind vijayasai reddy wife filing RS nomination

Reason behind vijayasai reddy wife filing rs nomination

vijayasai reddy, YSRCP, Rajyasabha, sunandareddy nomination, తెలుగు వార్తలు, తాజా వార్తలు, విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ పోటీ, సునందారెడ్డి నామినేషన్, latest news, telugu news

విజయసాయిరెడ్డి మాములోడు కాదు | reason behind vijayasai reddy wife filing RS nomination

విజయసాయిరెడ్డి మాములోడు కాదు

Posted: 06/03/2016 11:39 AM IST
Reason behind vijayasai reddy wife filing rs nomination

నాలుగో అభ్యర్థి టెన్షన్ పెట్టి చివరకు  పోటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంది టీడీపీ. దీంతో ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి లైన్ క్లియర్ అయినట్లు అయ్యింది. ఆ పార్టీ తరపున ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి బరిలో దిగి నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు పోటీగా అభ్యర్థులు ఎవరూ లేకపోవటంతో ఆయన భార్య సునందారెడ్డి తో మరో నామినేషన్ వేయించారాయన. పోటీకి ఎవరూ రానీ తరుణంలో  పోటీ నుంచి విత్ డ్రా చేయించడం ద్వారా ఆమెను ఓ డమ్మీ అభ్యర్థిగానే నిలబెట్టి ఉంటారని అంతా అనుకున్నారు. కానీ, దాని వెనక ఓ చిదంబర రహాస్యం ఉందని ఇప్పుడు తెలుస్తోంది.  
          
విజయసాయిరెడ్డి మూడు సెట్ల నామినేషన్లు వేశాక ఆ వెనువెంటనే భార్యతో కూడా నామినేషన్ దాఖలు చేయించారు. ఆమెను వెంటపెట్టుకుని మరీ అసెంబ్లీకి వచ్చి తనకు పోటీగా నిలిపారు. మరో కోణంలో ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అక్రమాస్తుల ఆరోపణలపై  కేసులున్న సంగతి తెలిసిందే. ఈ కేసులన్నింటిలో విజయసాయిరెడ్డి రెండో నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతానికి బెయిల్ పై వీరంతా బయట ఉన్నారని అందరికీ తెలిసిందే. కాగా, ఆయా కేసులన్నీ ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి. వారిపై నమోదైన ఏ ఒక్క కేసులోనూ తుది తీర్పు వెలువడలేదు.

అంటే తుది తీర్పు వెలువడే దాకా విజయసాయి రెడ్డి నిందితుడిగానే ఉంటాడు తప్ప దోషి మాత్రం కాదు. ఒకవేళ నామినేషన్ పరిశీలన సమయంలో ఎన్నికల అధికారి ఏమైనా అభ్యంతరాలు చెప్పితే మొదటికే మోసం వచ్చే ప్రమాదముందని ఆయన గమనించారంట. అసలే తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయనకు ఈ కేసులు ఎక్కడ ఇబ్బందిపెడతాయోనన్న ఆలోచనతోనే భార్యతో డమ్మీ నామినేషన్ వేయించాడని తెలుస్తోంది. అంటే ఒకవేళ విజయసాయిరెడ్డిపై అభ్యంతరాలు వ్యక్తం అయితే ఆ స్థానంలో ఆయన భార్యను రాజ్యసభ బరిలో నిలపాలన్నది వైసీపీ వ్యూహం అన్నమాట. కానీ, సాయిరెడ్డి నామినేషన్ కు రిటర్నింగ్ అధికారి ఓకే చెప్పడం, నాలుగు సీట్లకు బరిలో నలుగురు మాత్రమే నిలిచిన నేపథ్యంలో సునందారెడ్డి చివరి నిమిషంలో తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. అది అసలు సంగతి.

బాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijayasai reddy  YSRCP  Rajyasabha  sunandareddy nomination  telugu news  

Other Articles