chandrababu gives priority to sound parties in rajya sabha

Tdp chief picks two big biz bosses sujana tg venkatesh for rs

tdp selects industrialists for rajyasabha, TDP, Rajya sabha, TG Venkatesh, sujana chouadry, maritius commercial bank, chandra babu, nara lokesh, industralists, intellectuals, rajyasabha nominations

Andhra pradesh chief minister and TDP supremo chandrababu naidiu gives priority to party industralists or rajya sabha nominations, Questions arise are industralists are only intellectuals.

రాజ్యసభ సీట్లను టీడీపీ అమ్ముకుందా..?

Posted: 06/03/2016 06:17 PM IST
Tdp chief picks two big biz bosses sujana tg venkatesh for rs

అవును మీరు చదివిన శీర్షక కరెక్టే. ఆంద్రుల అరాధ్యుడు, అన్నగారు స్వర్గీయ ఎన్టీరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సీట్లను అమ్ముకుందా.? ఈ ప్రశ్న ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ రాజకీయాలలో హట్ టాపిక్ గా మారింది. అయితే టీడీపీ తరుపున ఎన్నికైన రాజ్యసభ అభ్యర్థులను వారి ప్రోఫైల్ ను పరిశీలిస్తే మాత్రం ఎవరికైనా ఈ సందేహాం కలుగక మానదు. టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన వారిలో ఒకరు పారిశ్రామిక వేత్త టీజీ వెంకటేష్. చాలా కాలం తరువాత ఆయన సొంతగూటికి చేరుకున్నారు.

1999లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఐదేళ్ల తరువాత కనిపించలేదు. ఆ తరువాత మళ్లీ 2009లో కాంగ్రెస్ నుంచి టిక్కెట్ సాధించిన ఆయన మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో ఆయన మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత ఆయనను తొలిసారి రాష్ట్ర మంత్రిగా ప్రమోట్ చేసిన కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలోకి జంప్ అయ్యారు. కాగా రాష్ట్ర విభజన సమయంలో టీజీ వెంకటేష్ తనయుడు ఓ అడుగు ముందుకేసి తెలంగాణ ఉద్యమాని నిలిపివేస్తే తాను కేసీఆర్ కు  వందల కోట్ల రూపాయలను కూడా ఇస్తానని ప్రకటించాడు.

ఇదే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మంచి వ్యాపారవేత్త కావడంతో ఆయన నుంచి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లభ్ది పోందిన పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు రాజ్యసభ టిక్కెట్ ఇచ్చినట్లు అరోపణలు పెల్లుబిక్కాయి. పార్టీకి సంబంధించి అనేక మంది మేదావులు వున్నా.. వారందరినీ తోసిపుచ్చి కేవలం వ్యాపారవేత్తనే ఎందుకు రాజ్యసభకు పంపుతున్నారని బిసీ సంఘాలు నినదించాయి. ఇక ఇదే అంశం అటు కర్నూలు రాజకీయాలలోనూ విభేధాలకు కారణమవుతున్నాయి.

ఇప్పటికే టీడీపీ నేత తమ పార్టీ రాజ్యసభ్య సభ్యుడి ఎంపికకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహణకు నేతృత్వం వహించారు. పార్టీలు మారిన నేతలను ఎలా అందలం ఎక్కిస్తారని ప్రశ్నించారు. డబ్బులున్న నేతలను మాత్రమే టీడీపీ పట్టించుకుంటుందా..? మిగతా నేతలు వద్దా అని నిలదీశారు. చంద్రబాబు ప్రతిపక్షంలో వుండగా ఒకలా వ్యవహరించి.. అధికారంలోకి రాగానే మరోలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇదే పరిస్థితి టీడీపీ కొనసాగించిన పక్షంలో పార్టీ మనుగడ కష్టమవుతుందని హెచ్చరించారు.

ఇక మరో వాణిజ్యవేత్త సుజనా చౌదరికి కూడా మరలా రాజ్యసభ సభ్యత్వాన్ని అందించింది టీడీపీ. అయితే ఇప్పటికే పలు వివాదాలు చుట్టుముట్టిన ఈ నేతను మరలా ఎందుకు రాజ్యసభ్యకు ఎంపిక చేయాల్సి వచ్చిందో టీడీపీ అధినాయకత్వానికే తెలియాలి. అయితే ఇక్కడ టీడీపీకి ఒక కారణం కనిపించింది, ఇప్పటికే కేంద్రంలోని నరేంద్రమోడీ క్యాబినెట్ లో మంత్రిగా కోనసాగుతున్న సుజనా చౌదరిని ఎంపిక చేయడంతో అయన తన టర్మ్ పూర్తయ్యేవరకు మంత్రిగా కోనసాగే అవకాశం వుంది, సుజనాను కాకుండా మరో వ్యక్తిని రాజ్యసభకు పంపితే.. కేంద్రంలో టీడీపీ మంత్రుల సంఖ్య ఒక్కరికే తగ్గనుంది,

కాగా సుజనా చౌదరి విషయంలో వాణిజ్యవేత్త అన్న కారణం కన్నా అధికంగా మారిషస్ కమర్షియల్ బ్యాంకును నిట్టనిలువునా ముంచారన్న వార్తలు అధికంగా వివాదస్పదం అయ్యియి, అయన మారిషస్ బ్యాంకుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నా.. తన సంస్థ వంద కోట్ల మేర రుణాన్ని ఎగ్గోట్టిందన్నది వాస్తవమని అందులో భాగంగా ఆయన కోర్టు ఎదుట విచారణకు హాజరుకావాలని కూడా న్యాయస్థానాలు అదేశించాయి. సిటీ కోర్టు మొదలుకుని హైకోర్టు, దేశ సర్వోన్నత న్యాయస్థానం వరకు ఈ వ్యవహారం వెళ్లింది. ఈ కేసులో ఒకవేళ అయన సంస్థ దోషిగా తేలితే.. అది కేంద్రమంత్రి హోదాలో దేశానికే అపవాదు తీసుకోస్తుందన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి.

ఇప్పటికే పార్లమెంటుకు ఎన్నికైన నేతలు తమ శక్తియుక్తులను వినియోగించి.. పకడ్భందీ ప్రణాళిక వేసుకుని అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలన్న డిమాండ్ వుంది. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం కేవలం ఎంపీలేనని, వారు వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు కావడం వల్లే తమ వ్యాపార వ్యవహారాలను చక్కబెట్టుకునేందుకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారని. అంతేకాని నిజంగా రాష్ట్రాభివృద్ది కోసం కృష్టి చేయడం లేదని, అలా చేసుంటే ప్రత్యేక హోదా తప్పక వచ్చేదని ఇప్పటికే జనసేన అధినేత, సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్ కూడా విమర్శించారు.

అయినా అధికారంలో టీడీసీ మాత్రం రాజ్యసభకు ఎంపీలను పంపాల్సిన అవకాశం రాగానే మళ్లి పారిశ్రామిక వేత్తలే ఎన్నుకుంది. ఉన్నత విద్యావంతులు, మేధావులు, సంఘసంస్కర్తలకు ఇవ్వాల్సిన రాజ్యసభ సీట్లను పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, కాంట్రాక్టర్లకు ఇచ్చి రాజకీయాలను టీడీపీ భ్రష్టుపట్టిస్తోందని పలువురు టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక మరికోందరైతే టీడీపీ రాజ్యసభ టిక్కెట్లను అమ్మకుందని కూడా చెవులు కోరుకుంటున్నారు. ఇక మరికోందరు దీనికి మరింతగా ఊతమిస్తూ ఫలానా ధరకు అమ్ముకున్నారట అని కూడా ప్రచారం చేయడం కొసమెరుపు,

ఇంతలా వ్యతిరేక ప్రచారం మార్ర్మోగుతున్నా.. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో మిత్రపక్షంగా కోనసాగుతున్న తెలుగుదేశం మాత్రం ఈ విమర్శలను, అరోపణలను పట్టించుకోవడం లేదు. పార్టీ కోసం సేవ చేసిన వారికి  మాత్రమే తాము ప్రాధాన్యమిస్తామని చెబుతుంది, ఇదంతా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకోచ్చే ప్రణాళికలో భాగంగానే కోనసాగుతుందని చెబుతుంది, లోక్ సభకు ఎంపికైన ఎంపీలు గత రెండేళ్లుగా ఏం సాధించారో కానీ.. ఈ ఇద్దరు మాత్రం రాజ్యసభకు వెళ్లి ప్రత్యేక హోదా సాధిస్తారా,,? అని రాజకీయ విశ్లేషకులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles