raghuveera reddy | chandra babu | andhra pradesh | defections | TDP government | congress | YSRCP | Jagan mohan reddy

How is it fair raghuveera talks on defections in tdp government

TDP, CM Chandrababu, Raghuveera Reddy, Ap pcc chief, congress, ys rajashekar reddy, TRS, jagga reddy, Shara rani, mandadi satyanarayana, defections, manda jaganadham, adi keshavulu naidu, andhra pradesh, defections, TDP government, congress, YSRCP, Jagan mohan reddy

questions araise on ap pcc chief raghuveera reddy critisizing tdp government on defections, who in turn was silent in YS rajashekar reddy tenure as CM

ఇప్పుడు సంతలో పశువులేనా.. మరి అప్పుడో..?

Posted: 04/05/2016 04:04 PM IST
How is it fair raghuveera talks on defections in tdp government

రాజకీయ నేతలు మాటలు వారి స్థానాలను బట్టి మారిపోతుంటాయి. అంటే అధికార పక్షంలో వుంటే ఓ రకంగా, అదే విపక్షంలో వుంటూ మరో రకంగా అదే పరిస్థితులపై మాట్లాడుతుంటారు. ఒక సమస్యపై రెండు రకాలుగా స్పందించడం మనం చూస్తూనే వుంటాం. అధికారంలో వుండగా కరెక్టు అయ్యేది.. విపక్షంలో కొనసాగుతుండగా మాత్రం తప్పు ఎలా అవుతుందన్నది మాత్రం నాయకులకే తెలియాలి. సరిగ్గా పార్టీ ఫిరాయింపులపై ఆంధ్రప్రదేశ్ పిసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి స్పందన కూడా అలానే వుందంటూ విమర్శలు వస్తున్నాయి.

నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అంటూ తెలుగులో ప్రఖ్యాఖ నానుడి. సరిగ్గా ఆ నానుడిని పట్టుకునే పనులు చక్కబెడుతున్నాడు చంద్రబాబు. అంటే తన విపక్షంలోని పలువురు ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకుని తమలో ఒకరిగా కలుపుకుంటున్నారు. అయితే దీనిపై స్పందించిన రఘువీరా.. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు సంతలో పశువుల్లాగా కొంటున్నారని దుయ్యబట్టారు. ఆ ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నంత మాత్రాన ఆ పార్టీ బలపడిపోతుందా..? అని ప్రశ్నించారు.

ప్రజలంతా మరోవైపు ఉన్నారన్న విషయాన్ని బాబు గ్రహించ లేకపోతున్నారని పేర్కొన్నారు. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలోకి వెళ్లాలనుకునే వారు తమ పదవికి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల్లో నిలబడితే ప్రజలు ఎవరిపక్షాన ఉన్నారో తెలుస్తుందన్నారు. రైతులు, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసగించిన వారెవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు మాత్రమేనన్నారు. మిగతా విషయాలను పక్కనబెడితే.. టీడీపీ పార్టీపైన, ఆ పార్టీ అధ్యక్షుడిపైనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు రఘువీరా.

అయితే ఇవాళే ఇతర పార్టీలో ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరుతుండటంతో వారు పశువుల్లా కనబడుతున్నారా..? అంటూ కూడా ప్రశ్నలు తెరపైకివస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో అమాత్యులుగా వ్యవహరించిన రఘువీరా.. అప్పట్లో ఇరత పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి కలుపుకుంటే ఎందుకు మాట్లాడలేదని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు పలువురిని వైఎస్ తన రాజకీయ చతురతతో కాంగ్రెస్ లోకి చేర్చేకోలేదా అని ప్రశ్నించారు.

యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న వామపక్షాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసిన సందర్భంలో కూడా ఇతర పార్టీల ఎంపీలు ( టీఆర్ఎస్ కు చెందిన అలే నరేంద్ర, మహబూబ్ నగర్ కు చెందిన మందజగన్నాధంలలో) తమ ప్రభుత్వానికి మద్దుతుగా నిలిచిన విషయాన్ని రఘువరా మరిచారా అన్న రాజకీయ విశ్లేషకులు నిలదీస్తున్నారు. తాను చేస్తే శృంగారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అన్న రీతిలో పలు పార్టీలు అధికారంలో ఒకలా, విపక్షంలో మరోలా స్పందించడం మామూలే అని పెదవి విరుస్తున్నారు

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles