May YSRCP Leader Kodali Nani joininto TDP

May ysrcp leader kodali nani joininto tdp

TDP, Kodali Nani, Harikrishna, NTR, YSRCP, Krishna Dist

May YSRCP Leader Kodali Nani joininto TDP. TDP Leader and NTRs son attend jospital inauguration programmee in Krishna Dist.

తెలుగుదేశం పార్టీలోకి కొడాలి నాని..?!

Posted: 04/02/2016 04:38 PM IST
May ysrcp leader kodali nani joininto tdp

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని రాజకీయ పార్టీ మరోసారి మారుతున్నాడా.? అనే అంశం మళ్లీ తెర మీదకు వచ్చింది. కృష్ణా జిల్లా లబ్బిపేటలో ఎన్టీఆర్ వెటర్నరీ సూపర్ స్పెషాలటీ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వైసీపీ ఎమ్మెల్యే కొడాలినాని, నందమూరి హరికృష్ణ కలిసి ఇద్దరూ ఒకే కారులో వచ్చారు. ఈ కార్యక్రమానికి టీడీపీ మంత్రులు ప్రత్తిపాటి, దేవినేని ఉమ కూడా హాజరయ్యారు. అయితే హరికృష్ణతో కలిసి కొడాలి నాని రావడంపై పలువురు విశ్లేషకులు భిన్నఅభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన నాని హరికృష్ణ తనకు గురువులాంటివారని...ఆస్పత్రి నిర్మాణానికి గతంలో ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.కోటీ 6.54లక్షలు ఇచ్చారని గుర్తు చేశారు. దీనిపై ఎటువంటి రాజకీయకారణాలులేవని ..అలాంటి ఊహగానాలు అవసరంలేదన్నారు. తన రాజకీయ జీవితం మొత్తం జగన్ తో కలిసి ఉంటానని స్పష్టం చేశారు.

కొడాలి నానితో పాటు దేవినేని రాజశేఖర్ తనయుడు దేవినేని అవినాష్ హాజరయ్యారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న అవినాష్ కొద్దిరోజుల క్రితం వైసీపీ లో చేరుతారనే వార్తలు వచ్చాయి. అందుకు కసరత్తులు సిద్ధం చేసుకున్న అందుకు కార్యరూపం దాల్చలేదు. మరోవైపు గత కొద్దికాలంగా హరికృష్ణ ను టీడీపీ నుంచి దూరం చేయాడానికి సీఎం చంద్రబాబు ప్రయత్నించారని పొలిటికల్ వర్గాలు గుసగుసలాడుకున్నాయి.  రాజకీయ జీవితానికి ఎన్టీఆర్ పోటీ రాకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నారని చాలమంది భావన. ఇటీవల ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా విడుదల సమయంలో టీడీపీ నేతలు థియేటర్లు దొరక్కుండా అడ్డుకోవడం అప్పట్లో కలకలం రేపింది.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  Kodali Nani  Harikrishna  NTR  YSRCP  Krishna Dist  

Other Articles