PM Modi targets Opposition, NGOs before parliament session, Conspiracies daily to finish me

Pm modi conspiracy statement raises questions

modi, pm modi, chai wala modi, modi chai wala, odisha, modi in odisha, PM Narendra Modi,Modi government,Modi in Odisha, PM Modi targets Opposition, NGOs, parliament session, parliament budget session

Prime Minister Narendra Modi on Sunday alleged that disgruntled NGOs and black-marketeers were conspiring to destabilise the government and "defame" him raises questions.

ప్రధాని వ్యూహాత్మక వ్యాఖ్యలా..? లేక సానుభూతి వ్యాఖ్యాలా..?

Posted: 02/24/2016 12:27 PM IST
Pm modi conspiracy statement raises questions

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రతిపక్షాలు పలు ఎన్జీవో సంస్థలు నిత్యం కుట్ర పన్నుతున్నాయంటూ ప్రధాని నరేంద్రమోడీ చేసిన సంచలన వ్యాఖ్యలు అనేక ప్రశ్నలకు తెరలేపుతున్నాయి. రమారమి ముఫై సంవత్సరాల తరువాత ఏకఫక్ష మోజారిటీతో ఏర్పాటైన ప్రభుత్వ అధినేత నోట ఇలాంటి వ్యాఖ్యాలా..? అంటూ రాజకీయ విశ్లేషకులు విస్తుపోతున్నారు. గత ముఫ్పై సంవత్సరాలుగా సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా.. ప్రధానిగా పలువురు నేతలు బాధ్యతలు చేపట్టినా ఎవ్వరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మరి నరేంద్రమోడీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక అంతర్యామేమిటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

అధికారంలోకి రాగానే విదేశీ పర్యటనలు చేసి.. అక్కడి ప్రవాస భారతీయులతో సమావేశాలతో దేశ ఖ్యాతి పెంచేందుకు తాను కృషి చేస్తానని ప్రకటించిన నరేంద్రమోడీ.. ప్రధానమంత్రి హోదాలో చేసిన వ్యాఖ్యలతో దేశం పరుపును తీసే విధంగా వున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒడిశాలోని బరగఢ్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన విఫక్షాలను తూర్పరబడుతూ.. తన పరువు, ప్రతిష్ఠలను దిగజార్చేందుకు కొందరు అనుక్షణం ప్రయత్నిస్తున్నారని అరోపించారు.

అయితే తన ప్రభుత్వం వారి ఆటలు సాగనీయకుండా కఠినంగా వ్యవహరించడంతో చేసిది లేక అవి తనపై బురద జల్లుతున్నాయని కూడా ఆరోపించారు. రాజకీయాలలో విపక్షాలు అధికార పక్షాలపై బురదజల్లడం సాధారణమేనని ఆయనకు తెలియదా..? అన్న ప్రశ్నలు కూడా వినబడుతున్నాయి. బీజేపి ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీ పేరు ఖరారు కాగానే.. ఆయన చేసిన తొలి ప్రసంగంలోనే ఆయన అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని ఏకిపారేశారన్నది నిజం కాదా..? తాను అధికార పక్షాన్ని విమర్శించే హక్కు వున్నప్పుడు.. మరీ ఇప్పటి ప్రతిపక్షాలకు అధికార పక్షాన్ని విమర్శించే హక్కు లేదా...? ఇది ప్రధానికే తెలియాలి.

దేశానికి సంబంధించిన సున్నితమైన అంశాన్ని కూడా అప్పట్లో మోడీ ప్రచారాస్త్రాంగా చేసుకున్నారు. సరిహద్దులో ఇద్దరు భారత జవాన్ల శిరచ్చేధం చేసిన పాక్ బలగాలు.. వాటిని తీసుకుని వెళ్లడంపై కూడా మోడీ అనేక వ్యాఖ్యలు చేశారు. తన ఛాతి గురించి.. భారత బలగాల ధైర్యం గురించి మరి ఇంతటి సున్నితమైన అంశాలను ప్రచార అస్త్రాలుగా మర్చుకోవడం ప్రతిపక్ష నేతగా ఆయనకే చెల్లుతుందా..? ఆయనను ఎవరూ విమర్శించవద్దా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

భారత్ లాంటి దేశానికి  ఓ చాయ్ వాలా ప్రధానమంత్రి అయ్యారన్న నిజాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని, ఆయన సానుభూతి పోందే ప్రయత్నాన్ని చేశారు. ప్రధాని కాక ముందు ఈ వ్యాఖ్యలు చేసివున్నా.. లేక ఆయన ప్రభుత్వం సంకీర్ణంలో వున్నా ఈ వ్యాఖ్యలకు అత్యంత ప్రాధాన్యత లభించేంది. కానీ అధికారికంగా ప్రతిపక్షమే లేని విధంగా మోజారిటీని పార్లమెంటులో ఇచ్చిన తరువాత కూడా ఆయన ఈ తరహా వ్యాఖ్యలను చేయడంతో ఇటు ప్రతిపక్షాలతో పాటు అటు ప్రజలు కూడా విస్మయానికి గురవుతున్నారని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఇక చాయ్ వాలా అంశంపై ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యాలను సీపీఐ జాతీయ కార్యదర్శ సురవరం సుధాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రధాని చాయ్ వాలా కాదని, ఛాయ్ దుకాణం నడిపే యజమాని కుమారుడని పేర్కోన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కార్పోరేటర్ల కోసమే పని చేస్తోందని ఆరోపించారు. కార్పోరేట్ కంపెనీల కోసం 10 లక్షల కోట్లు లబ్ది చేకూర్చారని మోదీపై మండిపడ్డారు. మోడీ దించడానికి ఎవరు కుట్రలు చేస్తారని, ఒకవేళ చేస్తే కార్పోరేట్లే చేయాలని ఆయన తెలిపారు.

మత పరమైన విభజనతో అధికారంలోకి వచ్చీ దేశాన్నీ కాషాయికరణ చేయాలని బీజేపీ ప్రయత్నింస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఎన్‌యూలో జాతీ వ్యతిరేక వ్యాఖ్యల పేరుతో విద్యార్థులను వేధిస్తున్నారని ఆరోపించారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు ఎనాడైన పాల్గొన్నారా అని సురవరం ప్రశ్నించారు. బ్రీటీష్ తొత్తులను పార్టీలో చేర్చుకున్న చరిత్ర బీజేపీదేనని ఆయన గుర్తు చేశారు. జాతి వ్యతిరేక వ్యాఖ్యల పేరుతో దేశం విడిచిపోవాలి అంటున్నారని ఈదేశం ఎవడబ్బ సొత్తు కాదని సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు.

అయితే రాజకీయ విశ్లేషకులకు ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు వారి మదిని తొలుస్తున్నాయి. సరిగ్గా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు వెళ్తున్న సమయంలో ప్రధాని నరేంద్రమోడీ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారన్నది శేష ప్రశ్న. అయితే పార్లమెంటు సమావేశాలలో ప్రతిపక్షాలను ఈ అంశాలతోనే టార్గెట్ చేసి.. తమ పనులను తాము సజావుగా సాగించుకునే వ్యూహాత్మక యోచనలోనే ప్రధాని ఈ వ్యాఖ్యాలు చేసి వుండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా బీజేపి పితామహుడు వాజ్ పాయ్ ప్రభుత్వం ఒక్క ఓటుతో మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చినా.. సంకీర్ణంలో ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపినా.. ఆయన ఎనాడు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదన్న వాదనలు కూడా తెరపైకి స్తున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  pm modi  chai wala modi  parliament sessions  opposition  

Other Articles