Mysoora Reddy may start new party for Raayalaseema

Mysoora reddy may start new party for raayalaseema

Mysoora Reddy, YSRCP, Raayalaseema, Jagan, Shailajanath, YS Jagan

Mysoora Reddy may starts new political party for Raayalasema rights. Mysoora Reddy may quit from YSRCP.

మైసూరారెడ్డి రాయలసీమ కోసం పార్టీ..?!

Posted: 11/05/2015 03:28 PM IST
Mysoora reddy may start new party for raayalaseema

రాయలసీమ కేంద్రంగా మరో ప్రాంతీయ ఉద్యమం ఆరంభం కాబోతున్నదా? దీనికి వైసీపీ నేత ఎంవీ మైసూరారెడ్డి నాయకత్వం వహించనున్నారా? ప్రత్యేకంగా ఈ పోరాటం కోసం రాయలసీమ రాష్ట్ర సాధన సమితి ఆవిర్భవించబోతున్నదా? కొద్దిరోజులుగా మైసూరా నేతృత్వంలో విస్తృత స్థాయిలో సాగుతున్న సంప్రదింపులు, ప్రయత్నాలు ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే జవాబునిస్తున్నాయి. మైసూరా నివాసంలో జరిగిన భేటీ ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఈ భేటీలో వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి, శైలజానాథ్, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తదితరులతోపాటు మరికొందరు సీమ నేతలు కూడా హాజరయ్యారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ నెల 20న మైసూరా వైసీపీకి రాజీనామా ప్రకటించనున్నారని, ఆ మరుసటి రోజే ప్రత్యేకంగా రాయలసీమ రాష్ట్ర సాధన సమితి పేరిట పార్టీ, సంస్థను గానీ ప్రకటించనున్నారని తెలుస్తున్నది.

9 అంశాలతో సీమసాధన సమితి తెరపైకి వస్తోంది. నల్గొండ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కలుపుకుని ఏడు జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు పోరాడాలని ఈ సమితి నిర్ణయించింది. కోస్తా జిల్లాలకు చేస్తున్న లబ్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రాంతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టామని నేతలు తెలిపారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ రాయలసీమను కాపాడే విధంగా ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టాలనే ఉద్ధేశంతో ఉన్నట్లుగా సమాచారం. అయితే దీన్ని పార్టీ పరంగా చేస్తే కోస్తా ప్రాంతంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నందున మైసూరా రెడ్డిని పార్టీ నుంచి బయటకు పంపించి...ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలనే భావనతో... ప్రముఖ పాత్ర పోషించే విధంగా ఉన్నట్లుగా తెలియవచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mysoora Reddy  YSRCP  Raayalaseema  Jagan  Shailajanath  YS Jagan  

Other Articles