Janasena to contest in GHMC elections

Janasena to contest in ghmc elections

Janasena party, Pawan kalyan, Greater Hyderabad municipal corporation elections, GHMC elections, TDP, BJP, Pawan Kalyan Janasena party, 2014 GHMC elections.

Janasena party founder Pawan kalyan is planning to contest the forthcoming Greater Hyderabad municipal corporation elections under Janasenaparty, already ground work regarding GHMC elections has started says Pawan's camp. Pawankalyan joined hands with TDP and BJP alliance in 2014 election we have to wait and see how Pawan is going to play in GHMC elections whether he is going to be a part of alliance or is he coming out of the alliance ??.

గ్రేటర్ ఎన్నికల్లో జనసేన..?!

Posted: 11/06/2015 10:10 AM IST
Janasena to contest in ghmc elections

జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక పూర్తి స్థాయిలో పొలిటీషియన్ గా మారనున్నారా..? సినిమాలకు ఎండ్ కార్డ్ వేసి. జనాల్లోకి వస్తారా..? అనే అనుమానాలకు ప్రస్తుతానికి క్లారిటీ రాలేదు. కానీ దాదాపుగా అదే దారిలో పవన్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో జనసేన పార్టీకి రాజకీయ పార్టీ గుర్తింపు లభించింది.. కానీ ఎన్నికల గుర్తును మాత్రం ఇంకా కేటాయించలేదు. అయితే గతంలో జనసేన పార్టీని స్థాపించినప్పుడు ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా లోకసభ ఎన్నికల్లో మోదీకి, తెలుగు రాష్ట్రాల్లో టిడిపి, బిజెపి పార్టీలకు పసోర్ట్ చేశారు. అయితే ఇప్పటి దాకా పార్టీ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు. కాగా తాజాగా తెలంగాణలో ఎన్నికల సంఘం గుర్తింపు తర్వాత ఎన్నికల బరిలో నిలవాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారట.

ప్రజల పక్షాన నిలిచి.. వారి గొంతుకగా నిలవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అందుకే సొంతంగా జనసేన పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టిన తర్వాత ప్రజలు పవన్ కళ్యాణ్ కు బ్రహ్మరథం పట్టారు. మోదీతో కలిసి, చంద్రబాబుతో పాటు ఎన్నికల బరిలో ప్రచారం నిర్వహించారు. కాగా తాజాగా తాన పార్టీనే ఎన్నికల బరిలో నిలబెట్టాలని పవన్ యోచిస్తున్నారట. అందుకు గాను బిజెపి నాయకులు పవన్ తో చేసిన మంతనాలు దోహదపడ్డాయట. గ్రేటర్ ఎన్నికల్లో ఎన్డీయేతో పాటుగా జనసేన పార్టీని కూడా బరిలో దించాలని బిజెపి నాయకులు పవన్ కు చెప్పారట. అయితే దానికి పవన్ సానుకూలంగా స్పందించారట. జనవరిలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తారని సాగుతున్న ప్రచారం మీద పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వాలి. కానీ చాలా మంది మాత్రం ఎన్నికల్లో పోటీ అయితే తప్పదు. కానీ అదేదో గ్రేటర్ ఎన్నికల్లో ఎందుకు కాకూడదు అని అనుకుంటున్నారు. అయితే పవన్ చరిష్మా, గత ఎన్నికల్లో చేసిన ప్రచారం.. అమరావతి రాజధాని గ్రామాల్లో పర్యటన లాంటివి చాలా దోహదపడతాయి. మరి చూడాలి గ్రేటర్ బరిలో నిలుస్తారా లేదా..? అన్నది చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles