chandrababu actions and words repel

Chandrababu words say something and actions do different thing

Patti seema project, pattiseema without permission, polavaram project, chandrababu naidu, union minister, sanwar lal jat, Indian Water Resources Minister Sanwar Lal Jat, palmuru project, nalgonda project, Breaking news, general, politics, sport, entertainment, lifestyle, weird, world, india news, entertainment news, polavaram, national news, telugu news

Andhrapradesh chief minister chandrababu actions and words repel as his words say something and actions do different thing

బాబు.. నీ ద్వంద నీతికి అంతం లేదా..?

Posted: 07/25/2015 04:23 PM IST
Chandrababu words say something and actions do different thing

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ద్వంద నీతికి అంతం ఎక్కడ వుంటుందని వెతికినా.. కనబడే మార్గాలు మాత్రం అదృశ్యమవతున్నాయి. రెండు రాష్ట్రాలు విడిపోయినా.. తెలుగు ప్రజలు అందరూ ఒక్కటేనని చెప్పిన చంద్రబాబు.. రెండు రాష్ట్రాలు తనకు రెండు కళ్లని తన రెండు కళ్ల సిద్దాంతమే చివరకు గెలుస్తుందని ధీమాను వ్యక్తం చేసిన ఆయన.. తన ద్వంద నీతిని మాత్రం విడవటం లేదు. విపక్షంలో వున్న సమయంలో ప్రభుత్వంలో వున్నవారు అధికారమే పరమావధిగా  పావులు కదుపుతున్నారని గగ్గోలు పెట్టిన ఆయన సమైక్యరాష్ట్రంలో తొమ్మిదేళ్లు అధికారంలో వున్నపుడు చేసిందదేనని, ఇప్పడు ఏపీకి ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయన చేస్తున్నది అదేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లుగా మాటల్లో కోటలను దాటిస్తున్న చంద్రబాబు.. నిజానికి చేస్తున్నది మాత్రం వేరోకటి. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు ప్రాంతీయ అభివృధ్ది కోణంతో.. తెలంగాణ అనేక దశాబ్ధాలుగా అన్యాయానికి గురైందన్న విమర్శలతోనే ప్రత్యేక తెలంగాణకు పునాదులు పడ్డాయి. తెలంగాణ వనరులు, తెలంగాణ నీళ్లు, ఉద్యోగాలు, ఇలా అన్ని దోపిడికి గురయ్యాయని కేంద్రం బావించిన తరుణంలోనే తెలంగాణను 29వ రాష్ట్రంగా ప్రకటించింది. అయితే రాష్ట్ర పునర్విభజనతో రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడినా.. తనకు రెండు రాష్ట్రాలు సమానమని చెప్పే చంద్రబాబు దందనీతి మరోమారు బట్టభయలు అయ్యింది.

తెలంగాణ వ్యాప్తంగా తనకు అధికంగా పట్టువున్న మహబూబ్ నగర్ జిల్లాలలోని పాలమూరు ప్రాజెక్టు సహా, నల్లగొండ ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులని, వీటిని అనుమతి లేకుండా చేపడుతున్నారని కేంద్రానికి లేఖ రాయడంపై తెలంగాణ వాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. తెలంగాణ, ఆంధ్ర సమానమేనన్న చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు చెప్పేదోకటి, చేసేదోకటని ఆయన చర్యలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెండు కళ్ల సిద్దాంతం అని చెప్పుకునే బాబు.. తన ఒక కంట్లో నలుసు పడినా, దులాలు పడినా.. పట్టించుకోకుండా.. మరో కంటో మాత్రం ముందస్తు జాగ్రత్తాను పాటిస్తున్నారు. ఇటు తెలంగాణ జలప్రాజెక్టులపై అక్కస్సును వెళ్లగక్కుతున్న బాబు.. అటు సీమాంధ్ర ప్రాజెక్టులను మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నారు.

ఈ విషయన్ని స్వయంగా కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి సన్వర్‌లాల్ జాట్ పార్లమెంటులో స్పష్టం చేయడంతో విషయం వెలుగుచూసింది. పట్టిసీమ పోలవరంలో భాగం కాదని.. అసలు పట్టిసీమ ప్రాజెక్టు గురించి ఆంధ్రప్రదేశ్ తమకు ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి ప్రతిపాదనలు పంపకుండానే, కేంద్రం నుంచి ఆమోదం పొందకుండానే ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తోందని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ మేరకు కేంద్ర మంత్రి సన్వర్‌లాల్ జాట్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కాగా ఇన్నాళ్లు ఈ ప్రాజెక్టు పోలవరంలో భాగమని చెప్పి.. ఎన్ని అవాంతరాలు ఏర్పడినా ఈ ప్రాజెక్టును నిర్మాణ చేస్తామని చంద్రబాబు చెప్పారు.  గోదావరి నదిలో నీళ్ళు కృష్ణాబేసిన్‌కు తరలించడానికే పట్టిసీమ నిర్మిస్తున్నామని ఇన్నాల్లు చెప్పుకోచ్చిన చంద్రబాబు నోట్లో పచ్చివెలకాయ పడినట్లు అయ్యింది. దీంతో బాబు ద్వంద నీతి మరోమారు బట్టభయలైయ్యింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Patti seema project  polavaram  chandrababu  union minister  sanwar lal jat  

Other Articles