Love affairs, impotency, drugs also behind farmer suicides

Bku slams radha mohan singh for his reasons of farmers suicide

farmers, Suicide, Union minister, radha mohan singh, Union Agriculture Minister Radha Mohan Singh, ministry of agriculture, Punjab, farmers, Bhartiya Kisan Union, Breaking news, general, politics, sport, entertainment, lifestyle, weird, world, africa, news, entertainment news

Farmers' unions today slammed Union Agriculture Minister Radha Mohan Singh over his remark on the reasons of farmers committing suicides in the country and asked him to withdraw his observations immediately.

అధికార పోరలు వాస్తవాన్ని గ్రహించడం లేదా..?

Posted: 07/25/2015 04:21 PM IST
Bku slams radha mohan singh for his reasons of farmers suicide

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుంది కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ వ్యవహారం. దేశ ప్రజల అకలి తీర్చే అన్నదాతల అంశంలో అత్యంత దౌర్భాగ్యమైన వ్యాఖ్యలు చేసిన అన్నదాతలను చులకన చేయడంపై దేశవ్యాప్తంగా ఎందరో అన్నదాతలు ఆగ్రహంతో రగలిపోతున్నారు. దేశ ప్రజలకే కాక పలు వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా విదేశీయులు ఆకలికి అలమటించకుండా చూసుకోవడంతో ఆన్నదాతలు చేస్తున్న శ్రమ, పడుతున్న కష్టాన్ని గుర్తించకుండా.. కేంద్ర మంత్రి హోదాలో కొనసాగుతూ.. ఇంత నీచపు వ్యాఖ్యలు చేస్తారా..? అంటూ కర్షకులు మండిపడుతున్నారు.

డ్రగ్స్, లవ్ ఎపైర్స్, పిల్లలు పుట్టక పోవడం వంటి వ్యక్తిగత కారణాలతోనే అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కేంద్ర మంత్రి శెలవిచ్చారు. గతంతో ఎన్డీఏ అధికారంలో వున్న సమయంలో ఇదే ప్రశ్న అప్పటి కేంద్రమంత్రి బండారు దత్తత్రేయను మీడియా ప్రశ్నించిన సమయంలో ఆయన కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రైతులు తిండిలేక బలవన్మరణాలకు పాల్పడటం లేదని, తిండి ఎక్కువై మరణిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అయనే కాదు ఢిల్లీ ముఖ్యమంత్రిగా వరుసగా హ్యట్రిక్ సాధించిన షీలాదీక్షిత్ కూడా అధికారంలో వుండగా, పేదవాడి కుటుంబానికి రోజుకు ఆరు రూపాయలుంటే కడుపు నిండా బోజనం చేయవచ్చునని వ్యాఖ్యలు చేయడంతోనే తన పదిహేనేళ్ల పాలనకు ఢిల్లీ వాసులు చరమగీతం పాడారు.

పార్లమెంటు సాక్షిగా అధికారంలో వున్న పార్టీలు పేదప్రజలను, రైతులను ఎంత నీచంగా చూస్తున్నాయన్నదే ఇప్పుడు మన ముందుకు వస్తున్న ప్రశ్న. దేశంలో మార్పును తీసుకువస్తాం, పేదల ప్రజలకు, కర్షక, కార్మిక జనకోటికి మంచి రోజులను తీసుకువస్తామని చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని పార్టీ కూడా గత యూపీఏ గాడిన నడుస్తూ.. ఇలాంటి చౌకబారు ప్రకటనలు చేయడం ప్రజలను, వారి విశ్వాసాన్ని, నమ్మకాన్ని విస్తుపోయేలా చేస్తుందన్న విమర్శలు వినబడుతున్నాయి. అడిగిన అధికార పక్షంలో వున్నప్పుడు ఎవ్వరైనా సరే వాస్తవాలను గ్రహించజలరా..? అన్న ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి.

ఆరగాలం శ్రమించి పండించిన పంట చేతికందే సమయానికి ప్రకృతి ప్రకోపాలు విరుచుకుపడి చేతికందే పంట నష్టపోయిన అన్నదాత.. దిక్కుతోచని పరిస్థితుల్లో బలవన్మరణాలకు పాల్పడితే.. దానిని ప్రేమ వ్యవహారాలు, వ్యక్తిగత సంబంధాలుకు ముడిపెట్టి తమ పబ్బం గడుపుకునేందుకు కేంద్రమంత్రివర్యులు ప్రకటనలు గుప్పించగడం ఎంత దుర్లభమో అర్థం చేసుకోవచ్చు. చేసిన అప్పలు తీరక, కొత్త అప్పలు పుట్టక.. రైతులు తమ దీనస్థితికి తామే కారణమనుకుంటూ, తమను రైతులుగా పుట్టించినందుకు ఆ దేవుడిని శపిస్తు తమ వేదనను ఆయనకే చెప్పుకుంటు కాలన్ని వెల్లదీస్తున్నారు. వారి పరిస్థితులపై నోరువిప్పేందుకు విపక్షాలు యత్నించగా మంత్రివర్యులు వారిని ప్రేమ విఫలం కావడంతోనే మరణించారని వ్యాఖ్యానించడం ఎంత దురదృష్టకరం.

అదే మంత్రివర్యులు ప్రతిపక్షంలో వుంటే.. రైతుల ఆత్మహత్యలపై ఇలానే చౌకబారు ప్రకటనలు చేసి అధికారంలో వున్న విపక్షానికి బాసటగా నిలిచేవారా..? అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, విపక్షంలో వున్నప్పుడు మరోలా వ్యవహరించడం రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్యే కావచ్చు. కాని అధికార, విపక్షాలతో సంబంధం లేకుండా రైతులు కేవలం తమ శ్రమను, వరుణుడిని నమ్మకుని పంటలు పండిస్తున్నారన్న నగ్న సత్యాన్ని మాత్రం రాజకీయ నేతలు విస్మరించరాదు. ఆరుగాలం పండించే పంటలకు అనువనువునా గండాలే పోంచివున్న మొన్నవోని అత్మవిశ్వాసంతో రైతు పడుతున్న శ్రమతోనే మనం ముప్పూటలా బోజనం చేస్తున్నామన్న విషయాన్ని కూడా మర్చిపోరాదు. జై జవాన్, జై కిసాన్ అన్న సూక్తిని ఎంతగా గుర్తుంచుకుంటే అంత మంచిదన్న విషయం రాజకీయ నేతలు గుర్తెరుగాలి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : farmers  Suicide  Union minister  agriculture  

Other Articles