AP CM Chandrababu Naidu may likely to remove Prabhakar from ap media person

Ap cm chandrababu naidu may likely to remove prabhakar from ap media person

Chandrababu naidu, Prabhakar, Parakala, Media spoke person, Chandrababu naidu with prabhakar

AP CM Chandrababu Naidu may likely to remove Prabhakar from ap media person. Chandrababu naidu very anger on prabhakar for his bahaviour from past few days.

పరకాల పని గోవిందా..? మొదటి వేటు అతని మీదేనా..?

Posted: 07/27/2015 01:32 PM IST
Ap cm chandrababu naidu may likely to remove prabhakar from ap media person

ఏపి ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఓటుకు నోటు దగ్గర నుంచి గోదావరి పుష్కరాల వరకు ముఖ్యమైన అన్ని సమయాల్లో పరకాల వ్యవహరించిన తీరు పట్ల అసహనం వెలిబుచ్చినట్లు సమాచారం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది అయినందున కేబినెట్‌లో, సిఎం కార్యాలయంలో, ప్రత్యేకించి తన బృందంలో సమూల మార్పులు చేయాలనుకున్నారు ముఖ్యమంత్రి. ఓటుకు నోటు, జపాన్‌ పర్యటన, గోదావరి పుష్కరాలు వెంట వెంటనే రావడంతో ప్రక్షాళన వాయిదా పడింది. పుష్కరాలు పూర్తయినందున ఇక మార్పులపై దృష్టి సారిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రక్షాళన అంటూ మొదలు పెడితే తన టీంలోని పరకాల ప్రభాకర్‌పైనే తొలి వేటు పడొచ్చని అంచనాలు కడుతున్నారు. అందుకు పలు కారణాలను పేర్కొంటున్నారు.

ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారంటున్న ఆడియో టేపులు మీడియాలో హల్‌చల్‌ చేసిన కొద్ది సేపటికి సర్కారు తరఫున పరకాల మాట్లాడారు. ఆయన స్పందించిన తీరు బాగాలేదని అప్పుడే సిఎం అసంతృప్తి వెలిబుచ్చారని తెలిసింది. మంగళగిరి వద్ద నిర్వహించిన సంకల్ప సభలో సంవత్సర కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, విజయాలపై ప్రదర్శించేందుకు ఎంతో కష్టపడి సీడీని తయారు చేశారు. స్క్రీన్‌పై ఆ సీడి ప్రదర్శిస్తారని సభలో సిఎం ప్రకటిం చగా, పరకాల సీడీ మర్చిపోయారు. ప్రతిష్టా త్మకంగా నిర్వహించిన సంకల్ప సభ కోసం రూపొందించిన సీడీని మర్చిపోవడం ఏంటని..? పరకాలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పరకాల కొన్నాళ్లు అంటీముట్టనట్లున్నారు. మీడియా సమావేశాలకు దూరంగా ఉన్నారు.

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై నియమించిన కమిటీకి పరకాల ఛైర్మన్‌. ఏర్పాట్ల విషయంలో ఆయన పెద్దగా శ్రద్ధ పెట్టలేదని సిఎం అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. అసలు సమీక్షలు చేయలేదని, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం సాధించడంలో విఫలమ య్యారని అసహనంతో ఉన్నారని సమాచారం. పరకాల సరిగ్గా పని చేయనందున అన్నీ తానే చూసుకోవాల్సి వచ్చిందని రాజమండ్రిలో ఇటీవల జరిగిన కేబినెట్‌లో పరకాల పనితీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పుష్కరాల ప్రారంభం రోజున తొక్కిసలాటకు షార్ట్‌ ఫిలిం షూటింగ్‌ కారణమని పత్రికల్లో వార్తలొచ్చాయి. అనంతరం మీడియా సమావేశంలో పరకాల మాట్లాడుతూ నేషనల్‌ జియోగ్రాఫికల్‌ చానెల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించడంపై కూడా చంద్రబాబు అసహనంతో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఓటుకు నోటు వ్యవహారం తర్వాత తాను మీడియా సలహాదారుగా ఉండలేనని, తనను ఎంఎల్‌సి చేసి, మంత్రి పదవి ఇవ్వాలని పరకాల సిఎంకు ప్రతిపాదించినట్లు తెలిసింది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం అందుకు సుముఖంగా లేనట్లు తెలిసింది. కొన్ని మీడియాల్లో కూడా పరకాల పక్కనున్నాడు కాబట్టే అలా జరిగింది అంటూ చంద్రబాబుకు దొబ్బులు పెట్టాయి. మొత్తానికి ఏ ఎఫెక్టో తెలియదు కానీ పరకాల ప్యాకప్ చేసుకోవాల్సిందే అని వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles